సమీక్ష : “ఆర్జీవీ అమ్మాయి” – ఆర్జీవీ నుంచి మరో డిజప్పాయింటింగ్ వర్క్

సమీక్ష : “ఆర్జీవీ అమ్మాయి” – ఆర్జీవీ నుంచి మరో డిజప్పాయింటింగ్ వర్క్

Published on Jul 16, 2022 3:03 AM IST
RGV’s Ammayi Movie Review

విడుదల తేదీ : జులై 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: పూజా భలేకర్, మియా ముఖి, అభిమన్యు సింగ్, రాజ్‌పాల్ యాదవ్

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

నిర్మాత: నరేష్ టి, శ్రీధర్, రామ్ గోపాల్ వర్మ

సంగీత దర్శకుడు: రవి శంకర్

సినిమాటోగ్రఫీ: రామి

ఎడిటర్: శాన్ లోకేష్

సంచలనాలకు కేరాఫ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికపుడు నాన్ స్టాప్ తనదైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వాటి ఫలితంతో సంబందం లేకున్నా తన నుంచి సినిమాలు మాత్రం ఆగడం లేదు. అలా లేటెస్ట్ గా చేసిన మరో యాక్షన్ డ్రామా చిత్రం “ఆర్జీవీ అమ్మాయి”. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది మరి ఇప్పుడు రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ:

ఇక కథ లోకి వస్తే..చాలా యారొగెంట్ గా అబ్బాయిలకు ధీటుగా ఉండే పూజా(పూజా బాలేకర్) ఎప్పటి నుంచో బ్రూస్ లీ కి పెద్ద ఫ్యాన్.. అయితే బ్రూస్ లీ లా తాను కూడా మార్షల్ ఆర్ట్స్ లో గొప్ప స్థాయికి రావాలని తన ఊరు నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోడానికి సిటీకి వస్తుంది. అక్కడ ఓ కోచ్ దగ్గర కూడా జాయిన్ అవుతుంది. అయితే ఆమె ఎంతో ఉత్సాహంగా నేర్చుకునే క్రమంలో తన కోచ్ ని కొంతమంది చంపేస్తారు. మరి వారు ఎందుకు ఆమె కోచ్ ని చంపేశారు? అక్కడ నుంచి పూజా పరిస్థితి ఏంటి? తన కోచ్ మరణానికి వేరే కారణం ఏమన్నా ఉందా ఉంటే దాన్ని ఆమె ఎలా సాల్వ్ చేస్తుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాని మొదటి నుంచి ప్రమోట్ చేస్తున్న వాటిలోనే సాలిడ్ యాక్షన్ విజువల్స్ అయితే అధికంగానే కనిపిస్తాయి. అలాగే మన దగ్గర అయితే ఇలా లేడీ ఓరియెంటెడ్ లో ఈ రకమైన యాక్షన్ సినిమా కూడా రాలేదు. ఇది బాగా అనిపిస్తుంది. ఇక తన రోల్ లో అయితే పూజా ఆశ్చర్యపరుస్తుంది.

యాక్షన్ పార్ట్స్ లో అయితే డెఫినెట్ గా ఆడియెన్స్ మతి పోగొడుతుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే నటించింది. ఇంకా మరో నటుడు అభిమన్యు సింగ్ తన పాత్రలో బాగా నటించాడు. అలాగే క్లైమాక్స్ సీన్ లో డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్ కూడా మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్:

ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ సినిమాలకి మైనస్ పాయింట్స్ పెద్దగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన లోని యూనిక్ మార్క్ ని తాను ఎప్పుడైతే పక్కన పెట్టేసాడో అప్పుడు నుంచే తాను తన సినిమాలకి మైనస్ గా మారాడు.

జస్ట్ ఏదో ఒక్క స్ట్రైకింగ్ లైన్ తప్ప దాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చి దిద్దడంతో వర్మ ఖాతాలో ఇది మరో ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. పరమ రొటీన్ ట్రీట్మెంట్ తో ఆకట్టుకోని విధంగా కనిపిస్తుంది.

ఇంకా చూసే ఆడియెన్స్ కి కాస్త వెగటుగా అనిపించే అంశం పూజా తో బికినిలో మార్షల్ ఆర్ట్స్ చేయించడం ఇది అయితే ఖచ్చితంగా వర్మ పైత్యానికి పరాకాష్ట అని చెప్పాలి. ఈ విజువల్స్ అన్నీ కూడా ఆడియెన్స్ కి కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. ఇంకా ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కావు అలాగే సి గ్రేడ్ నటులతో మళ్ళీ తన సినిమా కాస్టింగ్ తెలిసిందే..

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు అయితే పర్వాలేదని చెప్పాలి. ఇంకా టెక్నికల్ టీం లో రవి శంకర్ ఇచ్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇంకా రామి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ కూడా జస్ట్ ఓకే.

ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే.. రీసెంట్ గా తన నుంచి వస్తున్న సినిమాల్లో ఫలితానికి దీనికి పెద్ద తేడా లేదని చెప్పాలి. సేమ్ అదే ఫార్ములా ట్రీట్మెంట్ రొటీన్ కథా కథనాలతో తాను సినిమాని నడిపించేసాడు. యాక్షన్ బ్లాక్ లు ఎక్కడో కొన్ని ఎమోషన్స్ తప్ప ఇక సినిమాలో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఆర్జీవీ అమ్మాయి” లో పూజా నటన ఆమెపై యాక్షన్ బ్లాక్ లు తప్ప ఇంకా మిగతా ఏ అంశం కూడా ఆడియెన్స్ ని మెప్పించదు. రామ్ గోపాల్ వర్మ అదే పాత చింతకాయ పచ్చడి కథా కథనాలు వల్గారిటీతో నిరాశపరుస్తాడు. మరి ఈ వారాంతానికి అయితే ఈ సినిమాని స్కిప్ చేసెయ్యడమే బెటర్..

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు