ఓటిటి రివ్యూ : గాలివాన – జీ 5 లో తెలుగు సిరీస్

Gaalivaana Movie Review

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: రాధికా శరత్‌కుమార్, సాయి కుమార్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, నందిని రాయ్, తాగుబోతు రమేష్, ఆశ్రిత వేముగంటి, శరణ్య ప్రదీప్, చరిత్, నికిత శ్రీ, అర్మాన్, శ్రీలక్ష్మి.

దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి

నిర్మాతలు: సమీర్ గోగటే మరియు శరత్ మరార్

సంగీత దర్శకుడు: గౌర హరి

సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్

ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి

 

సాయి కుమార్, రాధిక శరత్‌ కుమార్ మరియు ఇతరులు నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అయిన గాలివాన ZEE5 ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది. అది ఎలా ఉందో చూద్దాం రండి.

కథ:

కొత్తగా పెళ్లి చేసుకున్న అజయ్ (చరిత్) మరియు గీత (నికిత శ్రీ) వరుసగా సరస్వతి (రాధిక శరత్‌కుమార్) మరియు కొమర్రాజు (సాయి కుమార్) పిల్లలు. ఎవరో యువకులను చంపడం మరియు ఆ హత్యలు వారి కుటుంబాలను కలవర పెడుతున్నాయి. దురదృష్టవశాత్తు, హంతకుడు ఆ కుటుంబాల ఇంటి వద్దకు వస్తాడు. హంతకుడిని కుటుంబీకులు ఏం చేశారు? హత్యల వెనుక హంతకుడి నినాదం ఏమిటి? సమాధానాలు తెలుసుకోవాలంటే గాలివాన సిరీస్ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

జీ 5 అసలైన సిరీస్, గాలివాన. BBC మినీ సిరీస్ వన్ ఆఫ్ అస్ కి అధికారిక తెలుగు రీమేక్ ఇది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మంచి కథను కలిగి ఉంది, తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ సిరీస్ కలిగిస్తుంది. సాయి కుమార్, రాధిక శరత్‌కుమార్, చాందిని చౌదరి, శరణ్య ప్రదీప్ మరియు చైతన్య కృష్ణల నటన చాలా బాగుంది. నటీనటులు తమ అద్భుతమైన నటనా నైపుణ్యంతో కథను మరింత ఆసక్తికరంగా మార్చారు.

ఈ సిరీస్ లో డైలాగ్స్ బాగున్నాయి, కథనం కూడా బాగుంది. సన్నివేశాలను ఎంగేజింగ్‌ గా తీర్చిదిద్దాలనే ఆలోచన దర్శకుడికి ఉన్నట్లు తెలుస్తోంది.

మైనస్ పాయింట్స్:

కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ, హత్యల వెనుక ఉన్న కారణాల వల్ల గాలివాన యావరేజ్ సిరీస్‌గా ముగుస్తుంది. ఈ హత్యలకు కారణం బలంగా మరియు నమ్మశక్యంగా ఉంటే సిరీస్ సూపర్ హిట్ అయ్యేది. మరోవైపు, సిరీస్‌ను ఇంటెన్స్ థ్రిల్లర్‌గా మార్చడానికి ఎపిసోడ్‌లలో స్క్రీన్‌ప్లే ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది.

గాలివాన సిరీస్ లో చాలా మంచి పాత్రలు ఉన్నాయి. కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ గా నటించిన నందిని రాయ్ ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది అని చెప్పాలి. ఆమె పాత్ర అంత కన్విన్సింగ్‌ గా లేదు. అలాగే సూర్య శ్రీనివాస్ పాత్ర కథకు అవసరం లేదు అని చెప్పాలి. కథను కాస్త పొడిగించడానికే దర్శకుడు కొన్ని పాత్రలు రాసుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు చైతన్య, శరణ్యలకు సంబంధించిన మరికొన్ని సన్నివేశాలు రాసి ఉంటే, కథనం కాస్త ఆసక్తి గా థ్రిల్లింగ్‌గా ఉండే అవకాశం ఉంది.

సాంకేతిక విభాగం:

మంచి కథ రాసుకుని, పాత్రలు చాలా చక్కగా డిజైన్ చేసినందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తూర్పు గోదావరి అందాలను అనేక ఫ్రేమ్‌లలో చూపించిన విధానం బాగుంది. గౌర హరి సంగీతం డీసెంట్‌గా ఉంది కానీ ఇంకా బాగా చేసే అవకాశం ఉంది. సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ పర్వాలేదు అని చెప్పాలి. అక్కడక్కడ కాస్త ట్రిమ్ చేయాల్సి ఉంది.

తీర్పు:

ఈ గాలివాన సిరీస్ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సాయి కుమార్, రాధికా శరత్‌కుమార్, మరికొందరు నటీనటుల అద్భుతమైన నటన ఆకట్టుకుంటుంది. రెండు ఎపిసోడ్‌ లలోని కొన్ని సన్నివేశాలు ఫార్వర్డ్ బటన్‌ను నొక్కేలా చేస్తాయి అని చెప్పాలి. క్లైమాక్స్‌ పోర్షన్‌ని బాగా రాసుకుని సిరీస్‌ని గొప్ప థ్రిల్లర్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కొన్ని సన్నివేశాలను మినహాయిస్తే, ఈ థ్రిల్లర్ ఈ వీకెండ్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం :