సమీక్ష : రఘువరన్ బిటెక్ – యూత్ ఫుల్ ఎంటర్టైనర్

raghuvaran-b-tech విడుదల తేదీ : 01 జనవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : వేల్రాజ్
నిర్మాత : ‘స్రవంతి’ రవికిషోర్
సంగీతం : అనిరుధ్
నటీనటులు : ధనుష్, అమలా పాల్..


తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా, మలయాళ బ్యూటీ అమలా పాల్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘వేలైఇళ్ళ పట్టదారి’. ఈ సినిమా 2014లో తమిళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని తెలుగులో ‘రఘువరన్ బిటెక్’ గా డబ్ చేసారు. ఈ సినిమాని 2105 న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని మేము ఒక రోజు ముందే ప్రత్యేకంగా చూడటం వలన ముందే మీకు సమీక్షని అందిస్తున్నాం.. తమిళ ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంత మెప్పించిందో చూద్దాం…

కథ :

రఘువరన్ (ధనుష్) సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉంటాడు. ఎన్ని ఉద్యోగాలు వచ్చిన ఆటను సివిల్ ఇంజనీర్ గా వర్క్ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఏ జాబు కి వెళ్ళకుండా ఉంటాడు. దాంతో అతను చాలా అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. అదే టైంలో పక్కింట్లో దిగిన శాలిని(అమలా పాల్)తో పరిచయం అవుతుంది కొద్ది రోజులకి ప్రేమలో పడతాడు. అదే టైం లో ఓ కారణం వల్ల రఘువరన్ తల్లి చనిపోతుంది. ఆ తర్వాతే అనిత(సురభి) వల్ల రఘువరన్ కి సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం వస్తుంది. ఆ జాబ్ లో రఘువరన్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి.? అసలు అనిత ఎవరు.? అనిత ఎందువల్ల రఘువరన్ కి జాబ్ ఇప్పించింది.?అసలు రఘువరన్ తల్లి ఏ కారణం చేత చనిపోయింది.? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

స్లమ్ ఏరియా నుంచి వచ్చిన కుర్రాడికి ఓ రిచ్ బిజినెస్ మాన్ వారసుడికి మధ్య వృత్తి పరంగా జరిగే పోరుని కాన్సెప్ట్ గా తీసుకొని దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఎంతో ఎఫ్ఫెక్టివ్ గా తీయడంలో డైరెక్టర్ వేల్రాజ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. వేల్రాజ్ అనుకున్న కాన్సెప్ట్ ఇంత బాగా రావడంలో హెల్ప్ అయ్యింది మాత్రం ముగ్గురు వాళ్ళే ధనుష్, అమలా పాల్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.

ఒక గల్లీ కుర్రాడి పాత్రలో ధనుష్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ధనుష్ పెర్ఫార్మన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సినిమా తను తప్ప ఇంకెవరు చేసినా సెట్ అవ్వదు. చూసే ఆడియన్స్ లో ఆ రేంజ్ ఫీలయ్యేలా అతని పెర్ఫార్మన్స్ ఉంది. ఇప్పుడు ఉన్న యువత, బిటెక్ గ్రాడ్యువేట్స్ మరియు బిటెక్ చేస్తున్నావారు మొదటి రెండు నిమిషాల్లోనే ధనుష్ పాత్రకి బాగా కనెక్ట్ అయిపోతారు. ఇకపోతే పక్కింటి అమ్మాయి పాత్రలో అమలా పాల్ చాలా క్యూట్ గా ఉంది. అమలా పాల్ తెలుగులో ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే కనిపించింది. సినిమా అయ్యేలా లోపల చూసిన ప్రతి ఒక్కరూ అమలా పాల్ తో ప్రేమలో పడతారు. లవ్ సీన్స్ లో తన హావభావాలు యువతని మత్తెక్కించేలా ఉన్నాయి. సురభి ఉన్నది నాలుగైదు సన్నివేశాలే అయినప్పటికీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

కమెడియన్ వివేక్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు. ముఖ్యంగా వివేక్ కి ఉత్తేజ్ చెప్పిన డబ్బింగ్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అమితాష్ ప్రధాన్ పెర్ఫార్మన్స్ బాగుంది. అమితాష్ కి ప్లస్ అంటే తనలుక్, పర్సనాలిటీ అని చెప్పాలి. సీనియర్ యాక్టర్స్ అయిన శరణ్య, సముద్రఖని లన నటన సినిమాకి వెన్నుదన్నుగా నిలిచింది. శరణ్య – ధనుష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇకపోతే ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగుతుంది. అలాగే యూత్ కి నచ్చే పాయింట్స్ చాలా ఉండడం వలన ఆడియన్స్ కూడా సినిమాలో బాగా లీనమైపోతారు. అలాగే హీరోయిజంని ఎలివేట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సెకండాఫ్ లో హీరోయిజం ని ఎలివేట్ చేసే సీన్స్ లో ఆర్భాటం(అంటే భారీ భారీ ఫైట్స్) లేకపోయినా సూపర్బ్ గా హీరోయిజంని ఎలివేట్ చేసారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ గా నిలిచింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మైనస్ అంటే… ఫస్ట్ హాఫ్ యూత్ ఫుల్ గా చాలా ఎంటర్టైనింగ్ గా సాగిపోయినా సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. ఇకపోతే తమిళంలో సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది సాంగ్స్. కానీ తెలుగులో మాత్రం అవే మైనస్ గా మారాయి. ఒక రెండు పాటలు తప్ప మిగతా అన్నీ సినిమా ఫ్లోని దెబ్బ తీసేలా ఉన్నాయి. ఇకపోతే విలన్ పాత్రలో స్ట్రాంగ్ నెస్ ఉండదు. అదే విలన్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంది ఉంటే సినిమాకి ఇంకాస్త హెల్ప్ అయ్యేది. అప్పుడు హీరోయిజం కూడా ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యుండేది.

ఇదొక డబ్బింగ్ సినిమా.. కావున ముందుగా చేసేపని తెలుగులోకి డబ్బింగ్ చెప్పడం. ఇందులో అన్ని పాత్రలకి డబ్బింగ్ బానే ఉంది కానీ కొన్ని చోట్ల హీరో పాత్రకే కాస్త పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదనిపిస్తుంది. ధనుష్ పర్సనాలిటీకి ఆ వాయిస్ కి పెద్దగా సెట్ అవ్వలేదని చెప్పాలి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా డబ్బింగ్ సినిమా అనే విషయాన్నీ కాస్త పక్కన పెడితే.. ఈ మూవీకి అన్ని డిపార్ట్ మెంట్స్ నుంచి 100% న్యాయం చేసారు. ముందుగా సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా ప్రమోషన్ తీసుకున్న వేల్రాజ్ ఓ చిన్న కాన్సెప్ట్ ని చాలా సూపర్బ్ గా డీల్ చేసాడు. కథ – స్క్రీన్ ప్లే – సినిమాటోగ్రఫీ – డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ ని వేల్రాజ్ డీల్ చేసాడు. కథ – అతను రాసుకున్న కథ చాలా కొత్తగా ఫీల్ ని ఇస్తుంది. విలన్ పాత్రని ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే – చాలా వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా రాసుకున్నాడు. సెకండాఫ్ లో కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ – సింప్లీ సూపర్బ్.. ఓవరాల్ గా వేల్రాజ్ మొదటి సినిమాతోనే సూపర్బ్ అనిపించుకున్నాడు.

ఇకపోతే అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హెల్ప్ అని చెప్పాలి. తెలుగులో పాటలు పెద్దగా హెల్ప్ కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదుర్స్.. ఇకపోతే ఎడిటర్ రాజేష్ కుమార్ పనితనం కూడా చాలా బాగుంది. ఎక్కడా సాగదీయకుండా ఎడిటింగ్ చేసాడు. తెలుగులో కిషోర్ తిరుమల రాసిన డైలాగ్స్ చాలా వరకూ బాగున్నాయి… ఒక 20% మాత్రం సరిగా సెట్ అవ్వలేదు. స్రవంతి రవి కిషోర్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :

ఒక విలన్ పేరుతో వచ్చిన ‘రఘువరన్ బిటెక్’ సినిమా తన హీరోయిజంతో తెలుగు ఆడియన్స్ ని బాగానే మెప్పించింది. యూత్ ఫుల్ కథాశంతో వచ్చిన ఈ సినిమా యువతకి తెగ నచ్చేస్తుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే మదర్ సెంటిమెంట్ ని కూడా సినిమాలో బాగా డీల్ చేసారు. ధనుష్, అమలా పాల్ పెర్ఫార్మన్స్ మరియు కెమిస్ట్రీ, అనిరుధ్ మ్యూజిక్, వేల్రాజ్ టేకింగ్ సినిమాకి మేజర్ హైలైట్స అయితే సెకండాఫ్ లో బోర్ కొట్టే కొన్ని సీన్స్, సాంగ్స్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా అన్ని రకాల సినీ అభిమానులను ఆకట్టుకునే ఈ రఘువరన్ బిటెక్ సినిమా యువతని మాత్రం బాగా ఆకట్టుకునే యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

123తెలుగు టీం రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version