ఓటిటి రివ్యూ : “లోల్ సలామ్” – తెలుగు షో జీ5 లో ప్రసారం

ఓటిటి రివ్యూ : “లోల్ సలామ్” – తెలుగు షో జీ5 లో ప్రసారం

Published on Jun 26, 2021 12:59 AM IST
Lol Salaam Movie Review

విడుదల తేదీ : జూన్ 25,2021
123telugu.com Rating : 2/5

నటీనటులు: సందీప్ భరద్వాజ్, హర్ష వర్ధన్, వాసు ఇంటూరి, కివిష్ కౌటిల్య, పద్మిని సెట్టం
దర్శకుడు: నాని బండ్రెడ్డి
సంగీతం: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ : రాకేశ్ ఎస్ నారాయణ్
ఎడిటింగ్ : వెంకట కృష్ణ చిక్కల


ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 పలు ఆసక్తికర ఓటిటి కంటెంట్ ని అందిస్తూ వస్తుంది. మరి వారి నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో సరికొత్త సిరీస్ షో “లోల్ సలామ్” మరి ఈ సిరీస్ ఎలా ఉందొ సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

ఓ దుష్ట స్వభావం కలిగిన పొలిటీషియన్(హర్ష వర్ధన్) తనకి దగ్గరలోని ఓ గ్రామాన్ని తగలబెట్టేయ్యాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఆ దాడి నుంచి కొందరు నక్సలైట్లు ఆ గ్రామాన్ని గ్రామా ప్రజలని కాపాడాలని ప్రయత్నిస్తారు. మరి ఈ తప్పించుకునే క్రమంలో ఒక ఐదుగురు బ్యాచిలర్స్ ఆ నక్సలైట్స్ పెట్టిన ల్యాండ్ మైన్ బాంబులు మీద చిక్కుకుంటారు. మరి అక్కడ నుంచి కథ ఎలా తిరిగింది? వారు తప్పించుకుంటారా ఈ జర్నీ కామెడీగా మారిందా లేదా అన్నది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ వెబ్ షో లో మంచి థీమ్ ఆకట్టుకుంటుంది అలాగే దానికి అనుగుణంగా సాగే కథనం కూడా డీసెంట్ గా అనిపిస్తుంది. అలాగే నటీనటుల్లో బాబాయ్ రోల్ లో కనిపించిన వ్యక్తి మంచి నటన కనబరిచాడు. మంచి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ అన్ని ఆకట్టుకుంటాయి.

అలాగే మెయిన్ లీడ్ కవిస్ కౌటిల్య కూడా మంచి నటన కనబరిచాడు. అలాగే అక్కడక్కడా పేలే కామెడీ బాగుంది, ముఖ్యంగా ల్యాండ్ మైన్ కామెడీ ఎపిసోడ్స్ మంచి హిలేరియస్ అనిపిస్తాయి. ఈ స్టోరీకి తగ్గట్టుగా కనిపించే లొకేషన్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

అయితే ఇందులో డ్రా బ్యాక్స్ మాత్రం చాలా అంశాల్లో బాగానే కనిపిస్తాయి. కొన్ని కామెడీ సీన్స్ సిచుయేషన్ కి తగ్గట్టుగానే డిజైన్ చేసినా వాటిలో అనవసర లాజిక్ లు చిరాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఆ ల్యాండ్ మైన్ సీన్ లో ఓ సందర్భాన చాలా సిల్లీగా అనిపిస్తుంది.వీటితో పాటుగా కొన్ని సన్నివేశాల్లో మంచి ఎమోషన్స్ ని యాడ్ చెయ్యడానికి స్కోప్ ఉన్నా వాటిని ఎక్కడా చూపలేదు.

అలా నరేషన్ కూడా ఒక స్టేజ్ లో సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే ఆ ఫ్రెండ్స్ మరియు పోలీస్ ల నడుమ వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా కాస్త ఓవర్ గా వెగటుగా ఉంటాయి వాటికి తోడు వల్గారిటీ కూడా అనవసరంగా పెట్టినట్టు అనిపిస్తుంది. కొన్ని పాత్రలకి బ్యాక్ స్టోరీ ఒకటి యాడ్ చెయ్యడం అదెందుకో కూడా అర్ధం కాదు.

సాంకేతిక విభాగం :

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బానే ఉంటాయి అలాగే టెక్నీకల్ టీం విషయానికి వస్తే ముందు చెప్పినట్టుగా కెమెరా వర్క్ బావుంది మంచి లొకేషన్స్ విజువల్ గా కనిపిస్తాయి. అలాగే డైలాగ్స్ లో వల్గారిటీ ఎక్కువగా అనిపిస్తుంది.. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుణ్ణు.

ఇక దర్శకుడు నాని విషయానికి వస్తే ఇందులో కనిపించే కాన్సెప్ట్ ను బాగా తీసుకున్నాను కానీ దాన్ని హ్యాండిల్ చెయ్యడంలో లోటుపాట్లు క్లియర్ గా కనిపిస్తాయి. ఎక్కడా సీరియస్ నెస్ కానీ గ్రిప్పింగ్ నరేషన్ కానీ కనిపించదు. వాటికి తోడు ఇరికించిన ఎన్నో అనవసర సన్నివేశాలు పరమ బోర్ గా అనిపిస్తాయి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “లోల్ సలామ్” లో కొంతమంది ఫ్రెండ్స్ మధ్య కనిపించే సిల్లీ కామెడీ తప్ప ఇంకే అంశం కూడా గొప్పగా అనిపించదు. లాజిక్ లేని సన్నివేశాలు, సీరియస్ నెస్ లేని నరేషన్ అనేక చోట్ల లాజిక్స్ మిస్సవ్వడం షో ఫ్లో ని బాగా దెబ్బ తీస్తాయి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు