సమీక్ష : ‘రామారావు ఆన్ డ్యూటీ’ – నిరాశ పరిచిన సీరియస్ యాక్షన్ డ్రామా !

Ramarao On Duty Movie Review

విడుదల తేదీ : జులై 29, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి తదితరులు.

దర్శకత్వం : శరత్ మండవ

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్.

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

రామారావు (రవి తేజ్) ఒక సబ్ కలెక్టర్. వెరీ సిన్సియర్ ఆఫీసర్. న్యాయం కోసం తన పరిధి దాటి ముందుకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతో తన భార్య నందిని (దివ్యాంశ కౌశిక్)తో కలిసి చిత్తూరు జిల్లాకు ఎమ్మార్వో గా వస్తాడు. అప్పటికే ఆ ఏరియాలో యస్ ఐగా మురళి (వేణు తొట్టెంపూడి) ఉంటాడు. రామారావు ఎప్పటిలాగే అక్కడ కూడా సిన్సియర్ గా పని చేస్తాడు. పెండింగ్ లో ఉన్న అన్నీ కేసులను సాల్వ్ చేస్తాడు. అయితే, రామారావు మాజీ లవర్ మాలిని (రజిషా విజయన్) భర్త మిస్ అవుతాడు. అసలు రామారావుకి – మాలినికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?, ఇంతకీ మాలిని భర్త ఎలా మిస్ అయిపోయాడు ?, అతన్ని వెతికే క్రమంలో రామారావుకి తెలిసిన షాకింగ్ నిజాలు ఏమిటీ ? చివరకు రామారావు సాధించింది ఏమిటి ?, ఇంతకీ మాలిని భర్త మిస్ అవ్వడానికి కారణం ఎవరు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా నటించిన రజిషా విజయన్ కూడా బాగానే నటించింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మాజీ హీరో వేణు కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో మాలిని భర్త.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ ను రవితేజ పాత్ర విచారణ చేస్తూ అసలు నిజాలు కనుక్కునే కొన్ని సీన్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు శరత్ విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా నడిపించాలి. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. కథలో అనేక అంశాలను జోడించి.. అనవసరమైన ట్రాక్స్ తో బోరింగ్ ప్లేతో దర్శకుడు శరత్ నిరాశ పరిచాడు.

అలాగే సినిమాలో క్రియేట్ చేసిన అనేక సమస్యలను హీరో చాకచక్యంగా సాల్వ్ చేశాడని ఒప్పించి మెప్పించడం లో కూడా దర్శకుడు శరత్ ఫెయిల్ అయ్యాడు. ఈ కథలో ఫుల్ యాక్షన్ ఉంది. కానీ.. ఈ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు. హీరో ట్రాక్ లోనూ ఎక్కడా ఇంట్రెస్ట్ కలగలేదు. పైగా ఆ ట్రాక్ మీదే మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది.

దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద అసలు వర్కౌట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సామ్ సి.ఎస్. సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాత సుధాకర్ చెరుకూరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

‘రామారావు ఆన్ డ్యూటీ’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. అలాగే సినిమాలో రవితేజ నటన, వేణు కామెడీ స్లాంగ్ బాగున్నాయి. కానీ, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్, ల్యాగ్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :