సమీక్ష : ఆహా కళ్యాణం – ఆహా అనేంత లేదు..

Aaha-Kalyanam విడుదల తేది : 21 ఫిబ్రవరి 2014
123123తెలుగు .కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : గోకుల్ కృష్ణ
నిర్మాతలు : ఆదిత్య చోప్రా
సంగీతం: ధరన్ కుమార్
నటినటులునాని, వాణి కపూర్…

ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ దక్షిణ భారత దేశంలో మొదటి సారిగా అడుగుపెట్టి నిర్మించిన సినిమా ‘ఆహా కళ్యాణం’ . బాలీవుడ్ హిట్ మూవీ ‘బ్యాండ్ బాజా బారత్’ కి ఇది రీమేక్. నాని, వాణి కపూర్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు ఆంద్రప్రదేశ్ అంతటా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ :

శక్తి (నాని) ఎటువంటి లక్ష్యం లేకుండా ఉన్న ఒక గ్రాడ్యుయేట్, అతనికి జీవితంలో ఏం చేయాలో కూడా తెలియదు. ఒక రోజు అతను ఒక పెళ్లిలో శృతి (వాణి కపూర్)ని కలుస్తాడు. వారిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. శృతి ఒక లక్ష్యం వున్న అమ్మాయి. ఆమె సొంతంగా ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ప్రారంభించాలని అనుకుంటుంది.

ఒక రోజు శక్తికి అతని తండ్రితో గొడవ జరుగుతుంది. ఆయన ఊరికి వచ్చి వారి వ్యాపారం చూసుకొమంటాడు. దానికి శక్తి ఒప్పుకోకుండా తనకి ఒక వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ వుందని తండ్రికి అబద్దం చెబుతాడు. దానిని నిజం చేయడానికి అతను ప్రయత్నిస్తూ వుంటాడు. దానితో అతను శృతిని కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో తనిని పాట్నర్ గా చేసుకోమని కోరతాడు.

కొద్ది రోజులు ఆలోచించిన తరువాత శక్తిని పాట్నర్ గా చేర్చుకోవడానికి శృతి అంగీకరిస్తుంది. వారిద్దరూ కలిసి ‘గట్టి మేళం’ అనే పేరుతో వెడ్డింగ్ కంపెనీని మొదలుపెడతారు. వీరి కంపెనీకి కొద్ది రోజుల్లోనే మంచి పేరు వస్తుంది. ఆ కంపెనీ పేరు నగరం మొత్తం మారు మోగిపోతుంది.

ఒక రోజు శృతి, శక్తి వారి సక్సస్ వేడుక జరుపుకుంటూ వుండగా ఒక చిన్న సంఘటన వారిద్దరి మధ్య గొడవకి దారి తీస్తుంది. అసలు ఆ గొడవ ఏంటి? ఆ తరువాత వారి బిజినెస్ ఏమైంది? మళ్ళి వారిద్దరూ కలిశారా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

‘బ్యాండ్ బాజా బారత్’ సినిమాలో అనుష్క, రన్వీర్ నటించారు. ఆహా కళ్యాణం సినిమాలో కూడా నాని సరిగ్గా అదేవిదంగా నటించాడు. నాని చేసిన టపోరి సీన్, పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా ఒరిజినల్ వెర్షన్ హీరో రంవీర్ సింగ్ ని మనకు గుర్తు రానివ్వకుండా నటించాడు అంటే నాని పెర్ఫార్మన్స్ ఎంత బాగుందో అర్థం అయ్యిందనుకుంటా..

వాణి కపూర్ దక్షిణాదిన నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాతో ఆమె మంచి పేరును సంపాదించుకుంది. తనది కష్టమైన పాత్ర అయినా చాలా చక్కగా నటించింది. నానికి, వాణి కి మధ్య కెమిస్ట్రీ బాగుంది. సినిమా మొదటి బాగం చాలా ఎంటర్తైనింగ్ గా సాగుతుంది.

సాంగ్స్ , డాన్స్ చిత్రీకరించిన విధానం బాగుంది. మరొక ముఖ్యమైన విషయం ఈ సినిమాలో చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు చూడటానికి చాలా బాగున్నాయి. షూట్ చేసిన విధానం కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మొత్తం తమిళ ఫిల్మ్ లా అనిపిస్తుందని అనుకున్నారు. అలాగే ఈ సినిమా బాక్ డ్రాప్, నటీనటులు కూడా తెలుగు సినిమాకు చెందిన వారు కాకపోవడం వల్ల కాస్త కనెక్ట్ అవ్వరు. ఈ సినిమాలో చేసిన వెడ్డింగ్స్ బాగున్నాయి. కానీ వాటిలో తెలుగు నేటివిటి లేకపోవడం ఒక మైనస్.

సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంత డెప్త్ గా లేవు. సెకండాఫ్ ఆశించినంత బాగాలేదు. బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ‘బ్యాండ్ బాజా బారత్’ ఎలా ఉందో అలాగే ‘ఆహా కళ్యాణం’ ను నిర్మించారు. హిందీ వెర్షన్ లో సన్నివేశాలను అలానే దించడం బాగాలేదు.

ఈ సినిమాలో మరొక మైనస్ పాయింట్ నటీనటులు. హీరో హీరోయిన్ కాకుండా మిగిలిన పాత్రలు అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. నాని ఒక్కడే సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. సిమ్రాన్ చేసిన స్పెషల్ పాత్ర కూడా సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

‘ఆహా కళ్యాణం’ సినిమాని భారీ టెక్నికల్ వ్యాల్యుస్ తో నిర్మించారు. ఈ సినిమాలో వెడ్డింగ్స్ అన్ని చాలా కలర్ ఫుల్ గా చూపించారు. ఈ సినిమాలో ఆర్ట్ విభాగం వారు చక్కని ప్రతిభతో రిచ్ గా కనిపించేలా చిత్రీకరించారు. మ్యూజిక్ పరవాలేదు. సినిమాలో ఒకటి రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గౌండ్ మ్యూజిక్ స్మూత్ గా ఉంది.

డైలాగ్స్ బాగున్నాయి. నాని కి తగినట్టుగా వున్నాయి. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే అంత బాగాలేదు. డైరెక్టర్ గోకుల్ కృష్ణ దర్శకత్వం ఈ సినిమా విషయంలో అంత బాగాలేదు. ఎందుకంటే ‘బ్యాండ్ బాజా బారత్’ ని మక్కికి మక్కి దించేశారు.

తీర్పు :

‘ఆహా కళ్యాణం’ సినిమా ఒక్క నాని స్టార్ ఇమేజ్, టాలెంట్ వల్ల ఆడుతుంది. నాని – వాణి కపూర్ ల మధ్య కెమిస్ట్రీ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమాలో పెద్ద డ్రాబ్యాక్ సెకండాఫ్. సెకండాఫ్ లో చిత్రీకరించిన ఎమోషనల్ సన్నివేశాలు అంత బాలేవు. మీరు నాని కోసం సినిమా చూడొచ్చు లేదంటే ఈ మూవీలో ఆహా అని చెప్పుకునేంత లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version