విడుదల తేదీ : డిసెంబర్ 30, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: సాయి రోనక్, అంకిత సాహ, బిస్మి నాస్, అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, చిత్రం శ్రీను, సిజ్జు
దర్శకుడు : రామ్ గణపతి
నిర్మాత: మణి లక్ష్మణ్ రావు
సంగీత దర్శకులు: అరుణ్ మురళీధరన్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఇటీవల ఓదెల రైల్వే స్టేషన్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి ఆకట్టుకున్న సాయి రోనక్ హీరోగా అంకిత సాహ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాజయోగం. మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
రిషి (సాయి రోనాక్) వృత్తి రీత్యా ఒక మెకానిక్, లైఫ్ లో ఎలాగైనా మంచి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావిస్తుంటాడు. అనంతరం అనుకోకుండా అతడి జీవితంలో శ్రీ (అంకిత సాహ) అనే మంచి డబ్బున్న యువతి తో పరిచయం ఏర్పడడంతో ఆమెను ప్రేమలో పడేయాలని ఆలోచన చేస్తుంటాడు. మరోవైపు రెండు ఖరీదైన వజ్రాల కోసం కొన్ని గ్యాంగ్ ల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ తరువాత కొన్ని నిజాలు బయటపడడం వలన రిషి, శ్రీ ఇద్దరూ విడిపోతారు. అక్కడి నుండి వారు కొనసాగుతున్న నేరాల్లో పాల్గొనడం, అనంతరం వజ్రాల కోసం జరిగే గొడవల్లో వారి మధ్య చివరికి ఏమి జరిగింది అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
నిజానికి ఈ సినిమాకి హీరో సాయి రోనక్ పెద్ద బలం అని చెప్పాలి. అతడి యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ వంటివి సినిమాలో అదిరిపోయాయి. స్క్రీన్ పై అందంగా కనపడడంతో పాటు తన మెచ్యూర్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఫైట్స్ కంపొజిషన్ కూడా బాగుండడంతో పాటు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ చాలావరకు స్పీడ్ గా సాగడంతో పాటు మధ్యలో కొన్ని అలరించే సీన్స్ ఉన్నాయి. ఇక ఒక ముఖ్య సీన్ లో హీరో రియలైజ్ అయ్యే సన్నివేశం బాగుంటుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా లేకపోవడం. కొన్ని సీన్స్ అయితే అసలు సినిమాకి ఏ మాత్రం కనెక్షన్ లేని విధంగా ఉండడంతో పాటు సినిమాపై ఆడియన్స్ లో అసహనాన్ని ఏర్పరుస్తాయి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆడియన్స్ ని మరింతగా ఇబ్బండి పెడుతుంది, అసలు కొన్ని సీన్స్ అయితే ఎందుకు పెట్టారో అర్ధం కాదు. రెండు సాంగ్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ పార్ట్ కూడా ఆకట్టుకోకపోవడంతో పాటు అసహజత్వంగా అనిపిస్తాయి. చాలా వరకు కామెడీ సీన్స్ అలరించకపోవడంతో పాటు అందులో వల్గారిటీ కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇబ్బందిని కలిగిస్తాయి. సినిమాలో చాలావరకు అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉండడంతో పాటు ముఖ్య పాత్రధారుల తాలుకు సన్నివేశాలు గతంలో మనం అనేక సినిమాల్లో చూసిన ఫీల్ ని కలిగిస్తాయి. ఇక సినిమాలో కీలకమైన బ్యాక్ స్టోరీ కూడా ఎంగేజింగ్ గా ఉండదు.
సాంకేతిక విభాగం :
మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ మురళీధరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ కొన్ని సీన్స్ ని అద్భుతంగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, నిర్మాతలు సినిమా కోసం బాగానే ఖర్చు చేసారు. అయితే సినిమా కోసం ఎడిటింగ్ విభాగం మరింతగా పని చేసి కనీసం ఒక 10 నిమిషాల మేర అయిన సినిమాని ట్రిమ్ చేయాల్సింది. ఇక దర్శకుడు రామ్ గణపతి దర్శకత్వ ప్రతిభ అసలు ఆడియన్స్ ని అలరించదు. కథనంలో ఆయన సెట్ చేసిన ఫన్ బాగున్నప్పటికీ అది చాలా సీన్స్ లో శృతిమించినట్లు అనిపిస్తుంది. అయితే తీసుకున్న పాయింట్ కి మరింత బలమైన పాత్రధారుల తో పాటు హృద్యమైన ఎమోషన్స్ వంటివి ఉంటె తప్పకుండా మూవీ అందరినీ అలరించి ఉండేది.
తీర్పు :
మొత్తంగా రాజయోగం మూవీ ఏమాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోని సిల్లీ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. అక్కడక్కడా కొన్ని సీన్స్ తో పాటు హీరోగా నటించిన సాయి రోనాక్ యాక్టింగ్ తప్పించి సినిమాలో ఏమాత్రం ఆసక్తికర కంటెంట్ కానీ పాత్రలు కానీ లేవు. ఈ మూవీ పూర్తిగా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసే సినిమా.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team