సమీక్ష : “పాప్ కార్న్” – సిల్లీగా సాగే స్లో లవ్ డ్రామా!

Popcorn Movie-Review-In-Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సాయి రోనక్, అవికా గోర్

దర్శకుడు : మురళీ నాగ శ్రీనివాస్ గంధం

నిర్మాతలు: భోగేంద్రగుప్తా మడుపల్లి

సంగీత దర్శకులు: శ్రవణ్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

యంగ్ హీరో సాయి రోనక్ హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్ హీరోయిన్‌గా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో వచ్చిన చిత్రం పాప్ కార్న్. సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం…

 

కథ:

 

అవికా గోర్ (సమీర్ణ) – పవన్ (సాయి రోనక్) ఓ మాల్ కి వచ్చి లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. అప్పటికే.. ఆ మాల్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో పోలీసులు ఆ మాల్ ను కంట్రోల్ లోకి తీసుకుని మూసేస్తారు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అవికా గోర్ (సమీర్ణ) – పవన్ (సాయి రోనక్) మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ?, ఇంతకీ వీరిద్దరూ ఆ లిఫ్ట్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ? చివరకు ఆ లిఫ్ట్ నుంచి ఎలా బయట పడ్డారు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ సినిమాలో సాయి రోనక్ పోషించిన ప్రధాన పాత్ర అయిన పవన్ పాత్ర. ఆ పాత్రకి సంబంధించిన ట్రాక్ అలాగే ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలతో పాటు హీరోయిన్ అయిన అవికా గోర్ పాత్ర తాలూకు ఐడియాలజీ ఇలా మొత్తానికి పాప్ కార్న్ కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ టోన్ తో సాగే కొన్ని సీన్స్ పర్వాలేదనిపిస్తాయి.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సాయి రోనక్ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర యొక్క పరిధి మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలానే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. హీరోయిన్ గా నటించిన అవికా గోర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

 

మైనస్ పాయింట్స్:

 

దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం చిన్న స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ దానిని ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా తెరపై చూపించలేక పోయారు. కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ పాయింట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తిగా స్క్రీన్ ప్లేని సాగతీయడంతో. ముఖ్యమైన క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు లవ్ ట్రాక్ కూడా చాలా సింపుల్ గా ఉండటం అనేది ఆకట్టుకోదు.

కాకపోతే, దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం టేకింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక కథ కథనాలు మరీ స్లోగా సాగడంతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ లవ్ స్టోరీ వెరీ వెరీ స్లో నారేషన్ వలన ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించలేకపోయాడు.
 

సాంకేతిక విభాగం:

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడి నేపథ్య సంగీతం బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఒక లిఫ్ట్ లోనే న్యాచురల్ విజువల్స్ తో కెమెరామెన్ చాలా సీన్స్ ను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

పాప్ కార్న్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని సీన్స్ టేకింగ్ పర్వాలేదు. కానీ, ఈ సినిమా మొత్తంగా మాత్రం మెప్పించలేకపోయింది. కథ కథనాలు బాగా స్లోగా సాగడం, అలాగే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని బాగా ల్యాగ్ చేయడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ కాదనే చెప్పాలి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version