ఓటిటి సమీక్ష: వాళ్లిద్దరి మధ్య – ఆహాలో తెలుగు సినిమా

ఓటిటి సమీక్ష: వాళ్లిద్దరి మధ్య – ఆహాలో తెలుగు సినిమా

Published on Dec 17, 2022 3:02 AM IST
Valliddari Madhya Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 16, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ, వెంకట్ సిద్దారెడ్డి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణకాంత్, తదితరులు

దర్శకుడు : V.N. ఆదిత్య

నిర్మాతలు: అర్జున్ దాస్యన్

సంగీత దర్శకులు: మధు స్రవంతి

సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్. కొలంచి

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం డైరక్ట్ గా ఆహా వీడియో లో విడుదలైంది. ఈ చిత్ర ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వరుణ్ (విరాజ్ అశ్విన్) పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రుల బాగోగులు చూసే బిజినెస్ ను ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అన్వయ (నేహా కృష్ణ) తల్లిదండ్రులు వరుణ్‌కి క్లయింట్లుగా మారతారు. అన్వయను చూడగానే వరుణ్ ప్రేమలో పడతాడు. అన్వయ కూడా అతనిని ప్రేమిస్తుంది. కానీ, వరుణ్ మరియు అన్వయ ల ఈగోలు వారి రిలేషన్ పై ప్రభావితం కావడం తో అసలు సమస్య మొదలవుతుంది. లీడ్‌ పెయిర్‌ తమ ఈగోలను ఎలా పరిష్కరించుకున్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈగోల కారణం గా రిలేషన్‌షిప్‌ చెడిపోకూడదనే సినిమా ప్రాథమిక ఆలోచన బాగుంది. విరాజ్ అశ్విన్, తన పాత్రను చాలా చక్కగా పోషించాడు. స్క్రీన్ పై చాలా అందం గా కనిపించాడు. ఈ చిత్రంలో తన డాన్స్ ను కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది. హీరో తల్లిగా నటించిన బిందు చద్రమౌళి తన పాత్రలో ఒదిగిపోయింది. రిలేషన్ షిప్ గురించి ఆమె వివరించే సన్నివేశం చాలా చక్కగా ప్రదర్శించబడింది.

వాళ్లిద్ద‌రి మ‌ధ్య సినిమాతో పరిచయం అయిన నేహా కృష్ణ త‌న తొలి సినిమాతోనే చక్కని నటన కనబరిచింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె చాలా బాగా నటించింది. నేహా కృష్ణ తెరపై అందం గా కనిపించింది. సైకాలజిస్ట్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ చక్కటి నటనను కనబరిచాడు. అతని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం అతి పెద్ద డ్రా బ్యాక్ అని చెప్పాలి. ఇది ఆకర్షణీయంగా లేదు. స్టార్టింగ్ నుండి ఎలాంటి ఎగ్జైట్ మెంట్ లేకుండా డల్ గా, బోరింగ్‌గా సాగింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు దూరంగా ఉండటం కోసం సేవలను ప్రారంభించాలనే కథానాయకుడి ఆలోచన కొత్తదేమి కాదు, అమలు చేయడం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అతని కంపెనీ, అనతి కాలంలోనే, కోట్లాది రూపాయల టర్నోవర్‌తో పెద్ద విజయాన్ని సాధించింది, ఇది సిల్లీగా అనిపిస్తుంది.

లీడ్ పెయిర్ మధ్య క్రియేట్ చేసిన సంఘర్షణ సరిగ్గా సెట్ కాలేదు, ఈ విషయంలో వచ్చే సన్నివేశాలు చాలా పేలవంగా చూపించడం జరిగింది. సన్నివేశాల్లో డ్రామా చాలా వరకు సరిగ్గా లేదు, ఎమోషనల్ డెప్త్ సరిగ్గా లేకపోవడం వల్ల మెయిన్ ప్లాట్, స్క్రీన్ ప్లే ఆకట్టుకొదు. ఆల్టర్ ఈగో కాన్సెప్ట్ బాగానే రాసినట్లు అనిపించినా, దానిని స్క్రీన్‌పై చూపించడం లో ఆకట్టుకోలేదు.

కామెడీ విచిత్రంగా, పాత పద్ధతిలో కనిపించింది. సినిమాకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందించడం లో సక్సెస్ కాలేదు. 135 నిమిషాల నిడివిలో, సాగదీసిన స్క్రీన్‌ప్లే మరియు సుదీర్ఘమైన సన్నివేశాల కారణంగా సినిమా చాలా పొడవుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంది, ఊహించిన ట్విస్ట్‌లు రావడంతో అసలు మెసేజ్ అంత ఆసక్తి గా అనిపించదు.

 

సాంకేతిక విభాగం:

 

మధు స్రవంతి సంగీతం బాగుంది, రెండు పాటలు వినడానికి బాగున్నాయి. ఆర్ ఆర్ కొలంచి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే టీమ్ సినిమాను కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు ట్రిమ్ చేసి ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య విషయానికి వస్తే సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించడం లో విఫలం అయ్యారు. అతను కథ బాగా ఇచ్చాడు, అయితే తన అభిప్రాయాన్ని బలంగా తెలియజేయడంలో రచన మరింత ఎఫెక్టివ్ గా ఉండాలి. సరైన సాలిడ్ ఎమోషన్స్‌తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే చాలా ఇంపాక్ట్ ను క్రియేట్ చేసే అవకాశం ఉంది.

 

తీర్పు:

 

మొత్తానికి వాళ్లిద్దరి మధ్య అంటూ డైరెక్ట్ డిజిటల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డల్ గా, బోరింగ్ గా ఉంది. ఇందులో మంచి మెసేజ్ ఉంది. కానీ, సరైన కథనం లేకపోవడం, లాంగ్ రన్‌టైమ్ ను కలిగి ఉండటంతో ప్రేక్షకులకు అంతగా నచ్చదు. ప్రేక్షకులను ఈ చిత్రం అంతగా ఆకట్టుకోదు

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు