ఓటిటి సమీక్ష : రానా నాయుడు – నెట్‌ఫ్లిక్స్‌ లో వెబ్ సిరీస్

ఓటిటి సమీక్ష : రానా నాయుడు – నెట్‌ఫ్లిక్స్‌ లో వెబ్ సిరీస్

Published on Mar 11, 2023 3:03 AM IST
Rana Naidu Web Series Review In Telugu

విడుదల తేదీ : మార్చి 10, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా, రాజేష్ జైస్, రాజేష్ కుమార్, తదితరులు

దర్శకుడు : సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్

నిర్మాతలు: సుందర్ ఆరోన్

సంగీత దర్శకులు: జాన్ స్టీవర్ట్ ఎదురురి

సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి

ఎడిటర్: ఖనోల్కర్
సంబంధిత లింక్స్: ట్రైలర్

 

విక్టరీ వెంకటేష్ తొలిసారి ఒక వెబ్ సిరీస్ కోసం పనిచేశాడు, అదే ఈ రానా నాయుడు. రానా దగ్గుపాటి తో వెంకటేష్ డిజిటల్ అరంగేట్రం చేసిన ఈ వెబ్ సిరీస్ నేడు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

రానా దగ్గుపాటి ఈ వెబ్ సిరీస్ లో రానా నాయుడు గా నటించారు. ముంబయిలోని సెలబ్రిటీలకు ఉన్న సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి గా నటించాడు. బాలీవుడ్ స్టార్స్ నుంచి క్రికెటర్ల వరకు ఎవరైనా సెలబ్రిటీ ఏదైనా సమస్యలో చిక్కుకుంటే, ఆ సమస్యను పరిష్కరించేందుకు వారు రానా నాయుడు ను ముందుగా కాంటాక్ట్ అవుతారు. రానా నాయుడు తన భార్యా పిల్లలతో విడిగా ఉంటున్నాడు. అతని ఇద్దరు సోదరులు అయిన తేజ్ నాయుడు (సుశాంత్ సింగ్) మరియు పవన్ నాయుడు (అభిషేక్ బెనర్జీ) లు కూడా ముంబైలో ఉంటున్నారు. రానా నాయుడు తండ్రి అయిన నాగ నాయుడు ( విక్టరీ వెంకటేష్) 15 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత ముంబైకి వస్తాడు. రానా నాయుడు తన తండ్రిని బాగా ద్వేషిస్తాడు. రానా నాయుడు తన తండ్రిని ఎందుకు ద్వేషిస్తాడు? నాగ నాయుడు రాకతో రానా నాయుడు జీవితం ఎలా మారిపోయింది? నాగ నాయుడు జైలుకు వెళ్లడానికి గల కారణం ఏమిటి? వీటికి సమాధానాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

టైటిల్ కి తగినట్లుగా ప్రధాన పాత్రలో నటించిన రానా దగ్గుపాటి పై సిరీస్ ప్రధానం గా నడుస్తుంది. ఇందులో రానా దగ్గుపాటి చాలా బాగా నటించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అంతేకాక ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించాడు.

ఈ వెబ్ సిరీస్ కి మరొక ప్లస్ పాయింట్, విక్టరీ వెంకటేష్. ఈ సిరీస్ లో వెంకటేష్ సరికొత్తగా కనిపించాడు. మునుపెన్నడూ చూడని వెంకటేష్ ను మనం ఈ వెబ్ సిరీస్ లో చూస్తాం. ఫ్యామిలీ ద్రమలతో ఇప్పటి వరకూ ఆకట్టుకున్న వెంకటేష్ ఈ సిరీస్ లో నోటి దూకుడు గా వ్యవహారించే సరికొత్త నటుడు ను మనం చూస్తాం. తానేంటో ఈ సిరీస్ తో మరోసారి నిరూపించుకున్నాడు వెంకటేష్.

ఈ సిరీస్ లో వెంకటేష్ మరియు రానా ల మధ్య సన్నివేశాలు చాలా బాగున్నాయి.
రానా భార్యగా నటించిన సుర్వీన్ చావ్లా చాలా చక్కగా నటించింది. అభిషేక్ బెనర్జీ పోషించిన జఫ్ఫా పాత్రను బాగా రాసారు. అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటులు తమ పట్ట పరిధి మేరకు బాగానే నటించారు. చివరి నాలుగు ఎపిసోడ్‌లు ఆసక్తికరంగా ఉన్నాయి.

 

మైనస్ పాయింట్స్:

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో డిజిటల్ అరంగేట్రం చేస్తున్నప్పుడు అంచనాలు భారీగానే ఉంటాయి. అది కూడా పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటితో కలిసి నటిస్తుండడం తో ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ ను మరొక లెవెల్ లో కోరుకుంటారు. కానీ ఈ సిరీస్ హైప్‌కు తగినట్లు గా లేదు. ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోలేకపోయింది అని చెప్పాలి.

క్రైమ్ డ్రాప్ లో ఉండే కథకు, ఫ్యామిలీ డ్రామా ను జోడిస్తే అది చాలా బాగుంటుంది. కానీ ఈ సిరీస్ లో అలా జరగలేదు. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుండే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మంచి నటీనటులు ఉన్నప్పటికీ, సరైన అవుట్ పుట్ ను ఇవ్వడం లో సక్సెస్ కాలేక పోయారు.

ఏదైనా సబ్ ప్లాట్ గురించి చెప్పాలి అనుకున్నప్పడు, దాని గురించి ప్రేక్షకుడికి స్పష్టం గా తెలియజేయాలి. ఈ సిరీస్ లో ఫ్యామిలీ డ్రామా ఇంకాస్త డెవెలప్ చేసి ఉండాల్సింది. చివరిలో ఆసక్తి కలిగించే ఎపిసోడ్ లో ఉన్నప్పటికీ, ఆడియెన్స్ ముందుగా బోరింగ్ ను ఫీల్ అవ్వడం తో అసహనం కి గురి అయ్యే అవకాశం ఉంది. అంతేకాక బోరింగ్ సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది.

ఈ సిరీస్ లో అవసరానికి మించిన స్కిన్ షో ఉంది. అంతేకాక కస్ పదాలు కూడా ఎక్కువగా వాడటం జరిగింది. ఇవి చూసే ప్రేక్షకుడికి చాలా చికాకు ను తెప్పిస్తాయి.

 

సాంకేతిక విభాగం:

ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. జాన్ స్టివార్ట్ ఎదురి అందించిన సంగీతం, క్లైమాక్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. తెలుగు డబ్బింగ్ అద్భుతంగా ఉంది. భారీ సన్నివేశాలతో సిరీస్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి ఎడిటింగ్ టీమ్ వర్క్ ఇంకాస్త చేసి ఉంటే బాగుండేది.

దర్శకులు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ లు రానా నాయుడుతో పర్వాలేదు అనిపించారు కథలో తగినంత డెప్త్ లేకపోవడంతో, ఈ సిరీస్ లోని ఆర్టిస్టులకు అంతగా స్కోప్ లేదు. కథనం చాలా వీక్ గా ఉంది. స్క్రీన్ ప్లే లో అంత ఆసక్తిగా సాగలేదు. వెంకటేష్ మరియు రానాల పెర్ఫార్మెన్స్ లేకుంటే, ఈ షో ఘోరంగా నిరాశపరిచేది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

 

తీర్పు:

మొత్తం మీద, రానా నాయుడు క్రైమ్ యాక్షన్ డ్రామా పర్వాలేదు. చివరిలో వచ్చే కొన్ని ఎపిసోడ్‌లు ఆకట్టుకుంటాయి. రానా దగ్గుపాటి మరియు వెంకటేష్ ల పెర్ఫార్మెన్స్ బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా, లాంగ్ రన్ టైమ్ ను విస్మరిస్తే ఈ షో ను ఒకసారి చూడవచ్చు.

 

గమనిక : ఈ సిరీస్ లో 18+ కంటెంట్, మాటలు అధికంగా ఉన్నాయి. కాబట్టి పెద్దలకు మాత్రమే.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు