విడుదల తేదీ: 18 అక్టోబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5 |
||
దర్శకుడు : పూరి జగన్నాధ్ |
||
నిర్మాత : డివివి దానయ్య | ||
సంగీతం: మణి శర్మ |
||
నటీనటులు : పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాష్ రాజ్ |
‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాతా పవన్ కళ్యాన్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
సమాజం పట్ల ఎంతో భాధ్యతా యుతంగా ప్రవర్తించే ఒక మెకానిక్ కుర్రాడు రాంబాబు(పవన్ కళ్యాణ్). అతను న్యూస్ లో వచ్చే అరాచకాలను చాలా బాధ పడుతుంటాడు మరియు ఎవరికీ తెలియకుండా వెళ్లి కొంత మందిని నాశనం చేస్తుంటాడు. అతనిలో ఉన్న ఆసక్తిని గమనించిన గంగ(తమన్నా) రాంబాబుకి స్ఫూర్తినిచ్చి ఒక టీవీ చానల్లో జర్నలిస్ట్ గా చేరుస్తుంది. అన్నిటికీ అంగీకరించి ధర్మవరపు సుబ్రమణ్యం నడిపే టీవీ చానల్లో చేరుతాడు. అతని పనిలో భాగంగా సి.ఎమ్ కుర్చీ కోసం ప్రయత్నిస్తుండే మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్షనేత అయినటువంటి జవహర్ నాయుడు(కోట శ్రీనివాసరావు) తో గొడవ పెట్టుకుంటాడు. జవహర్ నాయుడు కొడుకైన ప్రకాష్ రాజ్ కి ఒక భయంకరమైన గ్యాంగ్ ఉంటుంది. రాంబాబు వాళ్ళని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు.
వారి ఇద్దరి మధ్యా పోరు పెరిగి పెద్దదవుతుంది. తన తండ్రి సింపతీతో ప్రకాష్ రాజ్ ముఖ్య మంత్రి అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. అతన్ని నియంత్రించాలి అనుకున్న రాంబాబు తన తెలివితేటలతో రాష్ట్రంలోని యువకులందరినీ ఒకటిగా చేసి ర్యాలీ నిర్వహిస్తాడు. ప్రకాష్ రాజ్ ని ముఖ్య మంత్రి కాకుండా రాంబాబు అడ్డుకున్నాడా లేదా? అనేదే మిగిలిన కథాశం.
ప్లస్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటను కనబరిచారు, సినిమా మొత్తాన్ని ఆయనొక్కరే తన భుజాల పై వేసుకొని మోశారు. అతని ఎనర్జీ మరియు పవర్ఫుల్ గా కనపడడటం సినిమాకి ప్రత్యేక హైలైట్ అని చెప్పుకోవాలి. పూరి జగన్నాథ్ రాసిన పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ కి పవన్ తోడవడంతో థియేటర్లో డైలాగ్స్ బాగా పేలాయి. పూఅరి తన అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా కొంత మంచి హాస్యాన్ని పండించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులకు సరిపోయే కొన్ని డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదాహరణకి ‘ వాడికి దూల ఎక్కువై కుర్చి ఎక్కితే మీకు దూల తీరిపోద్ది’, ఇలా వచ్చే కొన్ని డైలాగ్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
తమన్నా చాలా అందంగా ఉంది. ఇంతకముందు కన్నా ఈ సినిమాలో ఇంకా అందంగా ఉంది. క్రూరమైన రాజకీయ నాయకులుగా కోట శ్రీనివాసరావు మరియు ప్రకాష్ రాజ్ బాగా నటించారు. ముఖ్యమంత్రి రెడ్డి గా నాజర్ మరియు తనికెళ్ళ భరణి తమ పాత్రకి తగ్గట్టు నటించారు. టీవీ చానల్ క్రియేటివ్ హెడ్స్ గా బ్రహ్మానందం మరియు అలీ కొద్దిసేపు తమ కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించారు.
ఈ సినిమాకి సెకండ్ హాఫ్ మేజర్ హైలైట్. సెకండ్ హాఫ్ లో పవర్ఫుల్ పొలిటికల్ సీన్స్ మరియు మంచి భావోద్వేగామైన సన్నివేశాలు ఉన్నాయి. పవన్ తో యువత కలిసి రాష్టం మొత్తం చేసే ర్యాలీలు, ప్రకాష్ రాజ్ కి ఇచ్చే పంచ్ లు మరియు జాతీయ సమైక్యతను గురించి మాట్లాడే సన్నివేశాలు ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. సెకండ్ హాఫ్ లో పవన్ మరియు బ్రహ్మానందం కలిసి న్యూస్ చదివే సన్నివేశాలు చాలా హాస్యభరితంగా ఉన్నాయి. తమన్నా – పవన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ అభిమానులకు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చుతుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సూపర్బ్ గా ఉంది.
మైనస్ పాయింట్స్ :
ఇదివరకే చెప్పినట్టుగా తమన్నా పూర్తి గ్లామరస్ గా ఉంది కానీ తన పాత్రకి నటనకి ఎలాంటి ఆస్కారమూ లేదు. ప్రతి పూరి సినిమాలోనూ హీరోయిన్స్ అందరూ ఎందుకంత పవర్స్ కలిగి ఉంటారో అంది తెలియడంలేదు. గంగ పాత్ర కొన్ని సందర్భాల్లో బోర్ కొడుతుంది. ప్రకాష్ రాజ్ మరియు ఎం.ఎల్.ఏ లు అందరూ భయపడి ఒక ఇంట్లో దాక్కొని ఉండే సన్నివేశాలు కొంచెం స్లోగా ఉంటాయి. కథలో కూడా అక్కడక్కడా హెచ్చు తగ్గులు ఉన్నాయి కానీ పవన్ తన నటనతో మరియు పంచ్ డైలాగ్స్ తో దాన్ని కొంత పోగొట్టారు.
ఇందులో అన్ని పాత్రలు పైపైనే ఉంటాయి. మోసపూరిత స్వభావం మరియు క్రూరమైన మనస్తత్వం కలిగిన ప్రకాష్ రాజ్ పాత్రని ఇంకా బాగా చూపించవచ్చు కానీ పూరి చాలా సింపుల్ గా చూపించేశారు. ఎలాంటి బలమైన ఉద్దేశమూ లేకుండానే తను సి.ఎమ్ అవ్వాలని వాళ్ళ ప్రకాష్ రాజ్ నాన్నని చంపేయాలనుకుంటాడు. ఫస్ట్ హాఫ్ ఇంకా ఆసక్తికరంగా ఉండాల్సింది మరియు సెకండ్ హాఫ్ లో గాబ్రియేల ఓ టీవీ చానల్ బాస్ గా చాలా చిరాకు పెడుతుంది.
సాంకేతిక విభాగం :
మణిశర్మ అందిచిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో మరియు ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో మ్యూజిక్ చాలా బాగుంది. కానీ పాటలు మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. డైలాగ్స్ బాగున్నాయి. మొత్తంగా ఎడిటింగ్ బాగా చేసారు, కానీ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేది. అన్ని ఫైట్స్ కి పవన్ బాగా సూట్ అయ్యాడు మరియు ఫైట్స్ కూడా బాగా కంపోస్ చేసారు. సినిమాటోగ్రఫీ బాగుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఓకే, కానీ చెప్పుకునేంత రేంజ్లో లేదు. సినిమాలోని పాత్రల మీద పూరి ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది.
తీర్పు :
పవన్ కళ్యాణ్ ఎనర్జీ మరియు పవర్ఫుల్ నటనతో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా బాగానే ఆడుతుంది. సెకండ్ హాఫ్ పంచ్ డైలాగ్స్ తో మరియు పవన్ సూపర్బ్ నటనతో చాలా బాగుంటుంది. కథ మీద మరియు సినిమాలోని పాత్రల మీద ఇంకొంచెం శ్రద్ధ వహించాల్సింది. పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది మరియు మిగతా సినీ ప్రేమికులకి మాములుగా అనిపిస్తుంది.
123తెలుగు.కాం రేటింగ్ : 3.25/5
అనువాదం – రాఘవ
Click Here For ‘CMGR’ English Review
Click Here For ‘Box Office Babu rao Puri Jagannadh interview’