రివ్యూ : థ్రిల్లర్ ( శ్రేయాస్ ఈటి అప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ప్రసారం)

రివ్యూ : థ్రిల్లర్ ( శ్రేయాస్ ఈటి అప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ప్రసారం)

Published on Aug 14, 2020 11:12 PM IST
Thriller Telugu Movie Review

Release date : Aug 14th, 2020

123telugu.com Rating : 2.25/5

తారాగణం : అప్సర రాణి, రాక్ కాచి తదితరులు

రచన : రామ్ గోపాల్ వర్మ

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

 

 

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ‘థ్రిల్లర్’. ఈ సినిమా ‘శ్రేయాస్ ఈటి అప్’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

కథ గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. అప్సర రాణిగారి గ్లామర్ షోని చూపించడానికి మధ్యమధ్యలో సౌండ్ ఎఫెక్ట్స్.. పాత చింతకాయ పచ్చడి లాంటి వర్మ శైలి కెమెరా షాట్స్.. అంతే, ఇక అంతకు మించి ఈ సినిమాలో కథేమి లేదు. సరే ఉన్న ఆ బరితెగింపు షాట్స్ గురించే క్లుప్తంగా చెప్పుకుంటే.. సమీర్ (రాక్ కాచి) మేఘ (అప్సర రాణి) ఇద్దరూ ఫ్రెండ్స్. అర్ధరాత్రి దాకా తిరిగి ఇంటికి వచ్చిన మేఘతో రొమాన్స్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తాడు ఈ సమీర్. దాని కోసం ఇతాగాడు ఏమి చేశాడు ? అది కాస్త వికటించి చివరకు ఇతనికి ఏ గతి పట్టిందనేదే మిగిలిన బాగోతం.

 

ఏం బాగుంది :

అప్సర రాణి ఒళ్ళు దాచుకోకుండా అందాల ప్రదర్శనలో అవార్డు విన్నింగ్ రేంజ్ లో గ్లామర్ ను ఒలకబోయటం యూత్ ని ఆకట్టుకోవచ్చు. ఇక ఈ మినీ సినిమాలో అంతకు మించి మ్యాటర్ లేదు. ఉన్న బూతు షాట్స్ లో నుండే పాజిటివ్ కోణంలో చూస్తే.. రొమాంటిక్ హారర్ డ్రామాగా రావాలనుకున్న.. ఈ సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్, అలాగే కొన్ని బూతు క్రియేటివిటీ షాట్స్ ఉన్నా.. అవి వర్కౌట్ అవ్వలేదు.

ఇక మెయిన్ క్యారెక్టర్ గా నటించిన అప్సర రాణి తన పాత్రకు తగ్గట్లు ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందచందాలతో తన సెక్సీ మూమెంట్స్ తో మెప్పించే ప్రయత్నం చేసినా ఈ సినిమా వల్ల ఆమెకు ఒరిగేది ఏమి ఉండదు. అదేవిధంగా మిగిలిన ఇద్దరు నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.

 

ఏం బాగాలేదు :

వర్మ ఎప్పటిలాగే నిరాశ పరిచాడు. వర్మ సినిమాలో ట్రైలర్ లో ఏమి ఉంటుందో.. సినిమాలో కూడా అంతకు మించి కొత్తగా ఏమి ఉండదనేది ఇక మెంటల్ గా ఫిక్స్ అయిపోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ భయపడటంకు మించి కనీస ఆసక్తి లేకుండా సాగిన ఈ షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమాని దయచేసి ఎవ్వరు చూడకండి. ఇరవై మూడు నిమిషాల షార్ట్ ఫిల్మ్ కి రెండు వందల టికెట్, ఆనందంగా 40 రూపాయల జి.యస్.టి.. ఈ తొక్కులో సినిమాకి 240 రూపాయిలు అనేది అసలు గిట్టుబాటు కాదు.

మొత్తానికి వివాదాస్పద అంశాలతో లేదా బూతుతో దర్శకుడిగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ, ఎప్పటిలాగే థ్రిల్లర్ మెయిన్ కంటెంట్ అంతా ట్రైలర్ లోనే చూపించేసాడు, యూత్ వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవటానికి ప్రతి షాట్ లో అవసరం ఉన్నా లేకపోయినా వర్మ ఎప్పటిలాగే ఓవర్ ఎక్స్ పోజింగ్ ను ఇరికించి చికాకు పుట్టించి.. సినిమా లవర్స్ కి కూడా సినిమా మీద విరక్తి పుట్టించాడు.

ప్రతి షాట్ కూడా భయపెట్టేలా చేయడానికి, అలాగే హీరోయిన్ బాడీని చూపించడానికి వర్మ కిందామిద పడినా, ప్లే మాత్రం పరుగులు పెట్టించలేకపోయాడు. ఆర్జీవీ కథాకథనాలలోని మెయిన్ మ్యాటర్ పూర్తిగా వదిలేసి చివర్లో ఒక టెక్స్ట్ డైలాగ్ తో కంటెంట్ ను సరిపెట్టేశాడు. దీనికి తోడు బలం లేని స్క్రిప్ట్ లో బలహీన ఎమోషన్ ను సృష్టించి సినిమా మీద ఎలాంటి ఇంట్రస్ట్ కలగకుండా చేసాడు.

 

చివరి మాటగా :

దయచేసి ఈ థ్రిల్లర్ మూవీకి అందరూ దూరంగా ఉండటమే చాలా బెటర్.అసలు అప్సర రాణి అంటూ ఆర్జీవీ అందించిన ఈ అత్యంత దిగువ స్థాయి బూతు చిత్రం రేంజ్ కి, దీని రేటుకి ఎక్కడా పొంతన లేదు. అక్కడక్కడా అప్సర రాణి గ్లామర్ తప్పితే ఈ మినీ మూవీలో భయపెట్టే హారర్ గాని, థ్రిల్స్ గాని ఏమి లేవు. అవే షాట్స్, అదే బూతు.. అదే ట్రాక్ తప్పిన వర్మ. అందుకే ఈ కంటెంట్ లెస్ సినిమాని చూడకపోవడమే ఉత్తమైన పని అనిపించుకుంటుంది. డబ్బులు చేసుకోవాలనే ఒకే ఒక్క ఎజెండాతోనో వర్మ అందించిన చెత్త సినిమాల్లో మరో మినీ సినిమాగా ఇది నిలిచిపోతుంది.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు