ఆడియో సమీక్ష : ఊపిరి – కంటెంట్ కి ‘ఊపిరి’ పోసే ఆల్బమ్.!

ఆడియో సమీక్ష : ఊపిరి – కంటెంట్ కి ‘ఊపిరి’ పోసే ఆల్బమ్.!

Published on Mar 2, 2016 4:59 PM IST

Oopiri
టాలీవుడ్ స్టార్ కింగ్ నాగార్జున – కోలీవుడ్ స్టార్ కార్తీ కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘ఊపిరి’. తమన్నా హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. వరుసగా సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇస్తున్న గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. మొత్తం 7 పాటలు ఉన్న ఈ ఆల్బమ్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..
Pothaam
1. పాట : బెబే ఆగొద్దు
గాయకుడు : శంకర్ మహదేవన్
సాహిత్యం : మదన్ కార్కి

ఊపిరి ఆల్బమ్ లో మొదటి సోలో సాంగ్ ‘బెబే ఆగొద్దు’.. ఎలక్ట్రిక్ గిటార్, ట్రంబోన్ ని వాడుతూ స్టార్ట్ చేసిన సౌండ్స్ బాగున్నాయి. ఈ సాంగ్ సినిమాలో హీరో కార్తికి వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ గా చెప్పుకోవచ్చు. అందరినీ మోటివేట్ చేసేలా సాగే ఈ పాటలో మదన్ కార్కి మంచి సాహిత్యాన్ని అందించాడు. శంకర్ మహదేవన్ వాయిస్ ఈ సాంగ్ కి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఫైనల్ గా గోపి సుందర్ డ్రమ్ సెట్, త్రంబోన్ – ట్రంపెట్ ని మెయిన్ గా వాడుతూ మధ్య మధ్యలో గిటార్ ని వాడుతూ పాట ఫీల్ కి తగ్గా సౌండింగ్ ఇచ్చాడు.

oka-life
2. పాట : ఒక లైఫ్
గాయకుడు : కార్తీక్
సాహిత్యం : మదన్ కార్కి

ఒక హస్కీ వాయిస్ మరియు గిటార్ సౌండ్ తో ఈ పాటని మొదలు పెట్టిన విధానం చాలా వినసొంపుగా ఉంటుంది. ఈ పాటకి ప్రాణం పోసింది మాత్రం సింగర్ కార్తీక్.. లైఫ్ గురించి వివరరిస్తూ సాగే ఈ పాటలో మదన్ కార్కి ఎంతో అర్ధవంతమైన లైన్స్ ని రాసాడు, వాటిని అంతకన్నా బాగా పాడి పాటను సూపర్ హిట్ చేసాడు కార్తీక్. పాట మధ్య మధ్యలో వచ్చే హమ్మింగ్ చాలా బాగుంది, వినగానే అందరూ హమ్ చేసేలా ఉంది. వీరందరికీ మించి గోపి సుందర్ ఈ పాటలో అందించిన ట్యూన్స్ సూపర్బ్. పాటంతా ఒకటే వాయిద్యంతో కాకుండా గిటార్, లో బీట్ డ్రమ్స్, కీ బోర్డ్, వయొలిన్ ఇలా వాయిద్యాలను మారుస్తూ తన ట్యూన్ తో పాటని మరింత వినసొంపుగా చేసాడు. ఈ ఆల్బమ్ లో వినగానే నచ్చే సాంగ్ ఇదే..
seetakalam
3. పాట : అయ్యో అయ్యో
గాయనీ గాయకులు : రంజిత్, సుచిత్ర
సాహిత్యం : మదన్ కార్కి

దాదాపు తెలుగులో ప్రతి ఆల్బంలో ఉండే టిపికల్ మాస్ బీట్ డ్యూయట్ సాంగ్ ‘అయ్యో అయ్యో’. కార్తీ – తమన్నా మధ్య వచ్చే ఈ డ్యూయట్ కి రంజిత్ – సుచిత్రలు తమ వాయిస్ తో న్యాయం చేసారు. మదన్ కార్కి మాస్ టచ్ ఉన్న లైన్స్ ఓకే అనేలా ఉన్నాయి. మెయిన్ గా ఈ సాంగ్ వింటుంటే ట్యూన్ పరంగా, సింగింగ్ స్టైల్ పరంగా ‘శక్తి’ సినిమాలోని ‘సుర్రో సుర్రా’ సాంగ్ గుర్తుకు వస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ కూడా కొత్తగా లేకపోయినా ఓ మాస్ సాంగ్ కి తగ్గట్టు ఉంది. ఈ పాట విన్నప్పుడు మరియు స్క్రీన్ పైన మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

64. పాట : నువ్వేమిచ్చావో
గాయకుడు : విజయ్ ప్రకాష్
సాహిత్యం : మదన్ కార్కి

ఆల్బంలో వచ్చే బిట్ సాంగ్ ఇది.. ఇద్దరి మధ్య దూరాన్ని చెబుతూ, వారి మధ్య ఉన్న అనుభవాలను గుర్తు చేసుకునే ఈ పాటని ఒక ఎమోషనల్ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా ఉపయోగిస్తారని చెప్పవచ్చు. మదన్ కార్కి లైన్స్ ఎంత బాగున్నాయో అంతకన్నా బెటర్ గా విజయ్ ప్రకాష్ లైన్స్ ఉన్నాయి. గోపి సుందర్ సింపుల్ గా పాట వెనుక లో పిచ్ లో గిటార్ అండ్ కీ బోర్డ్ సౌండ్ తో పాటకి ప్రాణం పోసాడు.

75. పాట : పోతాం
గాయకులు : అనిరుధ్ రవిచంద్రన్, హరిచరణ్
సాహిత్యం : మదన్ కార్కి

రాకింగ్ ఎలక్ట్రిక్ గిటార్ సౌండ్ తో మొదలెట్టి ఆ తర్వాత దానికి డ్రమ్ బీట్స్ తో ఫుల్ జోష్ తో ఈ జాయ్ఫుల్ సాంగ్ మొదలవుతుంది. సినిమాలో నాగార్జున – కార్తీలు కలిసి పారిస్ అంతా ఎంజాయ్ చేసే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. మదన్ కార్కి రాసిన మీనింగ్ ఫుల్ అండ్ జాయ్ఫుల్ లిరిక్స్ కి అనిరుధ్ – హరిచరణ్ లు తమ వాయిస్ తో న్యాయం చేసారు. పాట మధ్యలో వచ్చే పోదామా పోదామా పోదామా లైన్స్ అండ్ హమ్మింగ్ బాగుంది. గోపి సుందర్ రాక్ సాంగ్ స్టైల్ లో కంపోజ్ చేసిన ట్యూన్ బాగుంది.

Door-No-Okkatti6. పాట : డోర్ నెంబర్ ఒకటి
గాయని : గీతామాధురి
సాహిత్యం : మదన్ కార్కి

తెలుగు ఆడియన్స్ కచ్చితంగా కోరుకునే ఐటమ్ నెంబరే ఈ ‘డోర్ నెంబర్ ఒకటి’ సాంగ్. తాగుబోతు రమేష్ వాయిస్ తో పాటని మొదలు పెట్టడం ఈ పాటకి ప్రధాన ఆకర్షణ. ఈ ఐటెం సాంగ్ కి గీతామాధురి తన వాయిస్ తో బాగా ఊపు తెచ్చింది. మదన్ కార్కి లైన్ కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రతి ఐటెం సాంగ్ లానే ఈ సాంగ్ కి గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. ఓవరాల్ గా ఆన్ స్క్రీన్ పై చూస్తున్నప్పుడు మాస్ ఆడియన్స్ చేత స్టెప్పులేయిస్తుందని చెప్పచ్చు.

57. పాట : ఎప్పుడు
గాయకుడు : కార్తీక్
సాహిత్యం : మదన్ కార్కి

‘ఊపిరి’ ఆల్బంలో వచ్చే మరో మెలోడియస్ విషాద గీతం ‘ఎప్పుడు’, అలాగే ఆల్బంలో కార్తీక్ పాడిన మరో పాట.. మదన్ కార్కి ఈ పాటలో చాలా మీనింగ్ ఫుల్ లిరిక్స్ ని రాసాడు, ఆ లిరిక్స్ ని కార్తీక్ చాలా స్పష్టంగా, ఎంతో ఫీల్ తో వినసొంపుగా పాడాడు. కార్తీక్ సాంగ్ కి పూర్తి న్యాయం చేయడం వలన ఈ పాటలో మనం తన వాయిస్ తో ట్రావెల్ అవుతాం. ఇక గోపిసుందర్ లో సౌండ్ డమ్స్ తో, వయొలిన్ ని ఉపయోగించి కంపోజ్ చేసిన ఈ సాంగ్ పాట మూడ్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. మొదటిసారి వినగానే నచ్చుతుంది.. అలా రెండు మూడు సార్లు విన్నారు అంటే మీరు ఈ పాటకి అడిక్ట్ అవుతారు.

తీర్పు :

నాగార్జున – కార్తీ కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానున్న ‘ఊపిరి’ సినిమా కాన్సెప్ట్ పరంగా ఎంత కొత్తగా ఉంటుందో, అంతే కొత్తగా మ్యూజిక్ ఆల్బమ్ కూడా ఉంది. ఆల్బంలోని 7 పాటల్లో 5 పాటలు చాలా అర్థవంతంగా, మెలోడియస్ గా ఉన్నాయి. వంశీ పైడిపల్లి ఎక్కడా కాన్సెప్ట్ నుంచి ఎక్కడా అవుట్ వెళ్ళకుండా గోపిసుందర్ నుంచి సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ కి సరిపోయే పర్ఫెక్ట్ ట్యూన్స్ ని రాబట్టుకున్నాడు. ఇక మదన్ కార్కి ఒక్కడే అన్ని పాటలు రాసినా, కథకి హెల్ప్ అయ్యేలా బాగా రాసాడు. ఆల్బంలో అన్ని పాటలు సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్ కావడం వలన వినగానే నచ్చేసే పాటలు ఏముండవు, కానీ వినగా వినగా కొన్ని మనసుకు హత్తుకుంటే, కొన్ని చూసేప్పుడు బాగా నచ్చుతాయి. ఈ 7 సాంగ్స్ కలిగిన ఆల్బంలో నా బెస్ట్ చాయిస్ అంటే – ఒక లైఫ్, అయ్యో అయ్యో మరియు ఎప్పుడు. ఇక ఇందులో ఉన్న ఐటమ్ సాంగ్స్ ఎప్పటిలానే మాస్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఫైనల్ గా ‘ఊపిరి’ ఆల్బమ్ ఎలా ఉంది అంటే.. సినిమా కంటెంట్ కి ‘ఊపిరి’ పోసే ఆల్బమ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు