సమీక్ష 2 : అదరగొట్టిన రాజన్న

విడుదల తేది :22 డిశంబర్ 2011
దర్శకుడు : విజయేంద్ర ప్రసాద్
నిర్మాత :  నాగార్జున అక్కినేని
సంగిత డైరెక్టర్ : ఎం.ఎం. కీరవాణి
తారాగణం : నాగార్జున అక్కినేని, స్నేహ, ఏనీ, శ్వేతా మీనన్ మరియు ఇతరులు

రగడ వంటి కమర్షియల్ హిట్ కొట్టి ఆ తరువాత గగనం వంటి ప్రయోగాత్మక చిత్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగార్జున ప్రముఖ రచయిత మరియు రాజమౌళి తండ్రి గారు అయిన విజయేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో రాజన్న చిత్రం చేసారు. అగ్ర దర్శకుడు రాజమౌళి కీలక సన్నివేశాలకు మరియు యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకుల తీర్పు కోరుతూ మన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ:

రాజన్న చిత్ర కథ 1950లో ఆదిలాబాద్ జిల్లా లోని నేలకొండపల్లి అనే గ్రామంలో మొదలవుతుంది. నేలకొండపల్లిలో ఉండే మల్లమ్మ (ఏనీ) ని ఒక పెద్దయన అల్లారుముద్దుగా పెంచుతాడు. మల్లమ్మకి పాటలంటే ఎంతో ఇష్టం. మల్లమ్మని బడిలో చేర్పించడానికి ఆ ఊరిలో ఉండే దొరసాని అనుమతి కోసం వెళ్తారు. అక్కడ పాట పాడి దొరసాని ఆగ్రహానికి గురవుతుంది. మళ్లీ పాట పాడితే చంపేస్తానని హుకుం జారీ చేస్తుంది. ఒకానొక సందర్భంలో మల్లమ్మ అనుకోకుండా పాట పాడితే మల్లమ్మని పెంచిన పెద్దాయనని చంపేస్తుంది దొరసాని. మల్లమ్మని కూడా చంపబోతే సంగీతం మాస్టారు (నాజర్) కాపాడతాడు. దొరసాని బాధల నుండి నుండి తన ఊరికి విముక్తి లభించాలంటే డిల్లీలో ఉన్న ప్రధాన మంత్రి నెహ్రు గారి వల్ల మాత్రమే అవుతుంది అని తెలుసుకొని కాలినడకన డిల్లి కి వెళుతుంది. మల్లమ్మ డిల్లీలో ఉన్న విషయం దొరసానికి తెలుసుకుని మల్లమ్మని బందిస్తుంది. దొరసాని నుండి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో తెలియక ఏడుస్తున్న మల్లమ్మ కి “రాజన్న” వీర గాధ ని సంగీతం మాస్టారు చెబుతాడు. ఇంతకు రాజన్న ఎవరు. ఆయనకి మల్లమ్మకి ఉన్న సంబంధం ఏమిటి. మల్లమ్మ నెహ్రు ని కలిసిందా లేదా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

మల్లమ్మ పాత్రలో నంటించిన ఏనీ చాలా అధ్బుతంగా నటించింది. మల్లమ్మ పాత్రని ఏనీ తప్ప ఇంకెవరు ఇంకెవరు చేయలేరు అనిపించేలా చేసింది. పాటల్లో తన అభినయం చాలా బావుంది. తన అమాయకత్వం కలగలిసిన నవ్వుతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. మల్లమ్మ పాతకి ఏనీ కి అవార్డులు గెలుచుకుంటుంది. రాజన్న పాత్రలో నాగార్జున చాలా బాగా చేసిరు. సినిమాలో నాగార్జునని కాకుండా రాజన్నని మాత్రమే చూస్తాం. వెయ్ వెయ్ పాటలో నాగ్ నటన అధ్బుతం. మరియు 200 మంది రాజకార్లతో పోరాడే సన్నివేశాలు ఆయన అభిమానుల్ని అలరిస్తాయి. లచ్చువమ్మ గా స్నేహ బాగా చేసింది. రజకారులు తన అవమానిస్తే బరిసేతో చంపే సన్నివేశంలో అమ్మవారి అవతరంలా కనిపిస్తుంది. దొరసాని గా నటించిన శ్వేతా మీనన్ బాగా నటించింది. మల్లమ్మని పెంచిన పెద్దాయన మరియు సంగీతం మాస్టారిగా బాగా చేసారు. దిలావర్ ఖాన్ గా సత్య దేవ్, ముఖేష్ రుషి, రవి కాలే, హేమ, తెలంగాణా శకుంతల, విజయ్ కుమార్ తమ పాత్ర పరిధిలో నటించారు. రాజన్న స్నేహితులుగా అజయ్, సుప్రీత్, శ్రవణ్, ప్రదీప్ రావత్ బాగానే చేసారు.

మైనస్ పాయింట్స్:

నాగార్జున మొదటిసారి తెరపై కనిపించే సన్నివేశంలోని ఇంకా బాగా తీసి ఉంటే బావుండేది. ఆ సన్నివేశంలో డైలాగులు కూడా సరిగా పండలేదు. చిత్రం మొత్తం పూర్తి తెలంగాణ యాసలో ఉండటం వలన తెలంగాణేతర ప్రజలకి భాష విషయంలో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. రాజన్న పాత్రకి ముగింపు సరిగా ఇవ్వకపోవడం కూడా కొంత భాధ కలిగిస్తుంది.
చిత్ర మొదటి భాగంలో 7పాటలు ఉండటం, కామెడీ సన్నివేశాలు లేకపోవడంతో అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

శ్యాం కె నాయుడు, శ్యాం బండారి, పూర్ణ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. నేలకొండపల్లి గ్రామలో సన్నివేశాలు చాలా సహజంగా చూపించారు. రాజమౌళి ప్రతి సినిమాకు ఎడిటర్ గా పని చేసే కోటగిరి వెంకటేశ్వర రావు గారు ఈ సినిమాను కూడా బాగా ఎడిట్ చేసారు. రాజమౌళి గారి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీతంతో మేజిక్ చేసారు. పాటలతో ప్రేక్షలను ఉర్రూతలూగిస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోసారు. లచ్చువమ్మ పాటకి శివ శంకర్ కొరియోగ్రఫీ బావుంది. ఫైట్స్ సినిమాకి హైలెట్. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం కూడా చాలా బావుంది.

తీర్పు:

రాజన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని చిత్రంలో లీనమయ్యేలా చేస్తుంది. చిత్ర మొదటి భాగం ఏనీ అధ్బుత నటన తో అలరిస్తే, రెండవ భాగం నాగార్జున గారి నటనతో సినిమా హైలెట్ చేసారు.
ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఈ చిత్రం తప్పకుండా చూడండి.

అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్:
రాజన్న చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. రాజన్న చిత్రం చాల బావుంది చూసి ఎంజాయ్ చేయండి.

Rajanna Review English Version

సంబంధిత సమాచారం :