ఓటిటి రివ్యూ : “ఓరు పక్కా కథై” – (జీ5లో ప్రసారం)

ఓటిటి రివ్యూ : “ఓరు పక్కా కథై” – (జీ5లో ప్రసారం)

Published on Dec 28, 2020 2:00 PM IST

నటీనటులు : కాళిదాసు జైరామ్, మేఘా ఆకాష్ తదితరులు.
దర్శకత్వం : బాలాజీ
నిర్మాత : కె ఎస్ శ్రీనివాసన్
ఎడిటింగ్ : ఆంటోనీ
రచన : బాలాజీ

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న ఫిల్మ్ “ఓరు పక్కా కథై”. జీ5 లో విడుదలైన ఈ తమిళ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

శరవణన్ (కాళిదాస్ జయరామ్) మరియు మీరా (మేఘా ఆకాష్) ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతుంటారు. అప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉంటారు, వారి ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని తల్లిదండ్రులకు తెలపగా వారు కూడా సంతోషంగా అంగీకరిస్తారు.పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ దంపతులకు శారీరక సంబంధం లేకుండానే మీరా గర్భవతి అని తెలియడంతో పరిస్థితులు మారిపోతాయి.అప్పుడు, మీరా గర్భవతి ఎలా అయ్యింది? అని తెలుసుకుని ఈ సమస్యను పరిష్కరించుకుని ఎలా బయట పడింది అనేది మొత్తం కథ.

ప్లస్ పాయింట్స్ :

2014 లో షూటింగ్ మొదలైన ఈ చిత్రం అనేక కారణాల వలన ఆలస్యమయి ఇప్పటికి విడుదల అయ్యింది.అందువలన ప్రధాన నటులు చాలా యవ్వనంగా కనిపించటంతో పాటు మంచి నటనను కనబరుస్తారు.తనకు తెలియకుండా గర్భవతి అయిన అమ్మాయిగా మేఘా ఆకాష్ ఈ సినిమాని తన భుజాల మీద నడిపిస్తుంది.అనేక భావోద్వేగాలతో కూడిన ఆ పాత్రను చాల అద్భుతంగా నటించి మేఘా ఆకాష్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవల విడుదల అయిన ‘పావా కథైగల్‌’తో కాళిదాస్ జయరాం అగ్ర నటుడిగా రూపాంతరం చెందాడు. అతను కూడా కొన్ని సన్నివేశాలలో కొంచెం మోటైన వాడుగా కనిపిస్తూ తన పాత్రలో బాగా నటించాడు .

ముఖ్యంగా ఈ సినిమాలో సహాయ నటులుగా చేసిన మీనా వేమూరి మరియు లక్ష్మి ప్రియా మీనన్ లు తమ పాత్రలకి సమ న్యాయం చేశారు. ఇక నిర్మాణ విలువలు, సంగీతం కూడా టాప్ లో ఉంటాయి.మంచి ఫ్లో లో వెళుతున్న సమయంలో వచ్చే సంఘర్షణ విషయంతో సినిమా ఊహించని విధంగా మారుతుంది. ప్రధాన సమస్యకు ఇచ్చిన శాస్త్రీయ కారణాలు కూడా సముచితంగా కనిపిస్తాయి. ప్రథమార్ధంలో ఈ సమస్యను ఆకట్టుకునే రీతిలో చూయించటంలో దర్శకుడు బాలాజీ తరణీతరన్ ప్రతిభ కనిపిస్తుంది.

నెగటివ్ పాయింట్స్:

విన్నూతనమైన సమస్యను సరిగా వాడుకోవటంలో దర్శకుడు కొంచెం తడబడ్డాడు.బిడ్డ పుట్టిన తరువాత వచ్చే ఎపిసోడ్ అంతా కొంచెం గందరగోళంగా ఉండటంతో ప్రేక్షకులు ఇబ్బంది పడతారు.దేవుడు ప్రత్యక్షమయి ఆ శిశువు తనదిగా చెప్పటం, సినిమాలో కనిపించే
అనేక మూఢ నమ్మకాలు కూడా సినిమాను తప్పుదారి పట్టించాయి.కథనం చాలా స్లోగా ఉండటం మరో ప్రతికూలాంశం. ఒక చిన్న అమ్మాయి ట్రాక్ కూడా సినిమాని పక్కదారి పట్టిస్తుంది.

ఈ చిత్రం ముగింపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది కానీ దాని కోసం, ప్రేక్షకులు రెండవ భాగం అంతా నిస్తేజంగా కూర్చుని ఎదురు చూడాల్సి వస్తుంది,ఒక నవల నుండి ఈ అద్భుత ఆలోచన తీసుకున్న దర్శకుడు దాని కథనం మరియు ఫామిలీ డ్రామాని నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. నాణ్యత లేని ప్రొడక్షన్ డిజైన్ మరియు ఎడిటింగ్ కూడా సినిమాని బాగా దెబ్బ తీశాయి.

తీర్పు:

మొత్తానికి,’ఓరు పక్కా కథై’ ఇది చాలా ప్రత్యేకమైన సమస్య కలిగిన ఒక కుటుంబ కథగా అనుకోవచ్చు.ఆరంభం చాలా మంచి ఫ్లోతో మొదలై సెకెండ్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది. కానీ అక్కడ నుండి, చాలా బలవంతపు భావోద్వేగాలు మరియు ఇతర పాత్రల సన్నివేశాల క్రమం మొత్తానికి కథనాన్ని పాడు చేస్తాయి. ఇక చివరిగా పర్లేదు…విభిన్న కథతో వచ్చిన ఈ చిత్రాన్ని ఒకసారి చూసి టైం పాస్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ను అయితే కలిగిస్తోంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు