ఆడియో రివ్యూ : పంజా – కొత్తగా ఉన్న సంగీతం

ఈ సంవత్సరం లో చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ ఒకటి.ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. పంజా ఆడియో ను గత శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో చాల ఘనం గా విడుదల చేసారు. ఈ చిత్రానికి సంగీతాన్ని యువన్ శంకర్ రాజా అందించారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లో ని పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.

పాట: పంజా
పాడిన వారు: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రీ

ఈ చిత్రంలో ఇది టైటిల్ సాంగ్ అధ్బుతమైన మ్యూజిక్ తో సాగుతుంది. మంచి టెక్నో మ్యూజిక్ తో ప్రారంభమవుతుంది. యువన్ శంకర్ రాజా చాలా బాగా పాడారు. మంచి ఊపుతో సాగుతూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అధ్బుతంగా ఉంది. అక్కడక్కడ అజిత్ నటించిన గ్యాంబ్లర్ చిత్రంలోని టైటిల్ సాంగ్ లా అనిపిస్తుంది. గ్యాంబ్లర్ కి కూడా యువన్ శంకర్ రాజానే మ్యూజిక్ అందించాడు. సంగీతాన్నిహెవీ మెటల్ మరియు సిన్తేసైజార్ డామినేట్ చేస్తాయి. ఖచ్చితంగా ఇది హిట్ సాంగ్ అవుతుంది.

పాట: ఎలా ఎలా
పాడిన వారు: హరి చరణ్, శ్వేతా పండిట్
సాహిత్యం: చంద్రబోస్

ఆల్బం లో ఇది డ్యూయెట్ సాంగ్. మంచి రొమాంటిక్ ఫీల్ తో సాగుతుంది. హరి చరణ్ మరియు శ్వేతా పండిట్ తమ గాత్రంతో పాటకి అందం తీసుకు వచ్చారు. చంద్రబోస్ సాహిత్యం కూడా బావుంది. యువన్ సంగీతం సరికొత్త అనుభూతినిస్తూ చాలా బావుంది. ఈ పాట చిత్రీకరణ కూడా బావుంటందని ఊహించొచ్చు.

పాట: వేయిరా చేయి వేయిరా
పాడిన వారు: సలోని
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రీ

ఈ చిత్రంలో ఐటం సాంగ్ ఇది. సలోని ఈ పాటని సరిగా పాడలేకపోయింది. తన గాత్రంలో ఫీల్ లేకపోవడంతో సాంగ్ చప్పగా సాగింది. రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం కూడా పరవాలేదనిపించే స్థాయిలోనే ఉంది. చిత్రీకరణ బావుంటే సాంగ్ హిట్టయ్యే అవకాశం ఉంది.
సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది.

పాట: క్షణం క్షణం
పాడిన వారు: శ్వేతా పండిట్
సాహిత్యం: చంద్రబోస్

ఈ రొమాటిక్ బిట్ సాంగ్ ని శ్వేతా పండిట్ చాలా బాగా పాడింది. ఈ సాంగ్ కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలకి వాడి ఉండవచ్చు. వినసొంపుగా మంచి ఫీల్ తో సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం కూడా బావుంది.

పాట: అనుకొనే లేదుగా కల కానే కాదుగా
పాడిన వారు: బెల్లీ రాజ్, ప్రియా హేమేష్
సాహిత్యం: చంద్రబోస్

ఇది మంచి రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్. ప్రియా హేమేష్ చాలా బాగా పాడింది.బెల్లీ రాజ్ మాత్రం పర్వాలేదనిపించాడు. ఇలాంటి పాటలు చిత్రీకరించడం ఒక సవాలు లాంటిదే. యువన్ సంగీతం కూడా బావుంది మరియు మోడరన్ ఇంస్ట్రుమెంట్స్ బాగా వాడారు. ఈ సాంగ్ ఓ మాదిరిగా మాత్రమే ఉంది.

పాట: పాపారాయుడు
పాడిన వారు: పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం, హేమచంద్ర, సత్యం
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రీ

ఈ సాంగ్ మూవీలో బాగా ఎంటర్ టైన్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రెగ్యులర్ గా వచ్చే సాంగ్ కాదు.సాహిత్యం వింటేనే అర్ధం అవుతుంది మూవీలో ఫన్నీ గా చిత్రీకరించడానికి చేయించిన సాంగ్ లా ఉంది. యువన్ సంగీతం కూడా సరిగ్గా కుదిరింది. బ్రహ్మానందం ఎక్ష్ప్రెషన్స్ ఎలా ఉండబోతున్నాయో ఊహించుకుంటేనే మనకు నవ్వు వస్తుంది. చిత్రీకరణ బావుంటే ఈ సాంగ్ హిట్టయ్యే అవకాశం ఉంది.

తీర్పు:

పవన్ కళ్యాణ్ పంజా చిత్రాన్ని తన గత చిత్రాల కంటే విభిన్నంగా ఉండేలా కొత్త లుక్ తో మన ముందుకి రాబోతున్నారు. యువన్ ఈ చిత్రానికి డిఫరెంట్ మరియు సరి కొత్త ఆడియోని అందించారు. ఈ ఆల్బంలో కొన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి. ‘పంజా’ టైటిల్ సాంగ్ ఖచ్చితంగా రాక్ చేస్తుంది. ‘ఎలా ఎలా’ మరియు ‘పాపారాయుడు’ కూడా చాలా బావున్నాయి. ఐటం సాంగ్ ఇంకా బావుంటే ఇంకా బెటర్ గా ఉండేది. రెగ్యులర్ గా వచ్చే పవన్ ఆడియో అయితే కాదు. ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వింటే ఈ ఆడియో మీకు నచ్చుతుంది.

Click here for English Version

సంబంధిత సమాచారం :