విడుదల తేదీ : జూలై 28, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: శ్రీధర్ మాగంటి, శ్వేత అవస్తి, టెంపర్ వంశీ, ముక్తార్ ఖాన్, ప్రార్థన నాథన్, మాధవన్ మరియు ఇతరులు
దర్శకుడు : రామ్ విఘ్నేష్
నిర్మాతలు: సురేష్ కృష్ణ
సంగీతం: మీనాక్షి భుజంగ్
సినిమాటోగ్రఫీ: బిఎల్ సంజయ్
ఎడిటర్: రిచీ
బాషా దర్శకుడు సురేష్ కృష్ణ ఈటీవీ విన్ కోసం పోలీస్ స్టోరీ: కేస్ 1- నైట్ ఔల్స్ అనే ఓటిటి చిత్రాన్ని నిర్మించి, రూపొందించారు. ఈ చిత్రం ఇప్పుడు స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులకి అందుబాటులో ఉంది. సినిమా ఎలా ఉందో రివ్యూ లోకి వెళ్లి చూద్దాం.
కథ:
ఆర్తి (శ్వేత అవస్తి) ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్, ACP శివ (శ్రీనాథ్ మాగంటి)కి మాజీ భార్య. మంత్రి బంధువుకు చెందిన ఆఫీస్ లో ఆర్తి ను హత్య జరుగుతుంది. ACP రియాజ్ (టెంపర్ శివ) మిస్టరీని ఛేదించడానికి సీన్ లోకి వస్తాడు. అయితే డ్యూటీ నుండి సస్పెండ్ అయిన శివ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి క్రైమ్ సీన్ కి వస్తాడు. నిందితుడు ఎవరు? శివను డ్యూటీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? శివని యాక్షన్ లోకి దిగేలా చేసింది ఏమిటి? అసలు ఆఫీసులో ఏం జరిగింది? వీటన్నింటికీ సమాధానాలు సినిమాలో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
అందరికీ తెలిసిన, ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఈ సినిమా లో ఉంది. డైరెక్టర్ తన టాలెంట్ తో ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేశారు.
నిజాయతీ, అంకితభావం ఉన్న పోలీస్ పాత్ర శివగా శ్రీనాథ్ మాగంటి ను చూపించిన తీరు బాగుంది, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
టెంపర్ వంశీ రియాజ్ పాత్ర బాగుంది. గ్రే షేడ్స్‌తో చాలా బాగా నటించారు. అతని పాత్రను చూపించిన విధానం బాగుంది. వంశీ నటనా నైపుణ్యాన్ని ఇందులో ప్రదర్శించారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం మంచి స్క్రీన్‌ప్లేను కలిగి ఉన్నప్పటికీ, డైరెక్టర్ ఇంకాస్త బెటర్ గా తీసే అవకాశం ఉంది. అంతేకాక, క్లైమాక్స్‌ని సస్పెన్స్‌గా హ్యాండిల్ చేసి ఎండింగ్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చే అవకాశం ఉంది.
ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్‌లలో సరైన వాతావరణాన్ని సృష్టించడానికి కీలకమైన సౌండ్‌ట్రాక్‌లు ఉంటే బాగుండేది. సస్పెన్స్‌ని పెంచడానికి ఇంకాస్త బెటర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరం.
కొన్ని ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లను కథకు యాడ్ చేసి ఉంటే ఇంకాస్త బాగుండేది. ఆడియెన్స్ కి కావాల్సిన థ్రిల్ ఇంకాస్త బెటర్ గా ఉండేది.
సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లకుండా ఉంటాయి. వాటిని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
చాలా మంది నటీనటులు అంతగా తెలియని వారు ఉన్నారు ఈ సినిమాలో. కథతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఉండటానికి కొంత తెలిసిన ప్రముఖ నటీనటులను తీసుకొని ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు రామ్ విఘ్నేష్ సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన సినిమా మొత్తాన్ని ఇంకాస్త ఎలివేట్ చేయలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. అయితే మీనాక్షి భుజంగ్ స్కోర్ సినిమా యొక్క థ్రిల్‌ను మరింత పెంచే అవకాశం ఉంది.
సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే ఎడిటర్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది.
తీర్పు:
మొత్తం మీద, పోలీస్ స్టోరీ కేస్ 1- నైట్ ఔల్స్ అనేది చూడదగిన క్రైమ్ థ్రిల్లర్. ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయి. సినిమా వేగం ను పెంచడానికి బెటర్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేది. అంతేకాక కొన్ని థ్రిల్ చేసే సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకాస్త బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ, సెకండాఫ్ లో క్లియర్ అవుతాయి. వీటిని పట్టించుకోకుండా, అందరికీ తెలిసిన, బాగా ఎగ్జిక్యూట్ చేసిన కథను చూడాలనుకుంటే, ఈ వారాంతం ఈ చిత్రాన్ని చూడవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team