సమీక్ష : “లవ్లీ” – ఒక లవ్లీ ఫ్యామిలీ మూవీ

విడుదల తేది : 30 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.5/5
దర్శకుడు : జయ .బి
నిర్మాత : రాజు బి. ఎ.
సంగిత డైరెక్టర్ : అనూప్ రుపెన్స్
తారాగణం : ఆది, శాన్వి

యంగ్ హీరో ఆది ఈరోజు రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “లవ్లీ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బి.ఏ రాజు నిర్మించిన ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకం పై వచ్చిన ఈ చిత్రంలో శాన్వి కథానాయికగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

కథ :

ఆకాష్ (ఆది) ఒక సాదా సీదా కుర్రాడు. ఇతను ప్రేమకథలన్నా, అమ్మాయిలన్నా పట్టించుకోని ఒక యువకుడు. అతని స్నేహితుడు కిట్టు(వెన్నెల కిషోర్), లల్లి(చిన్మయి ఘట్రాజు) ఫేస్ బుక్ లో స్నేహితులుగా ఉంటారు. ఒకరినొకరు కలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కిట్టు భయం మూలాన తన స్థానంలో ఆదిని పంపుతాడు. ఇంకొక వైపు లల్లి తన బదులుగా లావణ్య (శాన్వి)ని పంపుతుంది. మొదటి చూపులోనే ప్రేమలో పడిన వీరి బంధం తొందరలోనే బలమవుతుంది.

అన్ని సరిగ్గానే జరుగుతుంది అనిపిస్తుండగా. మంగళం పల్లి మహారధి(రాజేంద్రప్రసాద్) కథలోకి ప్రవేశిస్తాడు. ఆకాష్ ప్రవర్తన నచ్చని మహారధి వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు. ఆకాష్ మహారధిని ఒప్పించాడా? మహారధి ఆకాష్ ని అడ్డుకున్నాడా? అనేది మిగిలిన కథ

ప్లస్:

ఆది తన మొదటి చిత్రంతో పోల్చుకుంటే నటనాపరంగా చాలా ఎదిగాడు. పాటలు మరియు పోరాట సన్నివేశాలలో అతను చాలా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇదే విధంగా చేస్తే అతను పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంటాడు. శాన్వి తన తొలి చిత్రం అయినా ఆకట్టుకుంది.ఇలానే కొనసాగిస్తే పరిశ్రమలో నిలదోక్కుకోగలదు. ఆది మరియు శాన్వల మధ్య ప్రేమ కథ చాలా బాగా చూపించారు.

రాజేంద్ర ప్రసాద్, శాన్వి తండ్రిగా చాలా అద్బుతమయిన ప్రదర్శన కనబరిచారు. ప్రతి సన్నివేశంలో హాస్యాన్ని చాలా అద్బుతంగా పండించారు. దానితో పాటు సెంటిమెంట్ సన్నివేశాలను కూడా తనదయిన శైలిలో రక్తి కట్టించారు. చాలా రోజుల తరువాత వెన్నెల కిషోర్ కి మంచి పాత్ర దొరికింది అయన ఆ పాత్రకు న్యాయం చేశారు. చిన్మయి ఘట్రాజు ప్రేక్షకులను తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తెలంగాణా యాసలో తన సంభాషణలు అద్బుతంగా పలికించారు.

చిన్న పాత్రలే అయిన పరుచూరి గోపాల కృష్ణ, ఆహుతి ప్రసాద్ లు ప్రేక్షకులను నవ్వించారు. మొదటి అర్ధ భాగం చాలా బాగా నడిచింది పాటల చిత్రీకరణ చాలా బాగుంది.

మైనస్:

క్లైమాక్స్ ఇంకాస్త బాగా చూపించాల్సి ఉంది. తండ్రి మరియు కూతురి ప్రేమికుడు మధ్య సన్నివేశాలను ఇంకాస్త ఆకట్టుకునేల తీసి ఉంటె బాగుండేది. ఈ సన్నివేశాలు కాస్త కృత్రిమంగా అనిపిస్తుంది. చిత్రంలో కొన్ని సన్నివేశాలలో చేసిన తప్పులు పసిగట్టేయచ్చు ఇవి జరగకుండా చూసుకోవాల్సింది.

రెండవ అర్ధ భాగంలో చిత్రం చాలా నెమ్మదిగా నడుస్తుంది. చిత్రంలో తరువాత రాబోయే సన్నివేశాని ఇట్టే ఊహించేయవచ్చు. తండ్రి కూతుర్ల మధ్య సెంటిమెంట్ సన్నివేశాలను ఇంకాస్త బాగా చూపించాల్సి ఉంది.

సాంకేతిక అంశాలు :

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కొన్ని సన్నివేశాలను అద్బుతంగా చూపించారు. దర్శకురాలు బి.జయ చిత్ర మొదటి అర్ధ భాగంలో వేగాన్ని తగ్గకుండా చూసుకోవటంలో సఫలం అయ్యారు. సంభాషణలు చాలా పదునుగా ఆకర్షణీయంగా ఉన్నాయి.ఎడిటింగ్ బాగుంది. ఆది ఫైట్ లు, డాన్స్ లు అద్బుతంగా చేయించారు.

తీర్పు:
చిత్రంలో వినోదం ప్రధాన పాత్ర పోషించింది. మొదటి అర్ధంలో హాస్యం మరియు ఆది నటన ఈ చిత్రాన్ని నిలబెట్టింది. రెండవ అర్ధం నెమ్మదిగా సాగటం మరియు క్లైమాక్స్ బాగుంటే చిత్రం మరోలా ఉండేది. మొత్తానికి బి.జయ తను అనుకున్నది చెప్పటంలో సఫలం అయ్యారు.

123తెలుగు.కాం రేటింగ్ : 3.5/5

Clicke Here For ‘Lovely’ English Review

అనువాదం – రవి

Exit mobile version