సమీక్ష : “రంగ్ దే” – ఎంటర్టైన్ చేసే ఎమోషనల్ డ్రామా

సమీక్ష : “రంగ్ దే” – ఎంటర్టైన్ చేసే ఎమోషనల్ డ్రామా

Published on Mar 27, 2021 10:02 AM IST
Rang De movie review

విడుదల తేదీ : మార్చి 26, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  3.25/5

నటీనటులు : నితిన్, కీర్తి సురేష్, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్

దర్శకత్వం : వెంకీ అట్లూరి

నిర్మాత‌లు : సూర్యదేవర నాగ వంశీ

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : పి. సి. శ్రీరామ్

ఎడిటింగ్ : నవీన్ నూలి

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెక్’ విఫలం కావడంతో ఈసారి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “రంగ్ దే” తో మళ్ళీ అదృష్టం పరీక్షించుకోడానికి రెడీ అయ్యాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు విడుదలయ్యింది. మరి ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే అర్జున్(నితిన్) అలాగే అను(కీర్తీ సురేష్) ఈ ఇద్దరూ తమ చిన్నప్పటి నుంచీ ఇరుగుపొరుగువారిగా ఒకరికొకరు తెలుసు, కానీ అర్జున్ కి మాత్రం అనుపై ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసహ్యించుకుంటేనే ఉండేవాడు. మరి ఇలాంటి ఈ ఇద్దరికీ కొన్ని ఊహించని కీలక పరిణామాలతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి వారు పెళ్లి చేసుకోడానికి గల కారణం ఏంటి? పెళ్లయ్యాక వీళ్ళ లైఫ్ లో ఎదురైన ఊహించని సంఘటన ఏంటి? అప్పుడైనా సరే అర్జున్ కి అనుపై ఇష్టం ఏర్పడుతుందా? చివరికి వీరి లైఫ్ స్టైల్ ఎలా ముగుస్తుంది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ కూడా కామెడీ యాంగిల్ మంచి హైలైట్ చేస్తూ చూపించారు. రోమ్ కామ్ యాంగిల్ లో ప్లాన్ చేసిన ఈ చిత్రం ఆ విషయంలో సక్సీడ్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా నితిన్ మరియు కీర్తీ సురేష్ ల మధ్య మొదటి నుంచి కనిపించే కామెడీ మంచి ఫన్ ను జెనరేట్ చెయ్యడంతో పాటుగా మంచి కెమిస్ట్రీ కూడా వీరి నడుమ కనిపిస్తుంది. అలాగే వెన్నెల కిషోర్ పై డిజైన్ చేసిన కామెడీ కానీ ఆ కాలేజ్ ఎపిసోడ్స్ కానీ మంచి వినోదభరితంగా ఉంటాయి. అంతే కాకుండా ఫన్ తో పాటుగా ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మంచి బ్యాలెన్సింగ్ గా మరియు చాలా స్ట్రాంగ్ గా ఇందులో కనిపిస్తాయి ఇది మంచి పరిణామం అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే నితిన్ రోల్ మంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది వరకు నితిన్ ను చాలా యాంగిల్స్ లో చూసాం కానీ ఈ చిత్రంలో తన ఫ్రస్ట్రేషన్ తో ఓ భర్తగా పెళ్ళికి ముందు షేడ్స్ తో మంచి నటనను కనబరిచాడు. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ సూపర్బ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు.లుక్స్ పరంగా కూడా బాగున్నాడు. ఇక కీర్తి విషయానికి వస్తే ఈమె రోల్ కూడా మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి నుంచీ ఓ అల్లరి అమ్మాయిలా తన నుంచి కొత్త పెర్ఫామెన్స్ ను ఖచ్చితంగా ఇందులో చూస్తారు. కేవలం తన చేష్టలతో ఫన్ ను చెయ్యడమే కాకుండా గ్లామరస్ గా కూడా కనిపిస్తుంది. కొన్ని ముఖ్య సన్నివేశాల్లో ఎమోషన్స్ ను కూడా కీర్తి బాగా పండించింది.

మరి అలాగే వెన్నెల కిషోర్ మరోసారి మంచి పాత్రలో నవ్వు తెప్పిస్తాడు. ఇక మిగతా సీనియర్ నటులు నరేష్, బ్రహ్మాజీ, కౌసల్య తదితరులు తమ పాత్రల పరిధి మేర ఎప్పటిలానే న్యాయం చేకూర్చారు. అయితే ఈ ప్లస్ పాయింట్స్ లో దేవి మ్యూజిక్ కి కూడా స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి తన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫ్రెష్ గా విజువల్ గా మరింత ఆకట్టుకునేలా ఉంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇందులో కథ అంత కొత్తగా ఏమీ అనిపించదు రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ టేకింగ్ లోకి మ్యాజిక్ జరిగింది. దాదాపు వెంకీ అన్ని సినిమాలు కూడా ఇలానే అనిపిస్తాయి సో అంత కథ పరంగా అయితే కొత్తదనాన్ని వెతుక్కోకండి.

మరి అలాగే ఇలాంటి ఫ్యామిలీ అండ్ రోమ్ కామ్ ఎంటర్టైనెర్స్ లో మెయిన్ లీడ్ రోల్స్ ఇంకా డీటైలింగ్ గా ఉంటే మరింత అందంగా ఉంటాయి. కానీ అది కనిపించదు, పైగా నితిన్ రోల్ ఓవరాల్ గా ఇంకా సాలిడ్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే కీర్తి రోల్ లో కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ డెవలెప్మెంట్స్ ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో టెక్నికల్ టీం వర్క్ చాలా బాగుటుంది. ముందుగా మెన్షన్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ మంచి రిచ్ గా ఆహ్లాదంగా ఉంటాయి. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా మొదటి ఫ్రేమ్ నుంచి ఉన్నతంగా ఉన్నాయి. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి విషయానికి వస్తే..

వెంకీ కథ పరంగా కొత్తదనం చూపకపోయినా కథనంతో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మంచి స్క్రీన్ ప్లే ఇందులో కనిపించడం వల్ల మంచి ఎంటెర్టైన్మెంట్ కనిపిస్తుంది. అలాగే ఎమోషనల్ పార్ట్ లో తన గత చిత్రాలతో పోలిస్తే చాలా పరిణితి వెంకీ రైటింగ్ లో కనిపించింది. దీని మూలాన తాను అనుకున్న అన్ని రకాల ఎమోషన్స్(కామెడీ, భావోద్వేగాలు, డ్రామా, రొమాన్స్) ను పర్ఫెక్ట్ ఈ దర్శకుడు రాబట్టగలిగాడు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “రంగ్ దే” లో నితిన్ మరియు కీర్తీల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు అలాగే మంచి కామెడీ,బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ సహా రొమాంటిక్ ట్రాక్స్ ఆకట్టుకుంటాయి. కాకపోతే దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమీ కనిపించదు కానీ కథనం ప్రతీ ఒక్కరినీ ఈ చిత్రం మెప్పిస్తుంది. సో ఓవరాల్ గా ఈ వారాంతానికి ఫ్యామిలీ తో కలిసి చూడచక్కగా థియేటర్స్ లో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

123telugu.com Rating :  3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు