సమీక్ష : ప్రేమ ఒక మైకం – మైకం కాదు టార్చర్

Prema_Oka_Maikam_Telugu_Rev విడుదల తేదీ : 30 ఆగష్టు 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
దర్శకుడు : చందు
నిర్మాత : శ్రీకాంత్ సూర్య, వెంకట సురేష్
సంగీతం : ఎంజీకే ప్రవీణ్
నటీనటులు : ఛార్మి, రాహుల్, శరణ్య

 

‘ప్రేమ ఒక మైకం’ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైంది. ’10క్లాస్’ ఫేం చందు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఛార్మి ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. రాహుల్(హ్యాపీ డేస్ టైసన్), శరణ్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాని శ్రీకాంత్ సూర్య, వెంకట సురేష్ నిర్మించారు.

కథ :

మల్లిక(ఛార్మి) ఒక హై క్లాస్ కాల్ గర్ల్. బయట ప్రపంచంలోని వారు తన గురించి ఏమన్నా లెక్కచేయకుండా ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తూ హ్యాపీగా ఉంటుంది. ఒక రోజు రాత్రి రోడ్డు దాటుతున్న లలిత్(రాహుల్)ని తను యాక్సిడెంట్ చేస్తుంది. తను వెంటనే తన ఫ్రెండ్ వంశీ(రావు రమేష్) హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. కానీ లలిత్ తన కళ్ళను కోల్పోతాడు. లలిత్ చాలా మంచి వాడు. తను రైటర్ గా పనిచేస్తూ వుంటాడు. మల్లిక లలిత్ ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంలో మల్లికా లలిత్ నుండి కొన్నిఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటుంది. డబ్బు, విలాసవంతమైన జీవితం మాత్రమే జీవితం కాదని ఇంకా వేరే ఉందని తెలుసుకుంటుంది.

దీనిలో బాగంగా తను లలిత్, సింగర్ స్వాతి(శరణ్య నాగ్)ల విషాద ప్రేమ కథ గురించి తెలుసుకుంటుంది. మల్లికా లలిత్ కు సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. దానికోసం తను ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి? లలిత్, స్వాతిల ప్రేమ చివరికి ఏమైంది? తెలియాలంటే ‘ప్రేమ ఒక మైకం’ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ మద్య పాపులర్ అయిన కమెడియన్ శంకర్ రామ్ గోపాల్ వర్మను అనుకరించే సీన్స్ తో సెకండాఫ్ లో కొద్దిసేపు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసాడు. ఇది మాత్రమే ఈ సినిమాలో చెప్పదగిన ఏకైక ప్లస్ పాయింట్. ఛార్మి కొన్ని సన్నివేశాలలో చూడటానికి బాగుంది. శరణ్య డీసెంట్ గా ఉంది.

మైనస్ పాయింట్స్ :

ఒక కుండ నిండా ఇసుక ఇచ్చేసి అందులోనుంచి ఒక ప్రత్యేకమైన ఒక ఇసుక రేణువుని మాత్రమే తియ్యమంటే చాలా కష్టమైన పని. ఈ సినిమాలో నుంచి మైనస్ పాయింట్స్ చెప్పడం కూడా అంతే కష్టమైన పని. కానీ నాకు అనిపించిన కొన్ని చెబుతాను..

సాంకేతిక విభాగం పరంగా చూసుకుంటే.. ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా తీసిన సినిమాలలో ఇదీ ఒకటి. చాలా షార్ట్ ఫిల్మ్స్ లో, చిన్న బడ్జెట్ సినిమాల్లో దీనికంటే మించిన టెక్నికల్ వాల్యూస్ ఉంటున్నాయి. చార్మీ ఈ సినిమాలో కాస్త ఎక్కువసేపు కనిపించే ఓ అతిధి పాత్ర చేసింది. ఈ సినిమాని ఒక్క చార్మీ పేరు మరియు పోస్టర్స్ చూపించి ప్రచారం చేసారు కానీ రియాలిటీకి వస్తే ఆమె స్క్రీన్ పైన కనిపించేది చాలా తక్కువ సమయమే..

రాహుల్ పెర్ఫార్మన్స్ అస్సలు బాగోలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో హావభావాలు అస్సలు పలికించలేకపోయాడు. సురేఖ వాణి, చంద్ర మోహన్ పాత్రలు వృధా అయిపోయాయి. మరోసారి రావు రమేష్ అసలు ప్రాముఖ్యత లేని పాత్రలో కనిపించాడు.

అసలు కథలో లాజిక్ ఉండదు. డైరెక్టర్ ఒకేసారి నాలుగైదు పాయింట్స్ ని డీల్ చెయ్యాలనుకోవడం వల్ల అన్నిటినీ కలిపి సినిమాని కిచిడీలాగా చేసాడు. అసలు సినిమాలో రాహుల్ -శరణ్య మధ్య చూపించే లవ్ స్టొరీ పెద్ద జోక్ లా అనిపిస్తుంది. సినిమాలో పరిచయం చేసిన గంజాయి డాన్ ని విలన్ గా చూపించాలి కానీ చివరికి ఆ పాత్ర కామెడీ రోల్ అయిపోయింది.

సాంకేతిక విభాగం :

సినిమాని ఎడిట్ చేస్తున్నప్పుడు వి. నాగి రెడ్డి ‘ఇంకీ పింకీ పోంకీ’ అనే పాట విన్నట్టు ఉన్నారు. సీన్స్ మరియు సన్నివేశాల క్రమం ఏదిపడితే అది వస్తుంటుంది. అంత గజిబిజి గందరగోళంలా ఉంటుంది. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ ఏమాత్రం బాగోలేదు. డిఐ వర్క్ అస్సలు చెయ్యలేదు. రీ రికార్డింగ్ చాలా పెద్ద జోక్ లా అనిపిస్తుంది ఎందుకంటే అయిపోయిన సీన్ కి రావాల్సిన మ్యూజిక్ ప్రస్తుతం జరుగుతున్న సీన్ కి వస్తుంటుంది. సినిమాకి డిటిఎస్ మిక్సింగ్ కూడా చెయ్యకపోవడం నన్ను షాక్ కి గురిచేసింది.

చందు డైరెక్షన్ చాలా నాశిరకంగా ఉంది. ’10థ్ క్లాస్’ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ నుంచి ప్రేక్షకులు ఇలాంటి సినిమాను ఆశించరు. డైలాగ్స్ యావరేజ్ గా ఉన్నాయి.

తీర్పు:

మొదటి పాయింట్ – ఛార్మి ఈ సినిమాలో లీడ్ రోల్ చేయలేదు. రెండవ పాయింట్ – సినిమా చాలా చెత్తగా ఉంది. అయినా సరే మీకు మైకం రావాలనుకుంటే ‘ప్రేమ ఒక మైకం’ సినిమాకి వెళ్ళవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ 1/5

రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version