విడుదల తేదీ : జూన్ 14,2021
123telugu.com Rating : 2.75/5
నటీనటులు: సునీల్ గ్రోవర్, రణవీర్ షోరే, ముకుల్ చాధా, ఆశీష్ విద్యార్థి
దర్శకులు : వికాస్ బాహ్ల్, రాహుల్ సేన్‌గుప్తా
నిర్మాత: వరుణ్ ఖండేల్వాల్, షిబాసిష్ సర్కార్
సినిమాటోగ్రఫీ :రవేంద్ర సింగ్ భదౌరియా, సుధాకర్ రెడ్డి
ఎడిటింగ్ : ప్రతీక్ హరుగోలి
ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ “సన్ ఫ్లవర్”. జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులోకి ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి..
కథ :
ఈ వెబ్ సిరీస్ లో స్టోరీ సెటప్ అంతా సన్ ఫ్లవర్ అనే అపార్ట్మెంట్ లో సెట్ చేసి ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ లో తన వైవాహిక బంధం నుంచి విడిపోయిన ఓ డబ్బున్న వ్యక్తి అనుమానాస్పదంగా మర్డర్ చేయబడతాడు. మరి ఈ మర్డర్ కి సోను(సునీల్ గ్రోవర్) అనే బ్యాచులర్ నిందితుడిగా చిత్రీకరించబడతాడు. మరి అక్కడ నుంచి జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది? అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు? సోను నిర్దోషా కాదా అన్నది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
జెనరల్ గా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో సరైన కామిక్ యాంగిల్ ను కనుక పెడితే అది మరింత ప్లస్ అయ్యి ఎంటర్టైన్ చేస్తుంది. ఆ ఎంటర్టైనింగ్ యాంగిల్ ఈ సిరీస్ లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సునీల్ గ్రోవర్ టైమింగ్ ఇందులో బాగా కనిపిస్తుంది. అలాగే తన కామెడీ టైమింగ్ తో పాటుగా మంచి నటనను కూడా అతడు కనబరిచాడు.
అలాగే ఈ సిరీస్ లో కొన్ని ఇన్వెస్టింగేషన్ సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్ లోని ట్విస్ట్ కూడా డీసెంట్ గా అనిపిస్తుంది. మరి వారితో పాటుగా పోలీస్ రోల్ లో నటించిన రణ్వీర్ షోరే ఈ సిరీస్ లో మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు అలాగే నటుడు ఆశిష్ విద్యార్థి కూడా మంచి నటనను కనబరిచాడు.
మైనస్ పాయింట్స్ :
అయితే ఈ సిరీస్ స్టార్టింగ్ లో సెటప్ అంతా మంచి డీసెంట్ గానే స్టార్ట్ అయినా మొదటి మూడు ఎపిసోడ్స్ వరకు బాగానే ఉంటుంది. కానీ నాలుగో ఎపిసోడ్ నుంచి కాస్త డౌన్ అయ్యినట్టు అనిపిస్తుంది. అక్కడ నుంచి మొదటి మూడు ఎపిసోడ్స్ తో పోలిస్తే కాస్త గ్రిప్ తగ్గినట్టు అనిపిస్తుంది.
అలాగే మెల్లగా సాగే నరేషన్ అక్కడక్కడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పై ఆసక్తి తగ్గిస్తుంది. వీటికి తోడు కొన్ని అనవసరమైన పాత్రలు కూడా ఎక్కువగా అనిపిస్తాయి. అలాగే కొన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ లో కూడా పలు లాజిక్స్ మిస్సయ్యాయి.
సాంకేతిక వర్గం :
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే టెక్నికల్ టీం వర్క్ కి వస్తే మొట్ట మొదటిగా మ్యూజిక్ కోసం చెప్పాలి. నరేషన్ కి తగ్గట్టుగా మంచి ఇంపాక్ట్ ను ఈ సిరీస్ లో బి జి ఎం ఇస్తుంది. అలాగే కెమెరా వర్క్ బాగుంది కానీ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది.
ఇక వికాస్ భేల్, రాహుల్ సేన్ గుప్తాల డైరెక్షన్ విషయానికి వస్తే.. ఈ సిరీస్ కి థ్రిల్ తో పాటు కాస్త కామెడీ కూడా జోడించినా అవి ఓవరాల్ గా అంత సంతృప్తి పరచవు.. అలాగే నరేషన్ ను ఇంకా బాగా రాసుకొని ఉంటే బాగుండేది. ఫైనల్ గా మాత్రం తన వర్క్ బిలో యావరేజ్ మాత్రమే అని చెప్పాలి.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “సన్ ఫ్లవర్” సిరీస్ లో థ్రిల్ తో పాటు మంచి కామెడీ ఒకింత వరకు బాగా అనిపిస్తుంది..అలాగే నటీనటుల పెర్ఫామెన్స్ లు ప్రామిసింగ్ గా అనిపిస్తాయి. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే మెయిన్ ఫాల్ట్ ఉండడంతో ఓవరాల్ గా మాత్రం ఈ సిరీస్ బిలో యావరేజ్ గా ఓకే అనిపిస్తుంది అంతే..
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team