సమీక్ష : “రంగ రంగ వైభవంగా” – రొటీన్ గా సాగే ఫ్యామిలీ డ్రామా !

సమీక్ష : “రంగ రంగ వైభవంగా” – రొటీన్ గా సాగే ఫ్యామిలీ డ్రామా !

Published on Sep 3, 2022 3:03 AM IST
Ranga Ranga Vaibhavanga Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 02, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, సీనియర్ నరేష్, ప్రభు, ప్రగతి, తులసి తదితరులు

దర్శకత్వం : గిరీశాయ

నిర్మాతలు: BVSN ప్రసాద్

సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

రిషి (వైష్ణవ్ తేజ్) రాధ (కేతిక శర్మ) ఇద్దరూ ఒకేరోజు పుడతారు, చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు, ఒకేలా ఆలోచిస్తారు. వీరి రెండు కుటుంబాలు కూడా ఎంతో స్నేహంగా ఉంటాయి. అయితే.. స్కూల్ లో ఇద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన కారణంగా రిషి – రాధ మధ్య మాటలు ఉండవు. అయినా, ఒకరి పై ఒకరికి ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రిషి ఫ్యామిలీ – రాధ ఫ్యామిలీ విడిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో రిషి – రాధ తమ ప్రేమతో పాటు తమ ఫ్యామిలీస్ ను తిరిగి ఎలా కలిపారు ?, ఈ మధ్యలో వంశీ (నవీన్ చంద్ర) ట్రాక్ ఏమిటి ?, వీరి ప్రేమకు వంశీ పాత్ర ఎలా అడ్డుగా నిలబడింది ?, చివరకు వీరి కథ ఎలా సుఖాంతం అయింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

రంగ రంగ వైభవంగా అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన గిరీశాయ, ఈ సినిమాలో కొన్ని కామెడీ అండ్ లవ్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోగా వైష్ణవ్ తేజ్ రిషి పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి రంగ రంగ వైభవంగా కొన్ని చోట్ల ఆకట్టుకుంది.

వైష్ణవ్ తేజ్ తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రిషి పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర నటన చాలా బాగుంది. ఇక హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో నటించడానికి ఆమె బాగానే తాపత్రయ పడింది. ఇక పేరెంట్స్ పాత్రల్లో కనిపించిన సీనియర్ నరేష్, ప్రభు, ప్రగతి, తులసి చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాలో దేవి అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు గిరీశాయ ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. రిషి – రాధ మధ్య సాగే సీన్స్ బాగా స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. వీరి మధ్య అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దీనికీ తోడు నువ్వే కావాలి, ఆనందం, నిన్నే పెళ్ళాడతా లాంటి చిత్రాల ప్రభావం ఈ చిత్రం పై మరీ ఎక్కువగా ఉంది.

పైగా సినిమా ఈ స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు దేవి అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు గిరీశాయ ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఇక సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

ఎమోషనల్ లవ్ స్టోరీలతో వచ్చిన ఈ ‘రంగ రంగ వైభవంగా’లో లవ్ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ సీన్స్ పర్వాలేదనిపించాయి. ఐతే, స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, రెగ్యులర్ సిల్లీ లవ్ డ్రామా వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు పర్వాలేదు అనిపించొచ్చు. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు