విడుదల తేదీ : నవంబర్ 12, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సాయికుమార్, తనికెళ్ళ భరణి, తదితరులు
దర్శకత్వం : శ్రీ సారిపల్లి
నిర్మాత: ’88’ రామారెడ్డి
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్. విహారి
ఎడిటింగ్: జస్విన్ ప్రభు
యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం విడుదల కి ముందు చేసిన ప్రమోషన్ల తో సినిమా పై ఆసక్తి నెలకొంది. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ గా పెట్టుకోవడం తో సినిమా ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ :
తనికెళ్ళ భరణి వద్ద పని చేసే హీరో రాజా విక్రమార్క (కార్తికేయ) ఎన్ఐఏ ఏజెంట్. అతను ఒక సీక్రెట్ మిషన్ లో భాగంగా ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ గా పని చేస్తాడు. హీరో రాజా విక్రమార్క సిన్సియర్ హోంమంత్రి అయిన సాయి కుమార్ కూతురు కాంతి (తాన్య రవి చంద్రన్) తో ప్రేమ లో పడతాడు. అనంతరం కాంతి కూడా రాజా విక్రమార్క తో ప్రేమ లో పడుతుంది.
కథ లో అనుకోకుండా గురు నారాయణ్ (పశుపతి) అనే వ్యక్తి హోం మంత్రి పై పగ తీర్చుకోవడానికి సిద్దం అవుతాడు. గురు నారాయణ్ కి మరియు హోం మంత్రి కి మధ్యన ఉన్న కథ ఏంటి? వీరి మధ్య లో హీరోయిన్ కాంతి ఎలా చిక్కుకుంది? రాజా విక్రమార్క హోంమంత్రి ను మరియు కాంతి ప్రాణాలను కాపాడతాడా? మిగతా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఎన్ఐఏ ఏజెంట్ గా పాత్రకి అనుగుణంగా హీరో కార్తికేయ మంచి శరీర ఆకృతి తో డీసెంట్ గా నటించారు. పాత్ర కి తగ్గట్లుగా కార్తికేయ నటించిన విధానం చాలా బాగుంది. హీరోయిన్ తాన్య అందం గా కనిపించడం మాత్రమే కాకుండా, సినిమా లో ఆకట్టుకుంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన సుధాకర్ సినిమా సెకండ్ హాఫ్ లో కీ రోల్ పోషిస్తాడు. పాత్ర కి అనుగుణంగా మంచి నటనని కనబరిచాడు. హోంమంత్రి పాత్ర లో ఎప్పటిలాగానే సాయి కుమార్ చాలా చక్కని నటన కనబరిచారు. ఈ చిత్రం లో తనికెళ్ళ భరణి తనదైన శైలి లో పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
రాజా విక్రమార్క చిత్రం లో ఫస్ట్ హాఫ్ మైనస్ అని చెప్పాలి. చాలా సింపుల్ గా సాగుతుంది, అంతేకాక ఇంటర్వల్ ముందు వచ్చే చిన్న సస్పెన్స్ తప్ప అంత హై లెట్ ఏమీ ఉండదు. అంతేకాక హీరో కార్తికేయ పాత్ర ను చూస్తే మనం నిజంగా ఎన్ఐఏ బ్యాక్ డ్రాప్ లో సినిమా చూస్తున్నామా లేక సాధారణ సినిమానా అనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. ఒకానొక సమయంలో హీరోయిన్ హీరోను నువ్వు ఎన్ఐఏ ఏజెంటా అని అడుగుతుంది. ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. అదే విధంగా హీరోయిన్ హీరో తో ప్రేమలో పడే సన్నివేశాలు నమ్మశక్యం గా అనిపించవు, అలాంటి సందర్భాలు గతంలో కూడా చాలా సినిమాల్లో వచ్చాయి.
ఈ చిత్రం లో సింపుల్ గా సాగే కథనం మాత్రమే కాకుండా, ముందుగానే ఏం జరుగుతుంది అనేది చిత్రం ను చూస్తే తెలుస్తుంది. సుధాకర్ కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమా అంత ఇంట్రస్టింగ్ గా సాగదు. అంతేకాక ముగింపు కూడా ఈ చిత్రం లో ఏం జరుగుతుంది అనేది ముందుగానే అర్దం అవుతుంది.
సాంకేతిక విభాగం:
రచయిత, దర్శకుడు శ్రీ సారిపల్లి కార్తికేయ మరియు తనికెళ్ళ భరణి కోసం రాసిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అంతేకాక తన మొదటి చిత్రం నే ఎన్ఐఏ బ్యాక్ డ్రాప్ తో విభిన్నమైన కథను ఎంచుకున్నందుకు తప్పకుండా మెచ్చుకోవాలి. పాత్రలకు అనుగుణంగా మంచి కథనం ఉంటే సినిమా బావుండేది. అంతేకాక రొటీన్ గా సాగే మూస ఫార్ములాను దర్శకుడు ఎంచుకోవడం జరిగింది.
ఈ సినిమా లో సినిమాటోగ్రఫి చాలా బావుంది. చేజింగ్ మరియు యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకుంది. రెండవ భాగం లో కథనం కి అనుగుణంగా సాగింది. పాటలు డీసెంట్ గా ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని చెప్పాలి. ఈ చిత్రం యొక్క నిర్మాణ విలువలు కథకి, కథనం కి తగ్గట్లుగా ఉన్నాయి.
తీర్పు:
ట్రైలర్ తో, ప్రమోషన్స్ తో రాజా విక్రమార్క ఎంతో ఆసక్తి పెంచినా, అంతగా ఆకట్టుకొలేకపోయింది. ఓకే అనే థ్రిల్లర్ గా ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సీరియస్ నెస్ అనేది లోపించింది, అంతేకాక ఇంటర్వల్ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ లో అందుకు అనుగుణంగా కథనం లేకపోవడం తో అంతగా ఆకట్టుకొదు. ప్రేక్షకులకు ఆసక్తి కలిగే విధంగా లేకపోవడం తో ఈ చిత్రం కూడా సాధారణ చిత్రం లాగానే నిలుస్తుంది. అయితే ఈ వారాంతం కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం మరియు హీరో కార్తికేయ కోసం ఈ సినిమాను చూడవచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team