విడుదల తేదీ : జులై 1, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: మాధవన్, సిమ్రాన్ బగ్గా, సూర్య శివకుమార్, కార్తీక్ కుమార్
దర్శకత్వం : మాధవన్
నిర్మాత: విజయ్ మూలన్
సంగీత దర్శకుడు: సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ: గోపీ అమర్నాథ్
ఎడిటర్: సతీష్ సూర్య
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాధవన్ నటించిన డ్రీం ప్రాజెక్ట్ “రాకెట్రి”. నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మాధవన్ ఎప్పుడో అనౌన్స్ చేసి ఆసక్తి రేపాడు. మరి ఎట్టకేలకు అయితే ఈ చిత్రం విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ:
ఇక కథ లోకి వస్తే..ఈ చిత్రం భారతదేశ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబియార్ నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. మరి ఈ పాత్రలో మాధవన్ నటించారు. అయితే నంబియార్ జీవితాన్ని రెండు భాగాలుగా చూపించిన ఈ చిత్రంలో శాస్త్రవేత్తగా తాను ఎలా ఎదిగారు? తాను ఇదిగాక భారతదేశ స్పేస్ రీసెర్చ్ సంస్థ నుంచి ఓ కీలక సమాచారాన్ని బయటకు లీక్ చేసారంటూ మోపిన అభియోగం నుంచి ఎలా చట్టబద్ధంగా తప్పించుకొని బయటకి వచ్చారు అనేది ఇతివృత్తం. మరి నిజ జీవిత ఉద్వేగభరిత కథను మాధవన్ అండ్ టీం ఎలా రక్తి కట్టించారో తెలియాలి అంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రం మొట్ట మొదటి బిగ్ ప్లస్ మాత్రం మాధవన్ అనే చెప్పాలి. ఒక నటునిగానే కాకుండా దర్శకునిగా కూడా ఈ సినిమా కోసం మారిన తాను కంప్లీట్ న్యాయం చేకూర్చారు. నటన పరంగా అయితే తాను చూపించిన షేడ్స్ గాని ఒకో దశలో వేరియేషన్స్ వీక్షకులను కట్టిపడేస్తాయి. అలాగే ఆ పాత్రలో చూపించే పెయిన్ ఇతర సున్నిత ఎమోషన్స్ ని మాధవన్ అద్భుతంగా చేసి ఆకట్టుకున్నారని చెప్పాలి.
ఇంకా నటనతో మెస్మరైజ్ చేసే మరో నటులు ఎవరన్నా ఉన్నారు అంటే అది సిమ్రాన్ అని చెప్పాలి. సిమ్రాన్ కి ఈ చిత్రంలో చాలా సాలిడ్ రోల్ దక్కింది. దానిని ఆమె అంతకు మించే న్యాయం చేకూర్చారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే సిమ్రాన్ నటనలో పొటెన్షియల్ కనిపిస్తుంది. ఇక లాస్ట్ బిగ్గెస్ట్ హైలైట్ మరోసారి క్యామియో లో కనిపించిన స్టార్ హీరో సూర్య సినిమాకి చాలా ప్లస్ అయ్యాడు.
చేసింది చిన్న పాత్రే అయినా తాను మాత్రం చాలా ప్రభావవంతంగా కనిపిస్తాడని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో వీరంతా ఒకెత్తు అయితే నిజమైన నంబి నారాయణన్ చిన్న పాత్రలో కనిపించడం షాకింగ్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది. పైగా దానిని తాను చాలా నీట్ గా చేసేసారు. ఇంకా ఈ చిత్రంలో పలు సన్నివేశాలు మంచి ఆసక్తిగా గ్రిప్పింగ్ నరేషన్ తో కనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్:
దాదాపు బయోపిక్ సినిమాలు అంటే ఆల్ మోస్ట్ హిట్ ఫార్ములా లోనే ఉంటాయి కాకపోతే నరేషన్ మాత్రం తేడాగా ఉంటే తప్ప సినిమా నుంచి అంత పక్కదారి ఆడియెన్స్ పట్టరు. అలాగే ఈ సినిమాలో అక్కడక్కడా కథనం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ చిత్రం అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని చూస్తే చాలా మందికి కనెక్ట్ కాకపోవచ్చు. ఇది బయో పిక్ కాబట్టి కాస్త కాంప్రమైజ్ అయ్యి సినిమాకి వెళ్తే అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
సాంకేతిక విభాగం:
చాలా వరకు బయోపిక్ సినిమాల్లో నిర్మాణ విలువలు కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి కాబట్టి కాస్త ఎక్కువే ఉంటాయి. కానీ ఈ సినిమా మరింత ఖర్చుతో కూడుకున్నది. దానిని నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా తీసి చూపించారు. అలాగే స్పేస్, సైంటిస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో టెక్నీకల్ టీం కూడా మంచి వర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. దానిని సాలిడ్ విజువల్స్ మరియు మరియు సంగీతంతో శిరీష రే మరియు సామ్ సి ఎస్ లు అందించారు. అలాగే తెలుగు డబ్బింగ్, డీటెయిల్స్ కూడా బాగున్నాయి.
ఇక మాధవన్ డైరెక్షన్ విషయానికి వస్తే.. తాను మాత్రం సినిమాలో మెయిన్ లీడ్ గానే కాకుండా దర్శకునిగా కూడా సాలిడ్ వర్క్ ని అందించారు అని చెప్పాలి. చాలా వరకు నరేషన్ ని మంచి గ్రిప్పింగ్ గా చూపించి సక్సెస్ అయ్యారు. కాకపోతే అక్కడక్కడా కాస్త స్లో అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా మాత్రం తన వర్క్ ఆకట్టుకుంటుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రాకెట్రి – ది నంబియార్ ఎఫెక్ట్” లో మేకర్స్ తాలూకా హానెస్ట్ అటెంప్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా మాధవన్, సిమ్రాన్ సహా సూర్య మరియు నంబియార్ ల పెర్ఫవుమెన్స్ లు సినిమాలో మంచి హైలైట్స్ కాగా వీటితో పాటుగా మాధవన్ డైరెక్షన్ లోని సిన్సియారిటీ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా స్లో నరేషన్ మినహాయిస్తే ఈ చిత్రాన్ని ఈ వారాంతానికి డెఫినెట్ గా చూడొచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team