సమీక్ష : బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ – 2 : అమెజాన్ ప్రైమ్ లో హిందీ సిరీస్

సమీక్ష : బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ – 2 : అమెజాన్ ప్రైమ్ లో హిందీ సిరీస్

Published on Nov 10, 2022 3:06 AM IST
Breathe Into The Shadows S2 Movie Review

విడుదల తేదీ : నవంబర్ 09, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్, అమిత్ సద్, నవీన్ కస్తూరియా, సయామీ ఖేర్

దర్శకుడు : మయాంక్ శర్మ

నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా మరియు అబదంతియ ఎంటర్టైన్మెంట్

సంగీత దర్శకులు: కరణ్ కులకర్ణి

సినిమాటోగ్రఫీ: ఎస్. భరద్వాజ్

ఎడిటర్: సుమీత్ కోటియన్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 


ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో పలు అద్భుత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు సైతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఆ విధంగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ – 1 మంచి విజయం అందుకోగా అభిషేక్ బచ్చన్ ఈ వెబ్ సిరీస్ తో మంచి పేరు సొంతం చేసుకున్నారు. మరి ఇక నేడు రిలీజ్ అయిన బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ – 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

మొదటి సీజన్ ముగింపుకి కొనసాగింపుగా సరిగ్గా సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. రావణ హంతకుడి మానసిక మార్పు కోసం అతడికి మూడేళ్ళ పాటు మెంటల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే అంతా సజావుగా జరుగుతుంది అనుకున్న సమయంలో సడన్ గా విక్టర్ ( నవీన్ కస్తూరియా) అతడికి సహాయం చేసి అక్కడి నుండి తప్పిస్తాడు. అనంతరం మళ్ళి అతడు ఎప్పటి మాదిరిగా హత్యలు చేయడం మొదలెట్టడంతో పోలీసులకు మళ్ళి తలనొప్పులు మొదలవుతాయి. కబీర్ సావంత్ ( అమిత్ సద్ ) మరొక్కసారి ఈ కేసు డీల్ చేయడానికి ఛార్జ్ తీసుకుంటాడు. అసలు విక్టర్, రావణ హంతకుడికి ఎందుకు సహాయం చేసాడు, మరి రావణ హంతకుడు తన పది హత్యలను పూర్తి చేశాడా, అతడిని పోలీసులు అరెస్ట్ చేసారా, అలానే అవినాష్ సభర్వాల్ ( అభిషేక్ అగర్వాల్ ) ఫామిలీ మరి సేఫ్ గానే ఉందా అనేటువంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరకాలి అంటే సీజన్ 2 చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఇప్పటికే సీజన్ 1 లో తన అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న అభిషేక్ బచ్చన్ సీజన్ 2 లో కూడా తన అద్భుత పెర్ఫార్మన్స్ ని కొనసాగించారు. నిజానికి ఇటువంటి రోల్ చేయడం ఎంతో కష్టం అనే చెప్పాలి. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్, డైలాగ్స్ ఇలా ప్రతో ఒక్క అంశంలో కూడా తన పాత్ర ద్వారా పరకాయ ప్రవేశం చేసి తన సూపర్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు అభిషేక్ బచ్చన్. ఆయన పాత్ర, యాక్టింగ్ బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ – 1 , ఎస్ – 2 కి పెద్ద ప్లస్. అయితే ఈ తాజా సీజన్ లో మరొక సర్ప్రైజింగ్ అంశం ఏమిటంటే, ఇందులో రావణ హంతకుడికి అనుచరుడిగా టివిఎఫ్ పిచర్స్ ఫేమ్ నవీన్ కస్తూరియా కూడా సూపర్ గా తన నటనతో అలరించారు. అటు అభిషేక్ ఇటు నవీన్ ఇద్దరూ కూడా స్క్రీన్ పై కనిపించినంత సేపు చూపుతిప్పుకోలేము. అలానే వారిద్దరి తరువాత అమిత్ సద్ కూడా పోలీస్ అధికారి పాత్రలో జీవించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎంతో బాగుంది. ఇక కథకి లింక్ చేస్తూ వచ్చే సయామీ ఖేర్ పాత్ర కూడా బాగుంది, ఇక నిత్యా మీనన్ కూడా చిన్న పాత్ర అయినప్పటికీ పరిధి మేరకు ఆకట్టుకునే నటన కనబరిచారు. ఈ సిరీస్ లో మంచి ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. అవి చివర్లో క్లైమాక్స్ సమయంలో రావడం అలానే ఊహించని విధంగా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం జరుగుతుంది. అయితే సీజన్ 1 మాదిరిగా కాకుండా సీజన్ 2 ని తక్కువ నిడివితో తెరకెక్కించడం కూడా మంచి అంశం. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్క్రీన్ పై ఆడియన్స్ కి ప్రతి సీన్ ని ఎంతో కనెక్ట్ చేస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

ముఖ్య ఇబ్బందికర విషయం ఏమిటంటే సీజన్ 2 లో చాలా వరకు సన్నివేశాలు మనకు తరువాత ఏమి జరుగుతుంది అనేది తెలిసిపోతుండడం. సీజన్ 1 మాదిరిగా అతడు ఈ సీజన్ 2 లో కూడా తన హత్యలను కొనసాగిస్తాడు అనేది మనకు కొంత అర్ధం అవుతుంది. అయితే స్క్రీన్ పై వాటి ప్రెజెంటేషన్ అంతగా ఆకట్టుకోదు, ఆ విషయంలో రైటర్ మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. ఇక పక్కాగా ప్రెడిక్టబుల్ గా సాగే నారేషన్ ఆడియన్స్ కి నీరసం తెప్పించడంతో మరింత ఆసక్తికరకంగా స్క్రిప్ట్ రాసుకుంటే బాగుండేది అనిపించకమానదు. కొన్ని ఎపిసోడ్స్ లో చాలావరకు లాజిక్స్ మిస్ చేసినట్లు అనిపిస్తుంది. చాలావరకు హంతకుడు ప్రతి హత్య నుండి ఈజీ గా తప్పించుకోవడం కూడా నమ్మేలా అనిపించదు. ఇక సీజన్ 1 మాదిరిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉండవు సరికదా రైటింగ్ టీమ్ దీనిపై కూడా మరింత కేర్ తీసుకోవాల్సింది. కొన్ని హత్యలకు సంబందించిన కారణాలు సరైనవిగా అనిపించవు. అలానే ఎమోషనల్ కూడా ఆకట్టుకోవు. ఇక హంతకుడు పది హత్యల లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు సిరీస్ కొనసాగుతుంది. అలానే వాటికి గల కారణాలు కూడా కొంత వ్యత్యాసం ఉన్నట్లు అనిపిస్తాయి.

 

సాంకేతిక వర్గం :

ముఖ్యంగా నిర్మాతల భారీ నిర్మాణ విలువలు ఈ సిరీస్ కొనసాగినంతసేపు ఆడియన్స్ కి కళ్ళకు కట్టినట్లు వారి ఖర్చుని స్క్రీన్ పై ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు కరణ్ కులకర్ణి కొన్ని సాధారణ సీన్స్ ని సైతం తన అద్భుత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లారు అని చెప్పాలి. అలానే భరద్వాజ్ ఫోటోగ్రఫి కూడా ఎంతో బాగుంది. కొన్ని సన్నివేశాలు అయితే ఎంతో ఆకట్టుకుంటాయి. ఎడిటర్ పని తీరు కూడా ఆకట్టుకుంటుంది. అయితే డైరెక్టర్ మయాంక్ శర్మ ఈ తాజా సీజన్ లో తన వర్క్ తో ఏమాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోరు అని చెప్పాలి. అతను మరింత ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ ట్విస్టులు కలిగిన కథనాన్ని రాసుకుని ఉంటె బాగుండేది అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో చాలా సన్నివేశాలు ప్రతి ఒక్కరు ఊహించే విధంగా తేలిపోయాయి. సరైన స్క్రీన్ ప్లే రాసుకోకపోవడం వలన బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ – 2 కంటే సీజన్ 1 మరింత బాగుందనిపిస్తుంది.

 

తీర్పు :

మొత్తంగా చూస్తే బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ – 2 నటీనటులు ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో కొంత అలరించే ట్విస్టులతో బాగుందనే చెప్పాలి. అయితే చాలా సీన్స్ ఈజీగా తెలిసిపోతుండడం, ఆకట్టుకోని ఎమోషనల్ సీన్స్, పర్వాలేదనిపించే స్క్రీన్ ప్లే వంటివి ఈ వారం ఈ సిరీస్ ని చూసేయొచ్చు. అయితే మీరు క్రైమ్ డ్రామాల ప్రేమికులు అయితే మాత్రం తప్పకుండా మిస్ కాకుండా బ్రీత్ ఇన్ టూ ది షాడోస్ ఎస్ – 2 ని చూడండి మరి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు