సమీక్ష : “పరేషాన్” – సిల్లీ కామెడీ డ్రామా

సమీక్ష : “పరేషాన్” – సిల్లీ కామెడీ డ్రామా

Published on Jun 3, 2023 3:03 AM IST
Pareshan Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 02, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అబిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుడ్డరఖాన్ రవి, రాజు బెడిగెల

దర్శకులు : రూపక్ రోనాల్డ్సన్

నిర్మాతలు: సిద్ధార్థ్ రాళ్లపల్లి

సంగీత దర్శకులు: యశ్వంత్ నాగ్

సినిమాటోగ్రఫీ: వాసు పెండెం

ఎడిటర్: హరి శంకర్ టిఎన్, రూపక్ రోనాల్డ్సన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

గత ఏడాది టాలీవుడ్ సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం “మాసూద” తో మంచి హిట్ అందుకున్న యంగ్ నటుడు తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పరేషాన్” రిలీజ్ కి వచ్చింది. మరి కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..ఐసాక్(తిరువీర్) తనతో తన ఫ్రెండ్స్ సత్తి, పాషా మైదక్ అలాగే ఆర్జీవీ లు సింగరేణి ప్రాంతంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. అయితే ఈ అంతా కూడా తాగుడుకు బాగా బానిసలూ కాగా ఓ రోజు సత్తి, పాషా లకు అర్జెంట్ గా డబ్బు అవసరం పడడంతో ఐసాక్ తన తండ్రి డబ్బులు ఇస్తాడు. అలాగే మరోపక్క ఐసాక్, శిరీష(పావని కరణం) తో డీప్ లవ్ లో ఉంటాడు, అయితే వీరిద్దరూ శారీరకంగా కూడా ఒకటి కావడంతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యినట్టుగా ఐసాక్ కి తెలుస్తుంది. మరి ఇలా తెలిసిన తర్వాత వారికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమయంలో తన ఫ్రెండ్స్ ఏం చేశారు అనే ఇతర అంశాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

రీసెంట్ టైం లో తెలంగాణా నేపథ్యంలో చాలా చిత్రాలు వస్తున్నాయి. ఆ కోవకి ఈ సినిమా కూడా చెందుతుంది అని చెప్పొచ్చు. అక్కడి ప్రాంతం మాటలు, పాటలు అంతా కూడా చక్కగా ఉంటాయి అలాగే ఈ అంశాలు తెలంగాణ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ కూడా అవ్వొచ్చు. అలాగే సినిమాలో కామెడి ట్రాక్స్ గాని సినిమాలో కొన్ని రొమాంటిక్ ట్రాక్ లు బాగున్నాయి.

అలాగే మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ గాని ఆకట్టుకుంటాయి. అలాగే ఫస్టాఫ్ కాస్త ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. ఇక నటుడు తిరువీర్ అయితే ఇప్పుడిప్పుడే లైమ్ లైట్ లోకి వస్తున్నాడు. టక్ జగదీష్, మాసూద లో చాలా డిఫరెంట్ షేడ్ ఉన్న రోల్స్ చేసాడు. అలాగే ఈ చిత్రంలో కూడా పూర్తి డిఫరెంట్ రోల్ కాగా అందులో చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ బాగుంది. ఇంకా తన ఫ్రెండ్స్ గా కనిపించిన వారు మంచి నటన కనబరిచారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో మరీ అంత గొప్ప స్టోరీ లైన్ ఏమీ కనిపించదు. చాలా సింపుల్ అండ్ రొటీన్ లైన్ కనిపిస్తుంది. పైగా కథనం కూడా చాలా రొటీన్ గానే కనిపిస్తుంది. కామెడీ ఉంది కానీ అది అన్ని చోట్లా ఆకట్టుకోదు. దీనితో సగం సినిమా బోర్ గానే సాగదీతగా అనిపిస్తుంది. ఇక మరికొన్ని కామెడీ సీన్స్ అయితే పెట్టారు కానీ అవి నవ్వు తెప్పించవు.

సెకండాఫ్ కూడా అంత ఇంపాక్ట్ కలిగించదు. అలాగే చాల సీన్స్ అయితే ఏదో కావాలని పెట్టె యత్నం చేశారు కానీ అవి కూడా ఆకట్టుకోవు. ఇంకా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేసేయాల్సింది. అనవసర సీన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే సినిమాలో మరో మేజర్ మైనస్ ఏదన్నా ఉంది అంటే సినిమాలో సరైన ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కడ లేదు. దీనితో అయితే సినిమాలో సరైన ఎమోషన్ కూడా లేదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. అలాగే టెక్నికల్ టీం విషయానికి వస్తే..యశ్వంత్ మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు. అలాగే వాసు సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ మాత్రం ఇంకా చేయాల్సింది. మెయిన్ గా సెకండాఫ్ లో. ఇక దర్శకుడు రూపక్ విషయానికి వస్త.. ఈ చిత్రానికి తాను పరవాలేదు అనిపిస్తాడు.సాధారణ లైన్ తోనే వచ్చిన అక్కడక్కడా కామెడీ నరేషన్ తో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇది పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. మెయిన్ గా సరైన ఎమోషన్స్ కూడా లేవు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “పరేషాన్” చిత్రంలో అక్కడక్కడా కొన్ని కామెడీ పోర్షన్స్ వరకు పర్వాలేదనిపిస్తుంది. అలాగే తిరువీర్ మంచి నటన కనబరిచాడు. అయితే ఆసక్తిగా సాగని సెకండాఫ్, నవ్వు తెప్పించని కొన్ని కామెడీ సీన్స్ ఇరిటేట్ చేస్తాయి. దీనితో ఈ చిత్రం జస్ట్ రొటీన్ యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు