విడుదల తేదీ : అక్టోబర్ 15, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు
దర్శకుడు: గౌరీ రోణంకి
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి
ఎడిటర్: తమ్మిరాజు
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా యువ నటి శ్రీ లీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “పెళ్లి సందD”. శ్రీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన పెళ్లి సందడికి కొత్త వెర్షన్ గా ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
వశిష్ట (రోషన్) తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో తన బ్రదర్ పెళ్ళికి వెళ్తాడు. అక్కడ సహస్ర (శ్రీలీల)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా వశిష్టను చూసి ప్రేమిస్తోంది. ఎంతో సరదాగా మొదలైన వీరి ప్రేమ కథలో వచ్చిన సమస్య ఏమిటి ? వీరి ప్రేమకు అడ్డు ఏమిటి ? చివరకు వశిష్ట తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏమి చేశాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు. అదే విధంగా సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో తన హావభావాలతో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ఇక హీరోయిన్ గా నటించిన శ్రీలీల కూడా బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
హీరోయిన్ కి తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్, ఇతర కీలక పాత్రల్లో నటించిన రావు రమేష్, రఘుబాబు ఎప్పటిలాగే తమ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
మెయిన్ గా సినిమాలో స్టోరీ పాయింటే చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. కథకు అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కామెడీ కోసమని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.
మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయారు. కంటెంట్ పరంగా మంచి ఎంటర్ టైన్మెంట్ మరియు భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకురాలు మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు.
దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. బోరింగ్ ట్రీట్మెంట్ తో పాటు ఆసక్తి కలగించలేని కొన్ని కీలక సన్నివేశాల కారణంగా.. ప్లే లో సరైన ప్లో కూడా లేకుండా పోయింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. గౌరీ రోణంకి కొన్ని సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు కీరవాణి అందించిన సంగీతం బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాకాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
తీర్పు :
శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని కామెడీ సన్నివేశాలు, అక్కడక్కడా రేర్ గా వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదనిపించినా.. కథా కథనాలు ఏ మాత్రం ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తమ్మీద ఈ సినిమా ఆకట్టుకోదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team