విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్కా, సత్యరాజ్, ప్రేమ్ జి అమరన్, ఆనందరాజ్, సతీష్ కృష్ణన్, ప్రాంక్ స్టార్ రాహుల్
దర్శకత్వం : అనుదీప్ కెవి
నిర్మాతలు: ఏషియన్ సునీల్, డి సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహనరావు
సంగీతం: ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటర్స్: ప్రవీణ్ కేఎల్
సంబంధిత లింక్స్: ట్రైలర్
శివ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ప్రిన్స్. ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
దేవరకోట లోని ఒక స్కూల్ లో సోషల్ టీచర్ గా వర్క్ చేసే ఆనంద్ (శివ కార్తికేయన్), అదే స్కూల్ కి ఇంగ్లీష్ టీచర్ గా వచ్చిన జెస్సికా (మరియా ర్యాబోషప్కా) ని తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె బ్రిటన్ కి చెందిన యువతి కావడంతో ఆనంద్ తండ్రి విశ్వనాధ్ కి వారి ప్రేమ నచ్చదు. అయితే అదే దేవరకోటలో హీరోయిన్ తండ్రి ఒక సమస్యలో ఇరుక్కోవడంతో, ఆపైన దానిని పరిష్కారించేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. మరి ఇటువంటి పరిణామాల మధ్య ఆనంద్, జెస్సికాల ప్రేమ ఫలించిందా ?, అలానే హీరోయిన్ తండ్రి స్థలం వివాదం ఎలా పరిష్కరించబడింది ? అనేది ప్రిన్స్ మూవీ మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీ కి పెద్ద ప్లస్ పాయింట్ హీరో శివ కార్తికేయనే. హీరోగా ప్రతి సినిమాతో తన క్రేజ్ మరింతగా పెంచుకుంటూ పోతున్న శివ కార్తికేయన్ ఈ మూవీలో కూడా ఆనంద్ పాత్రలో కనబరిచిన ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మన్స్, ఫన్నీ డైలాగ్స్, మరీ ముఖ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ సూపర్ గా ఉన్నాయి. ఇక ఉక్రెయిన్ భామ మరియా కూడా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమాలో ప్రధాన పాత్ర చేసిన సత్యరాజ్, ప్రేమ్ జి పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ఇక డైరెక్టర్ అనుదీప్ ప్రిన్స్ మూవీని ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు పూర్తి ఫన్నీ ఎంటర్టైనర్ గా నడిపించారు. చాలా చోట్ల వచ్చే కామెడీ సీన్స్ కి ఆడియన్స్ కి మరింతగా గిలిగింతలు పెడతాయి. థమన్ సంగీతం, మనోజ్ పరమహంస విజువల్స్, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్, నిర్మాతల భారీ నిర్మాణ విలువలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాని ఆద్యంతం కామెడీతో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి దర్శకుడు అనుదీప్ నడపడంతో చాలా వరకు సినిమా పెద్దగా బోర్ కొట్టదు. ఐతే, అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్స్ కావాలని సాగదీసి ఇరికించారేమో అనిపిస్తుంది. నిజానికి ఈ మూవీలో ఆకట్టుకునే కథ, కథనాలు, థ్రిల్లింగ్ అంశాలు లేవు, అలానే ఎప్పటికప్పుడు తరువాత వచ్చే సన్నివేశాలు ఏమిటనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంటుంది. హీరోయిన్ నానమ్మ తన ఫ్లాష్ బ్యాక్ వివరించే సన్నివేశాలను మరింత వివరణ హృద్యంగా చూపిస్తే బాగుండేదనిపిస్తుంది. సినిమాలో దాదాపుగా ప్రతి సీన్ కి ఫన్నీ టచ్ ఇవ్వడంతో మంచి యాక్షన్, ఎమోషనల్, థ్రిల్లింగ్ మూవీస్ చూసేవారిని ఇది పెద్దగా ఆకట్టుకోదు.
సాంకేతిక వర్గం :
ముందుగా దర్శకుడు అనుదీప్ మూవీని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా పెద్దగా బోర్ కొట్టించకుండా ముందుకి నడిపిన తీరు బాగుంది. థమన్ అందించిన సాంగ్స్ లో జెస్సికా, బింబిలికి సాంగ్స్ థియేటర్ లో సూపర్ గా ఉన్నాయి. ముఖ్యంగా బింబిలికి సాంగ్ కి శివకార్తికేయన్ స్టెప్స్, థమన్ బీట్స్ కి థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం. మనోజ్ పరమహంస గ్రాండియర్ లుక్స్, సినిమాలో డీసెంట్ కలరింగ్ మనకి వైవిధ్యమైన క్లాసిక్ కలర్ లో మూవీ చూసిన ఫీల్ కలుగుతుంది. కథ యొక్క పరిధి మేరకు ప్రవీణ్ ఎడిటింగ్ పనితనం బాగుంది. చాలా వరకు నిర్మాతలు పెట్టిన భారీ ఖర్చు మనకు తెరపైన కనపడుతుంది. అన్ని విభాగాల పనితీరు బాగుంది.
తీర్పు :
ఇక చివరిగా ఈ ప్రిన్స్ గురించి చెప్పుకుంటే.. సరదాగా సాగే ఎంటర్టైన్మెంట్ మూవీస్ కోరుకునే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఐతే, పెద్దగా ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు లేకుండా జస్ట్ నార్మల్ గా ఈ సినిమా సాగుతోంది. కాకపోతే, ఈ సినిమాని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కామెడీ టచ్ తో ఎంటర్టైన్మెంట్ మిక్స్ డైరెక్టర్ బాగా నడిపాడు. ఈ వారం సరదాగా ఫామిలీ తో కలిసి థియేటర్ కి వెళ్లి కామెడీ సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ ప్రిన్స్ ని ఒకసారి చూడొచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team