ఓటిటి సమీక్ష : ప్లాన్ ఏ ప్లాన్ బి – నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఫిలిం

ఓటిటి సమీక్ష : ప్లాన్ ఏ ప్లాన్ బి – నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఫిలిం

Published on Oct 2, 2022 3:02 AM IST
Plan A Plan B Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 30, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: రితేష్ దేశ్ ముఖ్, తమన్నా భాటియా, పూనమ్ థిల్లాన్, కుశ కపిల

దర్శకత్వం : శశాంక ఘోష్

నిర్మాతలు: త్రిలోక్ మల్హోత్రా, కేఆర్ హరీష్, రజత్ అరోరా

సంగీతం: బన్ చక్రబర్తి, యుగ్ భుషల్

సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి

ఎడిటర్:

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల మంచి కంటెంట్ తో తెరకెక్కిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రసారం అవుతున్నాయి. ఆ విధంగా బాలీవుడ్ లో లేటెస్ట్ గా తెరకెక్కిన ప్లాన్ ఏ ప్లాన్ మూవీ నేటి నుండి నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క రివ్యూ ని ఇప్పుడు చూద్దాం.

 

కథ :

మిస్టర్ కౌస్తుబ్ చౌగులే విడాకుల కేసులు వాదించడంలో మంచి పేరుగాంచిన లాయర్. స్వతహాగా సైకాలజిస్ట్ అయిన నిరల్ ఓరా, ఆ తరువాత పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యక్తిగా, కౌస్తుబ్ ఆఫీస్ ప్రాంగణంలో సరికొత్తగా నెలకొల్పిన తమ ఆఫీస్ కి ఎంట్రీ ఇస్తుంది. నిజానికి ఈ ఇద్దరి ప్రొఫెషన్స్ తో పాటు ఆలోచనలు కూడా పూర్తిగా విరుద్ధం కావడంతో ఇద్దరు పలు సందర్బాల్లో చిన్న చిన్న గొడవలు పడుతుంటారు. అయితే ఆ తరువాత అదే సరదా గొడవలు వారిద్దరి మధ్య ప్రేమకు దారితీయడం, అనంతరం వారి జీవితం ఎలా సాగింది అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ముందుగా హీరోగా లాయర్ పాత్రలో కనిపించిన రితేష్ దేశ్ ముఖ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసారు అనే చెప్పాలి. తన భార్య చేత వంచించబడిన వ్యక్తిగా అలానే తన కేసులు నిశితంగా వాదించే లాయర్ గా ఆయన పెర్ఫార్మన్స్ సూపర్. అలానే పెళ్లి సంబంధాలు కుదిర్చే అమ్మాయిగా తమన్నా భాటియా కూడా ఎంతో ఒదిగిపోయి నటించింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి.

ఉదాహరణకు తమన్నా బాగా మద్యం సేవంచిన సమయంలో హీరోని పిలిచి మాట్లాడే సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఫక్తు రొటీన్ గా ఉన్నప్పటికీ ఒకింత ఆడియన్స్ కి కొంత కనెక్ట్ అవుతాయి అనే చెప్పాలి. ఇక 1 గంట 45 నిమిషాల తక్కువ రన్ టైం అనేది ఈ మూవీకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అనొచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

అసలు ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో కథనం ఏ మాత్రం ఆకట్టుకోని సినిమాల్లో ఇది ప్రధమంగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు ఏమాత్రం పండలేదు సరికదా పలు క్యారెక్టర్స్ మధ్య అవి పెద్దగా ఆకట్టుకునే విధంగా తెరకెక్కలేదు. మొత్తంగా సినిమా అటు కామెడీ అని కాకుండా ఇటు రొమాంటిక్ ఎంటర్టైనర్ అని కాకుండా అలా అలా ముందుకు నడిపాడు దర్శకుడు. ముఖ్యంగా ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమా విషయంలో రైటర్స్ విభాగం పూర్తిగా నిర్లక్ష్యం వచించింది అని చెప్పాలి. అద్భుతమైన నటుల్ని మంచి పాయింట్ ని తీసుకున్నప్పటికీ దానిని స్క్రీన్ పై ఆడియన్స్ ని అలరించేలా కథనం రాసుకోలేదు. అలానే పూనమ్ థిల్లాన్ వంటి టాలెంటెడ్ నటి ఉన్నపటికీ సినిమాలో ఆమెది కేవలం చిన్న పాత్ర కావడం కూడా పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇటీవల ఓటిటి లో వస్తున్న చాలా వరకు సినిమాలు మంచి వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతుండగా ఈ మూవీని మాత్రం ఫక్తు రొట్ట రొటీన్ కథ, కథనాలు తీసుకుని తెరకెక్కించడం నిజంగా ఆశ్చర్యకరం.

 

సాంకేతిక వర్గం :

ఈ మూవీకి సంగీతం అందించిన మ్యూజికల్ ద్వయం బన్ చక్రబర్తి, యుగ్ భుషల్ ఇద్దరూ మూవీకి మంచి సాంగ్స్, బీజీఎమ్ అందించారు. సినిమాలో వచ్చే పలు లొకేషన్స్ అదిరిపోతాయి. అలానే సినిమాటోగ్రఫీ, భారీ నిర్మాణ విలువలు వంటివి మూవీలో బాగున్నాయి. దర్శకుడు శశాంక ఘోష్ సినిమాని ఏ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీయలేదు, అలానే గతంలో వచ్చిన కిక్, డర్టీ పిక్చర్ సినిమాలకు మంచి కథలు అందించిన కథకుడు రజత్ అరోరా ఈ మూవీకి కూడా వర్క్ చేసారు అంటే నమ్మలేము. కనీసం నేటి మానవ సంబంధాలకి సంబంధించి కూడా సరైన తీరున సన్నివేశాలు రాసుకోలేకపోయారు రైటింగ్ టీమ్.

 

తీర్పు :

ఫైనల్ గా చెప్పాలి అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమాని ఈవారం మన వాచింగ్ లిస్ట్ నుండి తీసేస్తే బెటర్ అనే చెప్పాలి. రితేష్ దేశ్ ముఖ్, తమన్నా భాటియా, పూనమ్ థిల్లాన్ వంటి దిగ్గజ నటులు ఉన్నా, ఏ మాత్రం అలరించని రొట్ట కథ, కథనాలతో తెరకెక్కించిన ఈ మూవీ ఏ ఒక్క వర్గం ఆడియన్స్ ని కూడా పెద్దగా ఆకట్టుకోదు. దర్శకుడు శశాంక ఘోష్ ఆడియన్స్ నాడి పట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు అనే చెప్పాలి.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు