ఓటిటి సమీక్ష : “ఝాన్సీ” – తెలుగు సిరీస్ హాట్ స్టార్ లో

Jhansi Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 27, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అంజలి, చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, అభిరామ్ వర్మ, రామేశ్వరి తాళ్లూరి, తదితరులు

దర్శకులు : తిరు, గణేష్ కార్తీక్

నిర్మాతలు: కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాల

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: ఆర్వీ

ఎడిటర్: ఆంథోని

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

లేటెస్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యిన మరో తెలుగు కంటెంట్ “ఝాన్సీ”. మన తెలుగు నటులు అంజలి, చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు నటించిన ఈ సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వెళ్లినట్టయితే.. ఝాన్సీ(అంజలి) ఓ ఆమ్నీషియా పేషేంట్ కాగా ఈమె ఓ రోజు సంకీత్(ఆదర్శ్ బాలకృష్ణ) కూతురిని ఓ ప్రమాదం నుంచి కాపాడుతుంది. అయితే ఆ ఘటనతో సాకీత్ ఝాన్సీ ని ఆమె పరిస్థితి చూసి తనని కూడా తనతో హైదరాబాద్ కి తీసుకెళ్ళిపోతాడు. అయితే తాను అప్పటికే పోలీస్ గా వర్క్ చేస్తున్న తన భార్య నుంచి వేరుగా ఉంటాడు. మరి అక్కడ నుంచి ఝాన్సీ, సాంకీత్ లు కొత్త లైఫ్ ని స్టార్ట్ చెయ్యగా అక్కడ నుంచి ఊహించని విధంగా ఝాన్సీ కి తన గతానికి సంబంధించి కొన్ని కలలు వస్తూ ఉంటాయి. ఇంతకీ ఆమె కలలో కనిపిస్తుంది ఏంటి? ఈ ఝాన్సీ వెనుక ఉన్న కథ ఏంటి? ఆమె గతం ఎలా మర్చిపోయింది? మళ్ళీ ఆమె గతం తెలుస్తుందా అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ ని హాట్ స్టార్ లో చూడాల్సిందే

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ లో మెయిన్ గా కనిపించే పాత్రధారి అంజలి పెర్ఫామెన్స్ హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పాలి. అంజలి తనకి ఇచ్చిన ఇంట్రెస్టింగ్ పాత్రని అయితే చాలా బాగా రక్తి కట్టించింది. చాలా సన్నివేశాల్లో అయితే ఆమె నటన కానీ తాను పలికించిన ఎమోషన్స్ కానీ తన లోని నటి పటిమ ని చూపిస్తుంది. అలాగే ఈ సిరీస్ లో నటన అయితే తన కెరీర్ ఓ బెస్ట్ పెర్ఫామెన్స్ అని కూడా చెప్పొచ్చు.

ఇంకా ఈ చిత్రంలో ఈమె పాత్ర డిజైన్ చేయడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. ఆమె గతం ఏమిటి అనేది దానిపై చూపే సన్నివేశాలు సస్పెన్స్ గా మంచి థ్రిల్లింగ్ గా కనిపిస్తాయి. అలాగే ఇతర నటులు చాందినిచౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ లు తమ రోల్స్ లో అయితే డీసెంట్ నటన కనబరిచారు. ఇంకా మొదటి ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ టేకింగ్ కూడా ఇంప్రెసివ్ గానే అనిపిస్తుంది. అలాగే అంజలి చిన్ననాటి సీన్స్ ని స్టోరీ లో బాగా ఇమిడేలా చేయడం మెప్పిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ లో కొన్ని అంశాలు వరకు పర్వాలేదు కానీ ఇంకా కొన్ని అంశాలు అయితే అసలు కంప్లీట్ చెయ్యకుండా వదిలేసినట్టు అనిపిస్తుంది. అలాగే కొన్ని పాత్రలకి సంబంధించి కూడా డీటెయిల్స్ తక్కువే చూపించి నెక్స్ట్ సీజన్ లో మిగిలి ఉన్నట్టు ఉంచడం అంత ఆకట్టుకునే విధంగా అనిపించదు.

ఇంకా ఇందులో కథనం నడుస్తున్న కొద్దీ పరిచయం అయ్యే కొత్త పాత్రలు తో వాటి కథలూ కథనంలో మెయిన్ ఆసక్తిని పక్కదారి పట్టించినట్టు అనిపిస్తుంది. అలాగే లాస్ట్ రెండు ఎపిసోడ్స్ కూడా సిరీస్ మెయిన్ థీమ్ కి దూరంగా ఉన్నట్టు అనిపిస్తాయి.

వీటితో పాటుగా మరో డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అది నిడివి అని చెప్పాలి. సిరీస్ అంతా చాలా పెద్దదిగా డిజైన్ చేశారు. చాలా వరకు కొన్ని సన్నివేశాలు తగ్గించాల్సి ఉంది. అలాగే పలు సన్నివేశాల్లో అయితే లాజిక్స్ కూడా బాగా మిస్సయ్యాయి.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పాలి. నటీనటుల కాస్ట్యూమ్స్, శ్రీచరణ్ పాకల సంగీతం సిరీస్ కి బాగా ప్లస్ అయ్యింది. అలాగే అర్వి సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఇక ఎడిటింగ్ అయితే ఇంకా బెటర్ గా చెయ్యాల్సి ఉంది.

ఇక దర్శకులు తిరు, గణేష్ ల విషయానికి వస్తే వారు ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ దానిని పూర్తి స్థాయిలో ఆసక్తిగా అయితే ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయారు. కొన్ని అంశాలు వరకు పర్వాలేదు కానీ మిగతా చాలా అంశాల్లో నరేషన్ ఇంకా బాగా ఇచ్చి ఉంటే బాగుండేది. దీనితో వారి వర్క్ అయితే బిలో యావరేజ్ అని చెప్పాలి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఝాన్సీ” సిరీస్ లో డీసెంట్ స్టార్ట్ కనిపిస్తుంది. అలాగే అంజలి ఇంటెన్స్ పెర్ఫామెన్స్ కూడా బాగా అనిపిస్తుంది. కానీ తర్వాత ఇందులో నెమ్మదిగా ఆసక్తి మందగించడం కన్ఫ్యూజ్ గా మారే కథనం వంటివి బాగా దెబ్బ తీస్తాయి. మరి జస్ట్ ఓకే అనిపించే రేంజ్ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్టయితే ఆడియెన్స్ స్ట్రిక్ట్ గా ఒక్కసారికి మాత్రమే చూడొచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version