సమీక్ష : “రుద్రుడు” – మాస్ ప్రేక్షకులకు మాత్రమే !

సమీక్ష : “రుద్రుడు” – మాస్ ప్రేక్షకులకు మాత్రమే !

Published on Apr 15, 2023 3:03 AM IST
Rudrudu Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్ & ఇతరులు

దర్శకులు : కతిరేసన్

నిర్మాతలు: కతిరేసన్

సంగీత దర్శకులు: జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్ ఐ ఎస్ సి

ఎడిటర్: ఆంథోని

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

మల్టీ టాలెంటెడ్ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయినటువంటి రాఘవ లారెన్స్ చాలా కాలం తర్వాత హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రుద్రుడు”. మంచి యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఈరోజు తమిళ్ సహా తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టు అయితే..రుద్ర(రాఘవ లారెన్స్) తన అమ్మ నాన్నలు దేవరాజు(నాజర్), ఇంద్రాణి(పూర్ణిమ భాగ్యరాజ్) లతో ఓ హ్యాపీ లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అలాగే అనన్య(ప్రియా భవాని శంకర్) ని తొలి చూపు లోనే ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ తమ కుటుంబానికి వచ్చిన ఆర్ధిక కష్టం ఒక్కసారిగావారి జీవితంలో అన్నీ మార్చేస్తుంది. దీనితో రుద్ర ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి లండన్ వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళాక ఆకస్మికంగా తన తల్లి మరణిస్తుంది అలాగే తన భార్య మిస్ అవుతుంది. మరి లండన్ నుంచి తిరిగి వచ్చిన రుద్ర ఈ విషయాన్ని తెలుసుకొని ఏం చేస్తాడు? తన భార్య ఎక్కడ ఉంది? ఈ కథకి భూమి(శరత్ కుమార్) సంబంధం ఏంటి? అనేది తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ రాఘవ లారెన్స్ అని చెప్పాలి. చాలా కాలం తర్వాత హీరోగా తన నుంచి వచ్చిన ఈ సినిమాలో తన నుంచి ఆశించే అన్ని ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి. తనదైన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. అలాగే తన లుక్స్ గాని సాంగ్స్ లో తన డాన్స్ లు గాని సూపర్బ్ గా అనిపిస్తాయి. ఇక పలు ఎమోషనల్ సన్నివేశాల్లో లారెన్స్ మరోసారి కదిలిస్తాడు. యాక్షన్ పార్ట్స్ లో కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని అయితే లారెన్స్ అందించారు. ఇక నటి ప్రియా భవాని శంకర్ లిమిటెడ్ గానే కనిపించినా మంచి పాత్రలో కనిపించింది. డీసెంట్ పెర్ఫామెన్స్ తో అయితే ఆమె ఆకట్టుకుంటుంది. అలాగే తనకి లారెన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇక సినిమాలో మరో మంచి హైలైట్ ఏదైనా ఉంది అంటే అది సెకండాఫ్ అని చెప్పాలి. సినిమాలో సెకండాఫ్ ఆడియెన్స్ లో ఆసక్తి రేపుతోంది. అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా సాలిడ్ గా వర్కౌట్ అవుతుంది. అలాగే కీలక పాత్రలో నటించిన శరత్ కుమార్ మంచి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు అలాగే పలు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ సినిమాలో కాస్త నిరాశ పరిచే అంశాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది సినిమాలో ఏమంత గొప్ప కథ లేదు. అలాగే సినిమాలో ఫస్టాఫ్ పెద్ద బోర్ అని చెప్పాలి. లాజిక్ లేని సీన్స్ తో ఆసక్తిగా అయితే ఫస్టాఫ్ సాగదు. ఇంకో మాటలో చెప్పాలి అంటే సెకండాఫ్ తో పోలిస్తే ఫస్టాఫ్ ఇలా ఉంది ఏంటి అనే భావన కూడా కలగొచ్చు.

అలాగే ఫస్టాఫ్ లో మరింత ఎమోషన్స్ ని రాబట్టే స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు ఆ పని చెయ్యలేదు. అలాగే ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే కూడా ఏమంత మరీ ఆసక్తిగా ఉండదు. చాలా వరకు స్క్రీన్ ప్లే ని ముందే మనం ఊహించవచ్చు.

దీనితో ఓ రొటీన్ రెగ్యులర్ మాస్ డ్రామా చూసినట్టే అనిపిస్తుంది. అలాగే నటీనటుల్ని కూడా దర్శకుడు అంత స్ట్రాంగ్ గా చూపించలేదు. శరత్ కుమార్ లాంటి సాలిడ్ పర్సనాలిటీ ని ఇంకా మంచి సీన్స్ లో స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. ఇది కూడా మిస్ అయ్యింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే తెలుగు వెర్షన్ డబ్బింగ్ కూడా నీట్ గా ఉంది. ఇక టెక్నీకల్ టీం లో అయితే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి ఎస్ వర్క్ ఈ సినిమాలో మాత్రం ఏమంత ఆకట్టుకునేలా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవర్ గా అనిపిస్తుంది. అలాగే ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ ని మంచి కలర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. అలాగే లారెన్స్ కాస్ట్యూమ్స్ వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు కథిరేసన్ విషయానికి వస్తే తన వర్క్ పర్వాలేదని చెప్పాలి. సెకండాఫ్ ని బాగా హ్యాండిల్ చేసిన తాను ఫస్టాఫ్ ని కూడా అదే రీతిలో తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ లో చాలా నెగ్లెన్సీ కనిపిస్తుంది. అలాగే కథ కథనం కూడా అంత ఇంప్రెసివ్ గా ఉండవు. సెకండాఫ్ క్లైమాక్స్ ని అయితే బాగా ఆవిష్కరించారు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రుద్రుడు” తో రాఘవ లారెన్స్ నుంచి ఆశించే కొన్ని ఎలిమెంట్స్ కనిపిస్తాయి అలాగే సెకండాఫ్, క్లైమాక్స్ పోర్షన్ లు బాగున్నాయి. కానీ రొటీన్ కథ, స్క్రీన్ ప్లే లు మాత్రం బాగా డిజప్పాయింట్ చేస్తాయి. దీనితో ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ కి కనెక్ట్ కాదు కానీ మాస్ ఆడియెన్స్ ని అయితే కొంతమేర అలరించవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు