సమీక్ష : “జేమ్స్” – ఆకట్టుకునే పునీత్ చివరి సినిమా

సమీక్ష : “జేమ్స్” – ఆకట్టుకునే పునీత్ చివరి సినిమా

Published on Mar 18, 2022 3:01 AM IST
James Movie Review

విడుదల తేదీ : మార్చ్ 17, 2022

నటీనటులు: పునీత్ రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్

దర్శకత్వం : చేతన్ కుమార్

నిర్మాతలు: కిషోర్ పత్తికొండ

సంగీత దర్శకుడు: చరణ్ రాజ్

సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ

ఎడిటర్ : దీపు ఎస్. కుమార్

అసలు ఊహించని విధంగా సౌత్ ఇండియా స్టార్ హీరో అయినటువంటి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఒక్కసారిగా దక్షిణ భారత సినిమాని తన అభిమానులని కన్నీటి పర్యంతానికి గురి చేసింది. స్వర్గానికేగిన పునీత్ హీరోగా నటించిన చివరి చిత్రమే “జేమ్స్”. భారీ అంచనాలు నడుమ ఈ చిత్రం ఈరోజు కన్నడ మరియు తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఈ సినిమా బ్యాక్ డ్రాప్ బెంగళూరులో సెటప్ చేసి కనిపిస్తుంది. ఇక్కడ మేజర్ గా రెండు పెద్ద మాఫియా గ్రూప్స్ ఉంటాయి. అందులో కీలకమైన వాడు విజయ్ గైక్వాడ్(శ్రీకాంత్). అయితె తన లైఫ్ మరింత రిస్క్ లోకి వెళ్తుంది అని తనకి సెక్యూరిటీ గా సంతోష్(పునీత్ రాజ్ కుమార్) ని నియమించుకుంటాడు. కానీ ఇక్కడే సంతోష్ ఊహించని రీతిలో అదే విజయ్ ని మరియు తన చెల్లెలు(ప్రియా ఆనంద్) ని కిడ్నాప్ చేస్తాడు. అలా చేసినప్పుడు తాను “జేమ్స్” అని రివీల్ చేస్తాడు. అసలు ఈ జేమ్స్ ఎవరు? వాళ్లనే ఎందుకు మరో పేరున్న వ్యక్తి లా వచ్చి కిడ్నాప్ చేసాడు? తన బ్యాక్ స్టోరీ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

అసలు ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఎసెట్ పునీత్ అని చెప్పాలి. తన నటన గాని యాక్షన్ గానీ సినిమాలో సాలిడ్ గా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆర్మీ గెటప్ లో పునీత్ రాజ్ కుమార్ మంచి డైనమిక్ గా కనిపిస్తారు. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో తన ఎమోషన్స్ గాని ఫైట్ సీక్వెన్స్ లలో తన పెర్ఫార్మన్స్ స్టన్నింగ్ గా అనిపిస్తాయి.

ఇక హీరోయిన్ ప్రియా ఆనంద్ తన పాత్రలో పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే శ్రీకాంత్ తన రోల్ లో మంచి నటన కనబరిచారు. ఇంకా శరత్ కుమార్ విలన్ పాత్రల్లో కనిపించిన మరికొందరు నటులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. అలాగే ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్ గానీ సెకండాఫ్ లో కొన్ని ఎమోషన్స్ గాని ఇంప్రెస్ చేస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమా స్టార్టింగ్ గానీ పునీత్ రాజ్ కుమార్ పాత్ర ఆవిష్కరణ కానీ ఆసక్తిగా ఉంటాయి. కానీ కొన్ని చోట్ల సినిమా కాస్త డల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే సినిమా కథలో కూడా అంత కొత్తదనం కనిపించదు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాస్త సాగదీత ఎక్కువయ్యినట్టు అనిపిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ఉన్నాయని చెప్పాలి. నిర్మాతలు మంచి ప్రమాణాలతో ఈ సినిమాని తెరకెక్కించి విజువల్ గా మంచి ట్రీట్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే సినిమా టెక్నీకల్ టీం లో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అలాగే చరణ్ రాజ్ ఇచ్చిన సంగీతం సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే సినిమా యాక్షన్ బ్లాక్ కోసం ప్రత్యేకంగా చెప్పాలి. మాంచి స్టైలిష్ గా పునీత్ పై డిజైన్ చేసిన ఫైట్ లు తనని మరింత ఎలివేట్ చేసాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక ఈ సినిమా దర్శకుడు చేతన్ రాజ్ విషయానికి వస్తే తన వర్క్ ఓవరాల్ గా పర్వాలేదని చెప్పాలి. సినిమాలో కాస్త రొటీన్ కథనే ఎంచుకున్నా పలు చోట్ల ఆకట్టుకునే ట్రీట్మెంట్ తో కథనం అందించడం బాగుంది. అలాగే పునీత్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే తన అభిమానులకి మరియు మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ ని ఇస్తాయి. కాకపోతే పలు చోట్ల సినిమాని ఇంకా బెటర్ గా డిజైన్ చెయ్యాల్సి ఉంది.. ఇది పక్కన పెడితే ఈ సినిమాకి తన వర్క్ పర్వాలేదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ కి తనని ఆరాధ్యంగా కొలిచే అభిమానులకి అనుకోని రీతిలో ఈ “జేమ్స్” చివరి సినిమా అవుతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా తన చివరిదే అయినా మంచి ట్రీట్ ని అందించింది. పునీత్ సాలిడ్ పెర్ఫామెన్స్ సినిమాలో యాక్షన్ గాని మంచి హైలైట్స్ గా కనిపిస్తాయి. జస్ట్ సినిమా రొటీన్ కథని పక్కన పెడితే పునీత్ అభిమానులు సహా యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ చిత్రం ఈ వారాంతంలో మంచి ట్రీట్ ని థియేటర్స్ లో అందిస్తుంది.

గమనిక : ఇది దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ గారి చివరి సినిమా కావున, ఈ చిత్రానికి ఫలానా రేటింగ్ ఇచ్చి మేము ఫలితాన్ని నిర్ణయించదలచుకోలేదు. ఇది గమనించి సినిమా వీక్షించగలరు.

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు