ఓటిటి సమీక్ష : “పరంపర సీజన్ 2” – తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్

ఓటిటి సమీక్ష : “పరంపర సీజన్ 2” – తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్

Published on Jul 22, 2022 3:01 AM IST
Parampara Telugu web series Review

విడుదల తేదీ : జూలై 21, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని, నైనా గంగూలీ, కస్తూరి శంకర్

దర్శకులు : కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల

నిర్మాతలు : శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

సంగీత దర్శకుడు: నరేష్ కుమారన్

సినిమాటోగ్రాఫర్ : ఎస్.వి. విశ్వేశ్వర్

ఎడిటర్ : తమ్మిరాజు

ఇప్పుడు మన తెలుగు నుంచి కూడా అనేక ఇంటెన్స్ వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. అలాంటి కొన్ని సిరీస్ లలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో ఆల్రెడీ వచ్చి హిట్టయ్యిన సిరీస్ “పరంపర” కూడా ఒకటి. మరి దానికి కొనసాగింపుగా ఇప్పుడు సీజన్ 2 కూడా వచ్చింది. మరి ఇది ఎంతమేర ఆడియెన్స్ కి ఆకట్టుకుందో సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

గత సీజన్ ఎక్కడైతే ముగుస్తుందో అక్కడ నుంచే ఈ కథ కూడా మొదలవుతుంది. ఆ పెళ్లి లో చేసిన గొడవతో గోపి(నవీన్ చంద్ర) ఖైదు చెయ్యబడతాడు. అయితే ఈ జైల్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఓ ప్రముఖ వ్యక్తి రత్న కుమార్(రవి వర్మ) కళ్ళలో గోపి పడతాడు. దీనితో వీరిద్దరూ ఒక్కటయ్యి పార్ట్నర్స్ కూడా అవుతారు. మరి ఈ టైం లో రత్నకుమార్ గోపి దగ్గర అతని బాబాయ్ నాగేంద్ర నాయుడు(శరత్ కుమార్) ని చంపేయాలని నేను జైల్లో ఉండడానికి కారణం అతడే అని గోపి తో డీల్ మాట్లాడుతాడు. మరి గోపి ఈ డీల్ కి ఒప్పుకున్నాడా? అతను తనకి చెప్పింది ఏంటి? ఈ కథలో రచన(ఆకాంక్ష సింగ్) మోహన్ రావు(జగపతిబాబు) పాత్రలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

మాములుగా సీక్వెల్స్ లో చాలా వరకు మేకర్స్ చాలానే మార్పులు క్యాస్టింగ్ పరంగా చేసేస్తూ ఉంటారు. అయితే ఇది అందరినీ మెప్పించకపోవచ్చు. కానీ ఈ సిరీస్ సీక్వెల్ లో ఆ జాగ్రత్తలు తీసుకోవడం ఆకట్టుకుంటుంది. మరీ ఎక్కువ కొత్త పాత్రలు పెట్టకుండా పాత వారితోనే మంచి ఫ్లేవర్ లో ఆకట్టుకునే విధంగా కథనం నడిపించడం బాగుంటుంది. ఇంకా నటీనటుల్లో నవీన్ చంద్ర, శరత్ కుమార్ లు ఇంటెన్స్ పెర్ఫామెన్స్ లను కనబరిచారు.

అలాగే వీరిద్దరి మధ్య డ్రామా కూడా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఇంకా ఈ సీజన్లో లో చూపించిన పలు పొలిటికల్ ఎపిసోడ్స్ నిజ జీవితంలో ఎలా అవి చేస్తుంటారు అనే సన్నివేశాలు మంచి ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. ఇంకా కథనంలో ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. అలాగే మరో కీలక పాత్రధారులు జగపతిబాబు, ఆకాంక్ష సింగ్ లు మెప్పించారు. అలాగే ఈ సీజన్లో ఎమోషన్స్ కూడా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ సిరీస్ లో మైనస్ పాయింట్స్ కి వచ్చినట్టు అయితే మెయిన్ గా స్టోరీ లైన్ ఏమంత ఇంప్రెసివ్ గా ఉండదు. ఇది వరకే ఇలాంటి పొలిటికల్, క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు సిరీస్ లు కూడా చూసాం. ఇంకా ఇందులో స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. వీటితో పాటుగా స్టార్టింగ్ లో రెండు ఎపిసోడ్స్ కూడా కొంచెం స్లో గానే ఉన్నట్టు అనిపిస్తాయి.

ఇంకా పాత్రల పరంగా మొదట్లో మంచి స్కోప్ లో చూపించిన నటుల్ని తర్వాత పక్కన పెట్టేయడం, నవీన్ చంద్ర రోల్ డిజైన్ లో కూడా లోపాలు కనిపిస్తాయి. తాను అంత త్వరగా ఎలా ఎదిగాడు? అనేది చూపించిన విధానం ఆకట్టుకునే రకంగా ఉండదు. అలాగే సిరీస్ లో కొన్ని యాక్షన్ బ్లాక్ లు అయితే ఏమంత ఎఫెక్టీవ్ గా ఉండవు. అలాగే చాలా సన్నివేశాల్లో లాజిక్స్ కూడా మిస్సయ్యాయి.

 

సాంకేతిక వర్గం :

గత సీజన్లో కంటే ఈసారి మేకర్స్ భారీ గానే ఖర్చు పెట్టినట్టుగా విజువల్స్ గాని ఆ గ్రాండియర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇంకా టెక్నికల్ టీం లోకి వస్తే నరేష్ కుమారన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే ఎస్ వి విశ్వేశర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకులు విజయ్ ఎల్, విశ్వనాథ్ లు విషయానికి వస్తే ఈ సీజన్ ని మంచి ఎంగేజింగ్ గా చూపించేందుకు బాగానే ప్రయత్నం చేశారు. అలాగే నటీనటులు నుంచి కూడా మంచి నటనను రాబట్టారు కానీ కొన్ని చోట్ల మాత్రం నెమ్మదించారు, అలాగే కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే డల్ గా ఉంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “పరంపర సీజన్ 2” లో ఫస్ట్ సీజన్ కన్నా బెటర్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి, కాకపోతే సేమ్ రొటీన్ కథా కథనాలు అంతగా మెప్పించవు. కానీ నటీనటుల పెర్ఫామెన్స్ లు పొలిటికల్ థ్రిల్లర్స్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవారు అయితే ఈ సిరీస్ ని ఈ వారాంతంలో ఒక లుక్ వెయ్యొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click here for English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు