ఆడియో రివ్యూ : రాజన్న-తెలంగాణా సంప్రదాయాలకు అద్దం పట్టే ఆల్బం

ఆడియో రివ్యూ : రాజన్న-తెలంగాణా సంప్రదాయాలకు అద్దం పట్టే ఆల్బం

Published on Nov 29, 2011 1:44 AM IST

కింగ్ అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ప్రేస్టీజియస్ చిత్రం రాజన్న. ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర వర్మ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం అందించిన ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. ఈ చిత్ర ఆడియో ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

పాట: గిజిగాడు
పాడిన వారు: సంజీవ్, చిమ్మల్గి, కాల భైరవ
సాహిత్యం: కే. శివదత్త
సింగర్స్ మంచి భావంతో పాడారు. చాలా నెమ్మదిగా సాగుతుంది. శివదత్త గారి సాహిత్యం కవితాత్మక ధోరణిలో సాగుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పాట. సూర్యుడితో మనవ సంబందాలను గురించి చెబుతూ సన్నివేశానికి అనుగుణంగా వచ్చే పాట.

 

పాట: రా రీ రో రేలా
పాడిన వారు: మధుమిత, రేవంత్, శ్రవణ భార్గవి, కే.సాహితీ,
అమృత వర్షిని, బి.రమ్య
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
మరో గ్రామీణ నేపథ్యంలో సాగే మెలోడీ పాట. సింగర్స్ అందరు బాగా పాడారు. కీరవాణి సంగీతం మంచి అనుభూతితో సాగుతుంది. నేల గొప్పదనం గురించి చెబుతూ
వారు నేలపై ఎలా ఆధార పడ్డారో చెబుతూ కార్మికులు పాడుకునే పాట. సాహిత్యం బావుంది. సాహిత్యంలో తెలంగాణా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

 

 

పాట: కరకురాతి గుండెల్లో
పాడిన వారు: ఎం.ఎం కీరవాణి, కైలాష్ ఖేర్
సాహిత్యం: కే. శివదత్త
తెలంగాణా ప్రజలు రజకార్ల వల్ల ఎలాంటి భాదలు పడ్డారో తెలుపుతూ సాగే పాట. కీరవాణి తన గాత్రంతో పాటకి ప్రాణం పోసారు. తెలంగాణా ప్రజలు పడ్డ వేదనను తన గొంతులో వినిపించారు. శివదత్త గారి సాహిత్యం అధ్బుతంగా ఉంది. ఈ పాట తెరపై ఇంకా బాగా ఉండొచ్చు.

 

పాట: లచ్చువమ్మ
పాడిన వారు: దీపు, శ్రవణ భార్గవి
సాహిత్యం: సుద్దాల అశోక తేజ
జానపద నేపధ్యంలో సాగే శృంగార భరిత పాట. దీపు మరియు శ్రవణ భార్గవి మంచి ఉత్సాహంతో పాడారు. సుద్దాల అశోక తేజ సాహత్యం సరిగ్గా సరిపోయింది.మరియు సాహిత్యంలో తెలంగాణా ప్రభావం ఎక్కువగా ఉంది.

 

 

పాట: చిట్టిగువ్వ
పాడిన వారు: శివాని, వేణు, సంజీవ్, చిమ్మల్గి, రమ్య
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
ఈ పాటలో కర్నాటిక్ సంగీత ప్రభావం ఎక్కువగా ఉంది. మెలోడీగా సాగిపోయే పాట. కీరవాణి సంగీతం కొద్దిగా మళ్ళీ మళ్ళీ వచినట్లు అనిపిస్తుంది కానీ పర్వాలేదు అనిపించేలా ఉంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం బావుంది. సింగర్స్ అందరు బాగా పాడారు.

 

పాట: ఒక్క క్షణం
పాడిన వారు: బాలాజీ, దీపు, రేవంత్, రాహుల్, పృథ్విచంద్ర
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
మంచి సాహిత్యంతో సాగే చిన్న పాట. రాజాకార్లపై తెలంగాణా ప్రజల తిరుగుబాటు చేసే సన్నివేశంలో వచ్చే పాట. సంగీతం ఉద్రేకం పెంచేలా ఉంది.

 

 

పాట: గూడు చెదిరి కోయిల కూన
పాడిన వారు: మెట్టపల్లి సురేందర్, చైత్ర
సాహిత్యం: కే. శివదత్త
ఈ పాట చైత్ర మరియు సురేందర్ భాధతప్తమైన హృదయంతో పాడారు.సంగీతం బాగా నెమ్మదిగా సాగుతుంది. సాహిత్యం చాల బావుంది. సంగీతంకి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది.

 

పాట: కాలిగజ్జే
పాడిన వారు: మెట్టపల్లి సురేందర్, చైత్ర
సాహిత్యం: మెట్టపల్లి సురేందర్
ఇది భూసంభందమైన జానపద పాట. మెట్టపల్లి సురేందర్ మరియు చైత్ర పాటలో మొత్తం లీనమై పాడారు. జానపద వాయిద్యాలు కూడా అధ్బుతంగా పలికించారు.

 

 

 

పాట: వెయ్ వెయ్
పాడిన వారు: రేవంత్
సాహిత్యం: సుద్దాల అశోక తేజ
పవర్ ఫుల్ ఎమోషన్స్ తో సాగిపోయే పాట. సినిమాలో ఖచ్చితంగా ఈ పాట హైలెట్ అవుతుంది. రేవంత్ చాలా ఎమోషన్ తో పాడాడు. కీరవాణి సంగీతం అధ్బుతంగా ఉంది.

 

పాట: దొరసాని కొరడా
పాడిన వారు: అమృత వర్షిని
కీరవాణి మరియు హమ్మింగ్ తో సాగే చిన్న పాట. స్థానిక వాయిద్యాలు సంగీతంపై ఆధిపత్యం ప్రదర్శించాయి.

 

 

 

పాట: మేలుకోవే చిట్టితల్లి
పాడిన వారు: సుధర్షిని
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సుధర్షిని గాత్రం మాత్రమే వినిపిస్తూ సాగిపోయే పాట. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం కవితాత్మక ధోరణిలో సాగుతూ తెలంగాణ ప్రభావం ఎక్కువగా ఉంది. సంగీతం పెద్దగా లేకుండా సాగుతుంది.

 

పాట: అమ్మా అవనీ
పాడిన వారు: మాళవిక
సాహిత్యం: కే. శివదత్త
మాళవిక చాలా బాగా పాడింది. కే. శివదత్త సాహిత్యం కూడా అధ్బుతంగా ఉంది.కీరవాణి సంగీతం సాహిత్యంపై ఆధిపత్యం చూపకుండా ఉంది.

 

 

 

ఇది రెగ్యులర్ గా వచ్చే అల్బం కాదు. అందుకని రొమాటిక్ డ్యూయెట్ పాటలు ఐటెం పాటలు ఆశించకండి. అన్ని పాటలు భూసంభందమైన అనుభూతితో, క్లాసికాల్ మ్యూజిక్ తో మరియు స్థానిక వాయిద్యాలతో నిండి ఉంది. కొన్ని పాటలు తెలంగాణా ప్రజలకి బాగా నచ్చే సాహిత్యంతో ఉన్నాయి. కొన్ని పాటలు వినడానికి ఆహ్లాదకరంగా ఉన్నాయి. మొత్తం పాటలన్నీ కథ తగ్గట్టుగా సన్నివేశాలకి సరిపోయేవిధంగా చేసినట్లు అనిపిస్తుంది. ఈ పాటలు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వినండి. కీరవాణి తెలంగాణా సంప్రదాయాలకు సరిపోయే విధంగా అధ్బుతమైన సంగీతం అందించారు.

అశోక్ రెడ్డి.ఎం

Check Out Rajanna English Version Audio Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు