సమీక్ష : యామి గౌతమ్ ‘చోర్‌నికల్‌ కే భాగా’ – నెట్ ఫ్లిక్ లో హిందీ మూవీ

John Wick 4 English Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 24, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: యామీ గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ కేల్కర్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా & ఇతరులు

దర్శకుడు : అజయ్ సింగ్

నిర్మాతలు: దినేష్ విజన్, అమర్ కౌశిక్

సంగీత దర్శకులు: కేతన్ సోధా

సినిమాటోగ్రఫీ: జియాని జియాన్నెల్లి

ఎడిటర్: చారు ఠక్కర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నటి యామీ గౌతమ్ లేటెస్ట్ మూవీ చోర్ నికల్ కే భాగ నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. అజయ్‌సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ కౌశల్‌ కీలక పాత్రలో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో, దాని సమీక్ష ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 

కథ :

 

అంకిత్ సేథి (సన్నీ కౌశల్) అనే వ్యాపారవేత్త తో నేహా గ్రోవర్ (యామీ గౌతమ్) అనే ఎయిర్ హోస్టెస్ ప్రేమలో పడుతుంది. అనంతరం నేహా గర్భవతి అవుతుంది, అప్పటివరకు అంతా సజావుగా సాగుతుంది. అంకిత్ తన మునుపటి వ్యాపారం నష్టం రావడంతో 20 కోట్ల అప్పుల పాలయిన విషయాన్ని నేహాతో వెల్లడిస్తాడు. అయితే ఆ అప్పు తీర్చేందుకు అంకిత్‌ని డైమండ్ రాబరీ చేయమని అతడికి అప్పులు ఇచ్చినవారు అడుగుతారు, అంకిత్ దానికి నిరాకరించడంతో వారితో అతడికి చిన్న గొడవ జరుగుతుంది. కాగా దాని కారణంతో నేహా తన గర్భాన్ని కోల్పోతుంది. అయితే ఫైనల్ గా నేహా మరియు అంకిత్ వజ్రాలను తీసుకెళ్ళే విమానంలో దోపిడీ చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ వారిని షాక్‌కు గురిచేసే విధంగా విమానాన్ని ఉగ్రవాదుల బృందం హైజాక్ చేస్తుంది. అయితే ఆ తరువాత ఏం జరిగింది నేహా, అంకిత్‌లు దోపిడీలో విజయం సాధించారా వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

సినిమా కోసం డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. దోపిడీ మరియు హైజాక్ అంశాలను కలపడం ఒక ఆసక్తికరమైన ఆలోచన. అయితే, హీస్ట్ డ్రామాలు మరియు హాస్టేజ్ థ్రిల్లర్‌లను మనం విడివిడిగా చూసేవాళ్ళం, కానీ ఈ జానర్‌లను కలపాలనే ఆలోచన ఆకట్టుకుంటుంది. ఒక వైపు వారి భారీ అప్పులు తిరిగి చెల్లించడానికి దోపిడీ చేయాలని ప్లాన్ చేసే జంటని మరోవైపు వారి స్వంత డిమాండ్‌లు నెరవేర్చుకోవాలని ఉగ్రవాదుల సమూహం ఫ్లైట్ లో ఉంటాయి. మూవీ ఆకట్టుకున్న రీతిన ప్రారంభం అవుతుంది, అలానే పాత్రల యొక్క పరిచయాలు కూడా అలరిస్తాయి. నటి యామి గౌతమ్ ప్రతి సినిమాతో నటిగా మంచి పేరు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక ఈ మూవీలో ఎయిర్ హోస్టెస్ గా తన ప్రియుడి సమస్యను తీర్చాలని తాపత్రయపడే యువతీ పాత్రలో మరొక్కసారి సూపర్ గా పెర్ఫార్మ్ చేసారు. సన్నీ కౌశల్ కూడా తన పాత్రలో ఆకట్టుకున్నారు. రా ఆఫీసర్ గా కనిపించిన శరద్ కేల్కర్ కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు ఇంట్రెస్టింగ్ గా అలరించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమా కోసం మంచి ఐడియా ని ఎంచుకున్న దర్శకడు దానిని స్క్రీన్ పై ఆకట్టుకునే రీతిగా తెరకెక్కించడంలో మాత్రం విఫలం అయ్యారు. ముఖ్యంగా హైజాక్ అయ్యే వరకు సినిమా మంచి ఇంట్రెస్టింగ్ నోట్ లో సాగగా, ఆ తరువాత నుండి చాలా వరకు డిజప్పాయింటింగ్ గా సాగుతుంది. ఇక ఈ రోజుల్లో ఆడియన్స్ ఎంతో జాగ్రత్తగా సినిమాలోని చాలా సన్నివేశాలని ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండాలని భావిస్తున్నారు. అందుకని దర్శకుడు ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని సినిమా తెరకెక్కించాల్సిందే. ఇక ఇటువంటి యాక్షన్ థ్రిల్లర్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సినిమా మాత్రం ఆ విధంగా ఆకట్టుకోకపోగా మధ్యలో వచ్చిన రెండు ట్విస్ట్ ల ద్వారా కూడా పెద్దగా ఆసక్తి కలిగించదు. మొత్తంగా సినిమా 100 నిమిషాల్లో ముగుస్తుంది. స్క్రీన్ పై ఎంతో జరుగుతున్నట్లు అనిపించినా ఫాస్ట్ గా చేసిన ఎడిటింగ్ కారణంగా సడన్ గా మూవీ ముగిసిపోయింది అనిపిస్తుంది. నిజంగా మంచి సెటప్ తర్వాత సినిమా మెల్లగా ఆడియన్స్ లో ఆసక్తిని తగ్గిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

కేతన్ సోధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగుంది. చాలా వరకు సినిమా ఫ్లైట్ లో నడుస్తుంది. జియాని జియాన్నెల్లి ఎంతో బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ విభాగం మరింత బాగా వర్క్ చేస్తే బాగుండేది. ఇక దర్శకుడు అజయ్ సింగ్ ఓవరాల్ గా పర్వాలేదనిపించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నప్పటికీ దానిని ఆకట్టుకునేలా స్క్రిప్ట్ రాసుకుని ఉంటె బాగుండేది. మొత్తంగా అతడు తెరకెక్కించిన తీరు, అలానే సినిమా కేవలం పర్వాలేదనిపిస్తుంది అంతే.

 

తీర్పు :

 

మొత్తంగా చూసుకుంటే చోర్ నికాల్ కె భాగా దోపిడీ తో కూడిన హైజాక్ డ్రామా మూవీగా థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కినప్పటికీ ఫైనల్ గా మాత్రం ఆడియన్స్ ని అలరించడంలో మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది. నటి యామి గౌతమ్ పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ మధ్య నుండి చివరకు సాగె సినిమా ఆకట్టుకోదు. అయితే ఇటువంటి మిక్సింగ్ జానర్ మూవీస్ చూడాలని అనుకునేవారికి ఇది నచుతుంది అని చెప్పాలి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version