ఓటిటి రివ్యూ : “ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్” – అనుపమ పరమేశ్వరన్ షార్ట్ ఫిల్మ్

ఓటిటి రివ్యూ : “ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్” – అనుపమ పరమేశ్వరన్ షార్ట్ ఫిల్మ్

Published on Jan 16, 2021 4:04 PM IST

నటీనటులు : అనుపమ పరమేశ్వరన్, హక్కిం షాజహాన్

దర్శకత్వం : ఆర్జే షాన్

నిర్మాత : అఖిలా మిధున్

ఛాయాగ్రహణం : అబ్దుల్ రహీమ్

ఎడిటింగ్ : జోయెల్ కవి

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ “ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్”.అనుపమ పరమేశ్వరన్ టేక్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఈ షార్ట్ ఫిల్మ్ చంద్ర(అనుపమ పరమేశ్వరన్) అనే ఓ సామాన్య గృహిణి పడ్డ ఇబ్బందులు మనో వేదనకు తార్కాణంగా చూపిస్తుంది. ఆమె భర్త దాస్(హక్కిమ్ షాజహాన్)తో తన శారీరక జీవనం పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని గొడవలు పడుతుంది. అలాగే శారీరక స్వేచ్చకు సంబంధించి చెప్పే కొన్ని మాటలు కూడా ఒకింత ఆశ్చర్యకరంగా మరియు ఆలోచింపజేసేలా ఉంటాయి. మరి ఆమె ఆలోచనా శైలి తన తండ్రికి అలానే వారి జంట మధ్య పెద్ద గొడవను తీసుకొస్తుంది. మరి ఆమె ఎందుకు అలా మాట్లాడుతుంది? అసలు ఆమె చెప్పదలచుకుంది ఏంటి? ఇందులో ఏమన్నా సందేశం ఉందా అన్నవే ఇందులో అసలు కథ.

ఏమి బాగుంది?

ఈ షార్ట్ ఫిలిం పోస్టర్స్ అనౌన్సమెంట్ నుంచీ అనుపమ పరమేశ్వరన్ లోని కొత్త కోణమే అందరికీ కనిపించింది. ఇంతకు ముందు వరకు కేవలం కొన్ని పరిమిత పాత్రలకే స్టిక్ అయ్యి ఉన్న అనుపమ ఇలాంటి ఓ ఛాలెంజింగ్ రోల్ టేక్ చేసి దాన్ని అద్భుతంగా చేసింది అని చెప్పాలి. ఫ్రస్ట్రేట్ అయిన ఓ భార్య పాత్రలో అను చక్కగా ఇమిడిపోయింది.

అలాగే ఇందులో చూపించిన మెయిన్ సోల్ చాలా బలంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని ఎమోషన్స్ చూపించిన నిజాలు చాలా బాగా అనిపిస్తాయి. అలాగే అనుపమ పరమేశ్వరన్ చేసిన రోల్ అలాంటి గృహిణులకు కూడా కనెక్ట్ అవుతుంది. ఇక మరో మెయిన్ లీడ్ లో కనిపించిన హక్కిమ్ షాజహాన్ కూడా అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ను చూపించాడు.

మంచి నటనతో పాటుగా ఎమోషన్స్ లో కూడా బాగా హ్యాండిల్ చేసాడు. మరి అలాగే నిర్మాణ విలువలు కూడా బాగా కనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. కెమెరా వర్క్ కానీ బాక్గ్రౌండ్ స్కోర్ అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ ను ముగించిన విధానం చాలా కన్వీనెంట్ గా ఉంటాయి.

ఏమి బాగోలేదు?

ఇక ఈ షార్ట్ ఫిలిం లో డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అనుపమ రోల్ ఆమె తన జీవనం తాను పడే ఇబ్బందులు కోసం కంప్లైం చేసే దానిలోనే ఉందని చెప్పాలి. ఆమె భర్త తనకు అన్ని రకాలుగా స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో అనవసరంగా ఆమె పాత్ర కావాలనే ఇరికించినట్టు ఉంటుంది. అది అంత కన్వీనెంట్ గా ఉండదు. మరి అలాగే వీటి కారణంగా చూసినట్లయితే ఈ షార్ట్ ఫిల్మ్ ముగింపు కోణం ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటె బాగున్ను అనిపిస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్” ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ టచ్ అయ్యే రియలిస్టిక్ డ్రామా అని చెప్పాలి. మంచి ఎమోషన్స్ అనుపమ అవుట్ స్టాండింగ్ పెరఫామెన్స్ అలాగే స్ట్రాంగ్ ప్లే వంటివి విపరీతంగా ఆకట్టుకుంటాయి. అనుపమ నుంచి వచ్చిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా చూడదగింది మరియు మెచ్చుకోదగింది అని చెప్పొచ్చు.

Rating: 3.25/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు