విడుదల తేదీ : 8 మార్చి 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5 |
||
దర్శకుడు : కుమార్ నాగేంద్ర |
||
నిర్మాత : లక్ష్మీ మంచు | ||
సంగీతం : ‘మాస్ట్రో’ ఇళయరాజా |
||
నటీనటులు : ఆది, లక్ష్మీ మంచు, తాప్సీ, సందీప్ కిషన్ … |
1986లో జరిగిన గోదావరి వరదల గురించి వి.ఎస్ రామారావు రచించిన గోదావరి నవలా ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘గుండెల్లో గోదారి’. రియాలిటీకి దగ్గరగా తెరకెక్కిన ఈ సినిమా గత ఐదు, ఆరు నెలలుగా సరైన సమయం లేక, మరోసారి థియేటర్లు లేవని ఇలా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చిట్ట చివరికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతటా రిలీజ్ అయ్యింది. ఆది, లక్ష్మీ మంచు, తాప్సీ, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందించారు. మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ మంచు నిర్మించిన ఈ సినిమాకి కుమార్ నాగేంద్ర దర్శకుడు. ఇప్పుడు గుండెల్లో గోదారి సినిమాలో వరదలు ఎలా ఉన్నాయి, అసలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
ఈ సినిమాని బి.వి.ఎస్.రామారావు రచించిన ‘గోదావరి కథలు’ నవలా ఆధారంగా చేసుకొని నిర్మించారు. ఈ సినిమాని 1986 బ్యాక్ డ్రాఫ్ లో రాజమండ్రి దగ్గర గల ఒక గ్రామంలో చిత్రీకరించారు. మల్లి (ఆది), చిత్ర(లక్ష్మీ మంచు) పెళ్లి చేసుకుంటుండగా ఒక భయంకరమైన వరద వస్తుంది. జీవితం మీద ఆశను వదులుకున్న వారు ఆ వరదలో కొట్టుకు పోతూ వారు పట్టుకోవడానికి ఒక సపోర్ట్ దొరకడంతో తమ జీవితంలో జరిగిపోయిన విషయాలను ఒకరికొకరు చెప్పుకుంటారు. మల్లి నిజాయితీగా కష్టపడి పనిచేసే స్వభావం గల ఫిషర్ మాన్. ఒక సొంత పడవ కొనుక్కొని జీవనాధారం సాగించాలనేది తన జీవితాశయం. చేపల వ్యాపారి సాంభశివయ్య వద్ద ఆది పనిచేస్తూ ఉంటాడు. సరళ(తాప్సీ) సంభశివయ్య కూతురు. తను మల్లిని ఇష్టపడుతుంది. అది తెలిసిన మల్లి తననుండి దూరంగా ఉండడానికి ప్రయత్నిసాడు. కానీ తన ప్రేమకి లొంగిపోతాడు. ఇలా సాగిపోతున్నవీరి ప్రేమ వ్యవహారం సంభశివయ్యకి తెలుస్తుంది.
చిత్ర ఒక మామూలు పల్లెటూరి అమ్మాయి. తను సూరి(సందీప్ కిషన్)తో కలసి పెరుగుతుంది. ఈమె దొరబాబు(రవిబాబు) వద్ద పని చేస్తూ ఉంటుంది. దొరబాబుకు అమ్మాయిల పిచ్చి వుంటుంది. తన దగ్గర పని చేసే వారిని లోబరుచుకుంటూ ఉంటాడు. సూరిని అపార్థం చేసుకొని చిత్ర ఒంటరిగా మిగిలిపోతుంది. తను భాదలన్నీ మరిచిపోతున్న తరుణంలో ఆమె జీవితంలో ఒక కీలకమైన మార్పు సంభవిస్తుంది. అప్పుడు తను ఏం చెయ్యాలో తెలియని సందిగ్దంలో పడుతుంది. అప్పుడు ఆమె ఏం చేసింది? సూరి జీవితం ఏమైంది? మల్లి మరియు చిత్ర వరద నుండి ప్రాణాలతో బయటపడ్డారా? లేదా?ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాత కథలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ‘గుండెల్లో గోదారి’ సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో వచ్చే వరద సన్నివేశాలను సూపర్బ్ గా తెరకెక్కించారు. ఈ వరద సన్నివేశాల సమయంలో వచ్చే గాలీ, వాన ఎఫెక్ట్స్ ని పర్ఫెక్ట్ గా తీయడం కోసం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చాలా కష్ట పడ్డారు. ఫిషర్ మాన్ గా ఆది నటన చాలా భాగుంది. ఆది పాత్రకు తగ్గట్టుగానే చాలా మాస్, నేచురల్ లుక్ తో కనిపిస్తాడు. ఈ సినిమాలో తాప్సీ పాత్ర చాలా అసక్తికరంగా వుంది. తను అనుకున్న పాత్రకి పూర్తి న్యాయం చేసింది. లక్ష్మీ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సందీప్ కిషన్ నటన ఓకే అనేలా ఉంది. అమ్మాయిల పిచ్చి ఉన్నపాత్రలో దొరబాబు పాత్రలో రవిబాబునటన బాగుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. తాప్సీ, ఆది లపై చిత్రీకరించిన సన్నివేశాలు చాలా కామెడీగా ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలు వింటుంటే 80ల కాలం నాటి సంగీతాన్ని గుర్తుకుతెస్తాయి(వీటిని మనం రేడియోలోనో, బ్యాక్ గ్రౌండ్ లోనో వింటుంటాము). ప్రేక్షకులను ఆకట్టుకునే కొన్ని చక్కని డైలాగ్స్ ఉన్నాయి అవి మాస్ మసాలా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్:
సందీప్ కిషన్, లక్ష్మీ లపై సెకండాఫ్ లో చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ఇంకాస్త బాగా తీసివుంటే భాగుండేది. దీనిలో సరళమైన పాత్రలు కనిపించవు. ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ పైపై నే చిత్రికరించినట్లుగా అనిపిస్తాయి. ఈ సినిమా అక్కడక్కడా చాలా నిదానంగా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ కాస్త నెమ్మదిగా ఉంటుంది. సినిమాలో పరిపూర్ణ వివరణ ఇవ్వని విషయాలు చాలా ఉన్నాయి. అసలు ఎలా ఆది – లక్ష్మీల పెళ్లి జరిగింది? అసలు వీరిద్దరి పెళ్లి ఎవరు ఫిక్స్ చేసారు? ఆది, తాప్సీల రొమాంటిక్ ట్రాక్ తర్వాత వారిద్దరి మధ్య ఏమి జరిగింది? అనే విషయాలకు ఖచ్చితమైన ముగింపు లేదు. సెకండాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ సింపుల్ గా, ఊహించే విధంగా ఉన్నాయి.
సాంకేతికం :
ఎం.ఎన్. పలనికుమార్ సినిమాటోగ్రఫీ అధ్బుతంగా ఉంది. తను గోదావరి పరిసర ప్రాంతాలను, గోదావరి డెల్టా అందాలను ఎంతో బ్యూటిఫుల్ గా చూపించారు. మాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన హైలైట్. ఈ సినిమాలోని పాటలు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. సెకండాఫ్ ఎడిటింగ్ ఇంకాస్త బాగా చేసుండాల్సింది. కుమార్ నాగేంద్ర చాలా మంచి టెక్నీషియన్. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయాల మీద కాస్త కమాండ్ తెచ్చుకుంటే చాలా మంచి సినిమాలు తీయగలడు.
తీర్పు :
లక్ష్మీ మంచు ఎంతో కమాండ్ తో చేసిన సినిమా ‘గుండెల్లో గోదారి’. ఈ సినిమాలోని బలం, బలహీనతల గురించి చెప్పడం జరిగింది. అద్భుతమైన గోదావరి వరదల సీన్స్, సూపర్బ్ సినిమాటోగ్రఫీ మరియు బాగా సాగిపోయే ఫస్ట్ హాఫ్ సినిమాలో చెప్పుకోదగిన అంశాలు. కానీ సెకండాఫ్ కాస్త స్లోగా ఉండటం వల్ల ఆ ఫీల్ కాస్త దెబ్బతింటుంది. ఈ సినిమా కోసం అద్భుతమైన టెక్నికల్ డిపార్ట్ మెంట్ దృష్ట్యా ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
అనువాదం : నగేష్ మేకల