సమీక్ష : “రామ్ సేతు” – గుడ్ కాన్సెప్ట్ తో సాగే బోరింగ్ ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : “రామ్ సేతు” – గుడ్ కాన్సెప్ట్ తో సాగే బోరింగ్ ఎమోషనల్ డ్రామా !

Published on Oct 26, 2022 3:03 AM IST
Ram Sethu Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 25, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, నుష్రత్ భరుచ్చా, నాజర్

దర్శకత్వం : అభిషేక్ శర్మ

నిర్మాతలు: అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్, ప్రైమ్ వీడియో

సంగీతం: డేనియల్ బి జార్జ్

సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా

ఎడిటర్: రామేశ్వర్ ఎస్ భగత్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

 

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు రామ్ సేతు అనే అడ్వెంచర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారతీయ వారసత్వానికి సంబంధించిన కథాంశం తో ఈ చిత్రం రావడంతో సినీ అభిమానుల్లో ఈ సినిమా పై మంచి ఆసక్తి నెలకొంది. కాగా ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

ఆర్యన్ కులశ్రేష్ఠ (అక్షయ్ కుమార్) ఒక ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్, ఆర్యన్ తన అద్భుతమైన వర్క్ కారణంగా పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందుతాడు. అయితే, ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు, అయితే అది జరగాలంటే, ఇంద్రకాంత్ రామసేతు సహజ నిర్మాణమని నిరూపించే శాస్త్రీయ అనుమతిని పొందాలి. అందువల్ల రామసేతు సహజంగా ఏర్పడిందా ?, లేదా మానవ నిర్మితమా అని నిర్ధారించే పనిని ఆర్యన్‌కు ఇస్తారు. మరీ ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటీ ?, ఈ క్ర‌మంలో ఆర్య‌న్ అండ్ అతని టీమ్ జర్నీ ఎలా సాగింది ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

రామసేతు ను శ్రీరాముడు స్వయంగా నిర్మించాడని విశ్వసిస్తారు. మరీ ఇలాంటి రామసేతు యొక్క వేల సంవత్సరాల పురాతన భారతీయ వారసత్వాన్ని అన్వేషించాలనే ఆలోచన నిజంగా గొప్పది. ఈ ఆలోచనతో వచ్చిన ఈ చిత్రంలో రామ సేతు గురించి చెప్పిన, చూపించిన కొన్ని అంశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ పురాతన నిర్మాణం గురించి అనేక వాస్తవాలను ఈ చిత్రంలో చక్కగా ప్రస్తావించారు.

ఇక అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్ట్‌గా చాలా బాగా నటించాడు. పైగా తన గ్రేస్ తో అండ్ యాక్టింగ్ తో ఈ సినిమాను తన భుజాల పై నడిపించాడు అక్షయ్. తన పాత్రకు తగినట్టుగా ప్రొఫెషనల్‌గా నటించాలి, ఐతే అక్షయ్ తన పాత్రలో జీవించాడు. ఇతర కీలక పాత్రల్లో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు సత్యదేవ్ కూడా చాలా బాగా నటించారు. అలాగే అక్షయ్ రామసేతుపై నడవడం వంటి కొన్ని ఉత్తేజకరమైన సన్నివేశాలు ఉన్నాయి. అలాగే సెకండాఫ్‌లో ఆసక్తిని పెంచే కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు కూడా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్ర దర్శకరచయితలు భారతీయ చలనచిత్రంలోనే టచ్ చేయని మనోహరమైన సబ్జెక్ట్‌ను తీసుకున్నా.. వారు ఆ పాయింట్ కి సమానంగా ఉత్తేజకరమైన కథనం రాయడంలో విజయం సాధించలేకపోయారు. దీనికి తోడు చాలా కల్పన జోడించబడినప్పటికీ, అది ఇప్పటి కాలానికి తగినట్టుగా లేదు. నిజానికి ఇలాంటి అడ్వెంచర్ థ్రిల్లర్.. ప్రేక్షకులను కట్టిపడేసాలా ఉండాలి. అంత అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి, ఈ సినిమాలో అది మిస్ అయింది.

అన్నిటికీ మించి ఈ సినిమా చాలా వరకు ఫ్లాట్‌గా సాగుతుంది. మొదటి అరగంట నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువ సమయమే అసలు తీసుకున్న కథాంశానికి సంబంధించిన సీన్సే ఉండవు. అలాగే అక్షయ్ పాత్ర పరిచయం మరింత పదునైన రీతిలో జరిగి ఉండాల్సింది. సినిమాలో చాలా సన్నివేశాలు చాలా సింపుల్ గా వ్రాయబడ్డాయి.

అందుకే, ఈ సినిమా ప్రేక్షకులు ఆశించే థ్రిల్‌ లను ఇవ్వదు. ఈ సినిమాలో మరో పెద్ద లోపం VFX. విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. కానీ, ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు. అలాగే కొన్ని డైలాగ్స్ కూడా బాగాలేదు.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు స్రిప్ట్ లో తప్ప, టేకింగ్ అండ్ మేకింగ్ పరంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ లో డెప్త్ ఉంది. అందుకే సాంకేతికంగా పెద్దగా ఎక్కడా లోపాలు కనిపించవు. కాకపోతే వీ.ఎఫ్.ఎక్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. అయితే, కెమెరా వర్క్ దగ్గర నుంచి నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాకపోతే దర్శకుడు అభిషేక్ శర్మ కథనం పై ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

 

తీర్పు :

 

మొత్తమ్మీద, ఈ రామ్ సేతు ఒక అడ్వెంచర్ థ్రిల్లర్. అయితే, కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా సాగింది. అలాగే అక్షయ్ కుమార్ మరియు ఇతర నటీనటుల నటన కూడా చాలా బాగుంది. కానీ చప్పగా సాగే కీలక సన్నివేశాలు మరియు గ్రిప్పింగ్ లేని సీన్స్, నీరసంగా సాగే స్క్రీన్‌ప్లే, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఆకట్టుకోలేక పోయింది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు