ఓటీటీ రివ్యూ : ‘ఓ మై డాగ్’ (అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం)

ఓటీటీ రివ్యూ : ‘ఓ మై డాగ్’ (అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం)

Published on Apr 26, 2022 2:50 AM IST
Oh My Dog Movie Review

విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విజయ్ కుమార్, అరుణ్ విజయ్, ‘మాస్టర్’ అర్ణవ్ విజయ్, వినయ్ రాయ్ తదితరులు

దర్శకత్వం : సరోవ్ షణ్ముగం

నిర్మాతలు: సూర్య, జ్యోతిక

సంగీత దర్శకుడు: నివాస్ కె. ప్రసన్న

సినిమాటోగ్రఫీ: గోపీనాథ్

ఎడిటర్ : మేఘనాథన్

సీనియర్ నటుడు విజయ్ కుమార్, ఆయన కొడుకు అరుణ్ విజయ్‌, మనవడు అర్ణవ్ విజయ్ తాత, తండ్రి, మనవడు పాత్రల్లో నటించిన సినిమా ‘ఓ మై డాగ్’. కాగా హీరో సూర్య నిర్మించిన ఈ ‘ఓ మై డాగ్’ మూవీ గురువారం నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఫెర్నాండో (వినయ్ రాయ్)కు చెందిన కుక్కలు వరుసగా ఆరు సార్లు ఇంటర్నేషనల్ ఎజిలిటీ ఛాంపియ‌న్‌షిప్‌ ఫర్ డాగ్స్ టైటిల్ విజేతలుగా నిలుస్తాయి. పైగా ఫెర్నాండోకి కుక్కలంటే ప్రాణం. ఈ క్రమంలో ఫెర్నాండో క్రూరుడుగానూ మారతాడు. తన దగ్గర ఉన్న ఓ కుక్క పిల్లకు చూపు లేదని దాన్ని చంపేయమంటాడు. చంపే లోపే ఆ కుక్కపిల్ల తప్పించుకుని పారిపోతుంది. శంకర్ (అరుణ్ విజయ్), శంకర్ కొడుకు అర్జున్ (అర్ణవ్ విజయ్)కు అది దొరుకుతుంది. ఇంటికి తీసుకెళ్తారు. తాతయ్య (విజయ్ కుమార్)కు అది ఇష్టం ఉండదు. కానీ ఆ తర్వాత ఆ కుక్కపిల్ల వల్లే ఆయన గుండెపోటు నుండి బయటపడతాడు. చివరకి ఫెర్నాండోకు సింబా కారణంగా ఎలాంటి ఎదురుదెబ్బ తగిలింది? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్లు:

 

‘అరుణ్ విజయ్’ తనయుడు అర్ణవ్ విజయ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కీలక సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయి. సినిమా మొత్తం అర్ణవ్ పై ఆధారపడి సాగుతుంది. చిన్న పిల్లవాడిగా అర్ణవ్ తన కీలక పాత్రలో చాలా బాగా చేసాడు. కుక్కపిల్లతో అర్ణవ్ సన్నివేశాలన్నీ డీసెంట్‌గా ఉన్నాయి.

మహిమా నంబియార్ మరియు విజయ కుమార్ వంటి ఇతర సహాయ నటులు తమ పాత్రలకు తగ్గట్టు చాలా బాగా నటించారు. మూడు తరాల చిన్నపిల్లల మధ్య అనుబంధాన్ని ప్రదర్శించిన విధానం కూడా చాలా బాగుంది. తండ్రి పాత్రలో నటించిన ‘అరుణ్ విజయ్’ కూడా చాలా బాగా నటించాడు.

 

మైనస్ పాయింట్లు:

 

ఈ చిత్రంలో వినయ్ రాయ్ మెయిన్ విలన్‌గా నటించాడు. అతను చాలా సన్నివేశాలలో అతిగా నటించిన ఫీలింగ్ కలుగుతుంది. కుక్కపిల్ల మరియు దాని యజమాని మధ్య భావోద్వేగాలు కొంచెం ఎలివేట్ చేయాల్సింది. అలాగే కీలక సీన్స్ అన్నీ మరింత ఎమోషనల్‌గా మరియు ఇంకా గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది.

ఇక టార్గెట్ ప్రేక్షకులు పిల్లలు కావడంతో, దర్శకుడు చాలా విషయాలను, అలాగే ప్లేను చాలా తేలికగా ఎలివేట్ చేస్తూ వెళ్ళాడు. దాంతో పెద్దవాళ్లకు సరిగ్గా కనెక్ట్ కాదు. ఇక కథనం చాలా సన్నివేశాల్లో ఆకస్మికంగా మారుతుంది. పైగా కథనంలో ఇంట్రెస్ట్ కలిగించే ఎలాంటి డ్రామా లేదు.

సెకండాఫ్‌లో ప్లేకి సంబంధించిన విషయాలు ఇంకా బెటర్ గా ఉండాలి. పైగా ఈ చిత్రం యొక్క మరొక లోపం కథ. అలాగే ఎగ్జిక్యూషన్ పరంగా కూడా సెకండ్ హాఫ్ చాలా డల్ గా మరియు బోరింగ్ గా ఉంది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. అయితే, కొన్ని సీన్స్ ను బాగా తెరకెక్కించారు. ఇక ఎడిటింగ్ చాలా క్రిస్పీ గా ఉంది. ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయింది. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

 

‘ఓ మై డాగ్’ అంటూ వచ్చిన ఈ డాగ్ డ్రామా మంచి సెటప్ తో మంచి ఫీల్ తో స్టార్ట్ అయింది. కానీ, కథనంలో ఫోకస్ లేకపోవడం, స్లో ప్లే, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి విషయాలతో సినిమా అస్తవ్యస్తంగా ఉంది. ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయేలా సరైన డ్రామా ఈ సినిమాలో లేదు. కాబట్టి ఈ సినిమా చాలా డల్ గానే సాగింది. కాకపోతే పిల్లలకు ఈ సినిమాలోని కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు