ఓటిటి రివ్యూ : “పౌరష్ పూర్” – హిందీ సిరీస్(ఆల్ట్ బాలాజీలో ప్రసారం)

ఓటిటి రివ్యూ : “పౌరష్ పూర్” – హిందీ సిరీస్(ఆల్ట్ బాలాజీలో ప్రసారం)

Published on Dec 31, 2020 2:00 PM IST

నటీ నటులు : శిల్పా షిండే, మిలింద్ సోమన్, అన్నూ కపూర్, సాహిల్ సలాథియా, పౌలోమి దాస్, అనంత్ జోషి, షాహీర్ షేక్, ఫ్లోరా సైని

దర్శకత్వం : షచింద్ర వాట్స్

నిర్మాతలు : శ్రేష్ట భావ్నా, సచిన్ మోహితే

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ “పౌరష్ పూర్” ఆల్ట్ బాలాజీ లో అందుబాటులోకి ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

16వ శతాబ్దానికి చెందిన ఓ ఊహాజనిత ప్రాంతం పౌరష్ పూర్ లో చిత్రీకరించబడింది. మరి ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు భాను ప్రతాప్(అన్ను కపూర్) కేవలం ఆడవారిని శారీరిక ఆనందం కోసం మాత్రమే అన్న భావనలో ఉంటాడు. మరి అదే బాటలో తన రాజ్యంలోని యువతులను తన శారీరిక ఆనందం కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాడు. మరి ఈ క్రమంలో ఊహించని విధంగా వారంతా ఒక్కొక్కరిగా మాయం అవుతూ ఉంటారు. మరి ఘటనల వెనుక జరిగే అసలు కథ ఏంటి? ఈ మిస్టరీ చివరకు ఏమయ్యింది అన్నదే అసలు కథ.

 

ఏమి బాగుంది?

 

మొదటగా ఈ ఫిక్షనల్ సిరీస్ కోసం మాట్లాడాలి అంటే మొత్తం సెటప్ కోసం చెప్పుకోవాలి. మొత్తం 8 ఎపిసోడ్స్ కూడా చాలా నాచురల్ గా హై ఎండ్ గా కనిపిస్తాయి. మరి ఇంకా అలాగే నటీనటుల పెర్ఫామెన్స్ కూడా మంచి ఎస్సెట్ అని చెప్పాలి.మెయిన్ లీడ్ లో కనిపించిన అన్ను కపూర్ కామంతో రగిలే రాజు పాత్రలో సూపర్బ్ గా చేసాడు. అంతే కాకుండా అతనిలో నెగిటివ్ యాంగిల్ ను కూడా చాలా బాగా చూపించాడు.

ఇక అలాగే మరో కీలక రోల్ లో కనిపించిన మిలింద్ సోమన్ మరో మెయిన్ ఎస్సెట్ అని చెప్పొచ్చు. ట్రాన్స్ జెండర్ గా ఈ రోల్ లో అద్భుతంగా నటించారు. ఇక అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన వారు కూడా వారి పాత్రల పరిధి మేరకు మంచి నటన కనబరిచారు. మరి అలాగే నిర్మాణ విలువలకు వస్తే అమేజింగ్ అని చెప్పొచ్చు. కాస్ట్యూమ్ లు కెమెరా వర్క్ అయితే నెవర్ బిఫోర్ లా ఉంటుంది.

 

ఏమి బాగాలేదు?

 

ఈ సిరీస్ లో ముందు చెప్పినట్టుగా విజువల్స్ చాలా బాగుంటాయి, కానీ మేకర్స్ వాటి మీదనే ఎక్కువ దృష్టి పెట్టరేమో మిగతా కొన్ని అంశాలు పేలవంగా అనిపిస్తాయి. సరైన నరేషన్ ఎక్కడా కనిపించలేదు. అలాగే స్క్రీన్ ప్లే కూడా అంత ఆకట్టుకునే విధంగా కనిపించదు.

మరి ఇంకా అలాగే కొన్ని సన్నివేశాలు కానీ కథనం కానీ చాలా సిల్లీగా ఓవర్ గా అనిపిస్తాయి. అంతే కాకుండా గ్రాఫికల్ వర్క్ కొన్ని సన్నివేశాల్లో అంతగా ఆకట్టుకోదు. మరో పెద్ద డ్రా బ్యాక్ ఏంటి అంటే డైరెక్షన్ అని చెప్పాలి బోల్డ్ లైన్ ను పట్టుకున్న షచింద్ర వాట్స్ దాన్ని పూర్తి స్థాయిలో ఆసక్తిగా చూపించలేకపోయాడు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “పౌరుష్ పూర్” సిరీస్ ఉన్నతమైన నిర్మాణ విలువలు కలిగి ఉంది తప్పితే మిగతా ఏ అంశాల్లో కూడా ఆకట్టుకునే రీతి కనిపించదు. లీడ్ క్యాస్టింగ్ ఓకే అనిపిస్తుంది. కానీ మిగతా అన్ని అంశాలు కూడా ఓవర్ గా సిల్లీగా మరియు బోరింగ్ గా అనిపిస్తాయి. మరి ఈ సిరీస్ కు కాస్త దూరంగానే ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.

Rating: 2.25/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు