సమీక్ష : “ప్రత్యర్థి” – కొన్ని చోట్ల ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్!

సమీక్ష : “ప్రత్యర్థి” – కొన్ని చోట్ల ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్!

Published on Jan 6, 2023 9:45 PM IST
Prathyardhi Movie-Review-In-Telugu

విడుదల తేదీ : జనవరి 06, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రవి వర్మ ఆదూరి, రోహిత్ బెహల్, అక్షత సోనవానె, నీలిమ పథకమేసెట్టి, తాగుబోతు రమేష్ తదితరులు

దర్శకుడు : శంకర్ ముడావత్

నిర్మాత: సంజయ్ సాహ

సంగీత దర్శకులు: పాల్ ప్రవీణ్

సినిమాటోగ్రఫీ: రాకేష్‌ గౌడ్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షత సోనవానెలు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ప్రత్యర్థి. డైరెక్టర్ శంకర్ ముడావత్ దర్శకత్వ వహించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

ఎస్ఐ కృష్ణ ప్రసాద్ (రవి వర్మ ఆదూరి) విజయ్ కుమార్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. డ్యూటీ కోసం ఫ్యామిలీని కూడా పట్టించుకోని ఎస్ఐ కృష్ణ ప్రసాద్ కి ఈ కేసులో ఎలాంటి సమస్యలు వచ్చాయి?, అతను వాటిని ఎలా సాల్వ్ చేశాడు ?, ఈ క్రమంలో విజయ్ కుమార్ ను చంపిన శివ (రోహిత్ బెహల్)ని, అతని ఫ్రెండ్స్ ను ఎలా పట్టుకున్నాడు ?, అలాగే శివ గ్యాంగ్ తో హత్య చేశాం అని కృష్ణ ప్రసాద్ ఎలా చెప్పించాడు ?, అసలు శివ, విజయ్ కుమార్ ను ఎందుకు చంపాడు ?, ఇంతకీ ఈ శివ ఎవరు?, అతనికి విజయ్ కుమార్ కీ సంబంధం ఏమిటి?, చివర్లో శివ చంపిన వ్యక్తి విజయ్ కుమార్ కాదు అని తెలుస్తోంది. మరీ విజయ్ కుమార్ ను చంపింది ఎవరు?, అసలు ఈ మొత్తం కథలో ఎస్ఐ కృష్ణ ప్రసాద్ పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

పోలీసుల్లో కొందరు తమ పేరు కోసం, పై అధికారుల మెప్పు కోసం సాధారణ అమాయకులను ఎలా బుక్ చేస్తారనే పాయింట్ తో పాటు స్వార్థ పరుడైన ఓ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూను చాలా ఇంట్రెస్టింగ్ ప్లేతో దర్శకుడు శంకర్ ముడావత్ బాగా చూపించారు. ముఖ్యంగా ఓ మర్డర్ క్రైమ్ చుట్టూ అల్లుకున్న డ్రామాను, ఆలాగే ఆ డ్రామాను చుట్టూ ఉన్న పాత్రల కోణంలో సస్పెన్స్ ప్లేతో చూపించిన విధానం సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. ఇంతకీ హత్య ఎవరు చేశారు ? అనే ఆసక్తిని శంకర్ ముడావత్ చివరి సీన్ వరకు మెయింటైన్ చేస్తూ.. లాస్ట్ సాలిడ్ ట్విస్ట్ తో సినిమాని ముగించడం చాలా బాగుంది. కొత్త దర్శకుడైనా అతని టేకింగ్ బాగానే ఉంది.

ప్రధాన పాత్రలో నటించిన రోహిత్ బెహల్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో రోహిత్ బెహల్ బాగా నటించి మెప్పించాడు. మరో కీలక పాత్రలో కనిపించిన రవి వర్మ ఆదూరి కూడా చక్కగా నటించాడు. ఇక హీరోయిన్స్ గా నటించిన అక్షత సోనవానె, నీలిమ పథకమేసెట్టి కూడా తమ గ్లామర్ తో మెప్పించారు. పైగా వీరిద్దరూ అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సెకండ్ హాఫ్ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అండ్ యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇలాంటి సస్పెన్స్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగితేనే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలం. ఈ సినిమాలో అలాంటి అంశాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. మెయిన్ గా సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతారో, అసలు వాళ్ళు పోలీసులు నుండి ఎలా తప్పించుకుంటారో అనే ఉత్కంఠను ప్లేలో ఇంకా పెంచి ఉంటే బాగుండేది.

అలాగే స్క్రీన్ ప్లేలో ఆడియన్స్ కి కన్ ఫ్యూజన్ లేకుండా చూసుకోవాల్సింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో లాజిక్ ఉండదు. ఫస్ట్ హాఫ్ ప్లేను ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు. మొత్తమ్మీద ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. మొత్తానికి ఈ ఎమోషనల్ క్రైమ్ స్టోరీలో కథ అవసరానికి మించి ఉన్న సన్నివేశాలు లేకుండా చూసుకోవాల్సింది. అలాగే బ్యాక్ గౌండ్ మ్యూజిక్ కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలో నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అలాగే దర్శకుడు తన షాట్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఐతే, ఇంకా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది.

 

తీర్పు :

 

ప్రత్యర్థి అంటూ వచ్చిన ఈ క్రైమ్ ఎమోషనల్ థ్రిల్లర్ లో కొన్ని సస్పెన్స్ సీన్స్ అండ్ కొన్ని క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అయితే, లాజిక్స్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సీన్స్ లో ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఐతే, సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్, శంకర్ ముడావత్ టేకింగ్ బాగున్నాయి. ఓవరాల్ గా ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గం ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు