సమీక్ష : పూల రంగడు – ఒక అందమయిన కమర్షియల్ చిత్రం

సమీక్ష : పూల రంగడు – ఒక అందమయిన కమర్షియల్ చిత్రం

Published on Feb 18, 2012 8:06 PM IST
విడుదల తేది : 18 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : వీరబ్రహ్మం
నిర్మాత :కె అచ్చిరెడ్డి
సంగిత డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
తారాగణం : సునీల్,ఇషా చావ్లా, కోటా శ్రీనివాసరావు , ప్రదీప్ రావత్

సునీల్ మరియు ఇషా చావ్లా లు జంటగా చేసిన చిత్రం “పూల రంగడు”. వీరభద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కే.అచ్చి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

రంగ(సునీల్), రియల్ ఎస్టేట్ బ్రోకేర్ గా ఉంటాడు కాని ఆర్ధిక సమస్యలతో బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ప్రిన్సు దగ్గర నుండి గవరాజు(పృథ్వీ) అనే పాత్ర దగ్గర అప్పు చేసి ఒక భూమి కొనుక్కుంటాడు తన సమస్యలు అన్ని తీరిపోతాయి అని అనుకుంటాడు. ఆ స్థలాన్ని అమ్మాలని ప్రయత్నిస్తుండగా ఆ స్థలం కోన రెడ్డి(దేవ్ గిల్) మరియు లాలా గౌడ్(ప్రదీప్ రావట్) మధ్యలో చిక్కుకొని ఉంటుంది అని తెలుసుకుంటాడు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే లాలా గౌడ్ కూతురు అనిత(ఇషా చావ్లా) ఒక్కటే మార్గం అనుకున్న రంగ అనిత మరియు తన స్నేహితుడు వాసు(ఆలి) ల తో కలిసి కోన రెడ్డి మరియు లాలా గౌడ్ లను కలపాలని ప్రయత్నిస్తాడు వాళ్ళిద్దరి కుటుంబాలను ఎలా కలిపాడు అనేదే మిగిలిన కథ.

ప్లస్:

సునీల్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ తన డాన్స్ లతో మరియు తన హాస్య చతురత తో ప్రేక్షకులను అలరించారు. పతాక సన్నివేశాలలో వచ్చే పోరాటాలలో అద్బుతంగా చేశారు. చిరంజీవి మరియు మోహన్ బాబు లను అనుకరించే సన్నివేశం లో అద్బుతంగా చేశారు.

ఇషా చావ్లా తన అందంతో చాలా బాగా అలరించింది కొన్ని సన్నివేశాలలో చాలా బాగా చేసింది సునీల్ కి తన ప్రేమను తెలియ చేసే సన్నివేశం లో తను పలికించిన భావాలు అద్బుతం. సునీల్ సరసన సరిజోడి అనిపించుకుంది.

అలీ మరియు రఘుబాబు వారి వారి పాత్ర పరిధిలో బానే చేసారు. దేవ్ గిల్ మరియు ప్రదీప్ రావత్ ప్రతినయకులుగా పరవాలేదనిపించారు. పృథ్వీ రాజ్ ఈదర గవరాజు పాత్రలో ప్రేక్షకులను బాగా నవ్వించారు. తెలంగాణా శకుంతల చిన్న పాత్ర చేసిన ఉన్నంతసేపు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

చిత్రం లో మొదటి అర్ధ భాగం చాల వేగంగా సాగుతుంది. తెర మీద పాటలు చూడటానికి చాలా బాగున్నాయి. పతాక సన్నివేశాలలో వచ్చే పోరాటాలు చాలా బాగా వచ్చాయి

మైనస్ :

శరీర సౌష్టవం ఎలా ఉన్నా కాని సునీల్ కి గతం లో ఉన్న కళ కనపడటం లేదు ఈ విషయం మీద సునీల్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. “పూల రంగడు” అనే పేరు కి ఎక్కడ న్యాయం చేసినట్టు కనిపించలేదు. కోట శ్రీనివాసరావు ,సుధా మరియు దువ్వాసి మోహన్ ల పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదు. రెండవ అర్ధం లో కథ కాస్త లోపించి నెమ్మదిస్తుంది. చిత్ర కథ లో కాస్త మర్యాద రామన్న ఛాయలు కనిపిస్తాయి. దేవ్ గిల్ పాత్రలో కాస్త నిలకడలేమి తనం కనిపిస్తుంది

సాంకేతిక విభాగం :

కథ,కథనం మరియు దర్శకత్వ బాధ్యతలు వీరభద్రమ్ నిర్వహించారు. అన్ని విభాగాల లోను చాలా బాగా చేశారు. మంచి కమర్షియల్ దర్శకునిగా భవిష్యత్తు ఉంది. మొదటి అర్ధం లో కథనం వేగంగా నడిచినా రెండా అర్ధ భాగం నెమ్మదించింది ఈ విషయం మీద కాస్త దృష్టి సారించాల్సి ఉంది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ పరవాలేదు.

శ్రీధర్ సీపన రచించిన సంభాషణలు సన్నివేశానికి తగ్గట్టు చాలా బాగా ఉన్నాయి. అనూప్ సమకూర్చిన నేఫధ్య సంగీతం అందులోనూ పతాక సన్నివేశాలలో ఇచ్చిన నేఫధ్య సంగీతం అద్బుతం. కోరియోగ్రఫీ చాలా బాగుంది సునీల్ ని అద్బుతంగా ఉపయోగించుకున్నారు.

తీర్పు :

పూల రంగడు మంచి ఎంటర్ టైనింగ్ చిత్రం . సునీల్ నటన వీరభద్రమ్ వేగంతో కూడిన కథనం ఇషా చావ్లా అందం ఈ చిత్రానికి ఆకర్షణలుగా నిలిచాయి. చిత్రం లో కొత్తదనం ఏమి లేకపోయినా హాస్యం మరియు కథనం బాగా సమకూరాయి. ఇవే పూల రంగడు విజయ అవకాశాలను మెరుగు పరిచాయి.

123తెలుగు.కామ్ రేటింగ్: 3.25/5

అనువాదం :రవి తేజ

Clicke Here For ‘Poola Rangadu’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు