సమీక్ష : శాకిని డాకిని – థ్రిల్ చేయలేకపోయిన క్రైమ్ డ్రామా !

SaakiniDaakini Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రెజీనా కసాండ్రా, నివేదా థామస్

దర్శకత్వం : సుధీర్ వర్మ

నిర్మాతలు: డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామస్ కిమ్

సంగీత దర్శకుడు: మైకీ మెక్‌క్లియరీ

సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్

ఎడిటర్: విప్లవ్ నిషాదం

నివేదా థామస్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘శాకిని డాకిని’. కాగా ఈ చిత్రం నేడు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

శాలిని (నివేతా థామస్) మరియు డామిని (రెజీనా) పోలీస్‌ ట్రైనింగ్ కోసం పోలీస్ అకాడమీకి వస్తారు. ఇద్దరి మధ్య ఇగో సమస్య వస్తోంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఔటింగ్‌ కి బయటకు వస్తారు. అయితే, అక్కడ అనుకోకుండా ఓ అమ్మాయి కిడ్నాప్ అవ్వడం చూస్తారు. ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి శాలిని – డామిని ఏం చేశారు ?, అసలు ఈ కిడ్నాప్‌ వెనుక ఉంది ఎవరు ?, చివరకి శాలిని డామిని ఆ అమ్మాయిని ఎలా సేవ్ చేశారు? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అంటే.. ఈ కథలోని మెయిన్ పాయింట్, అలాగే ఈ కథ జరిగిన నేపథ్యమే. దర్శకుడు సుధీర్ వర్మ రాసుకున్న సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు కొన్నో చోట్ల బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే ప్రధానంగా ఇద్దరు అమ్మాయిల మధ్య వచ్చే ఇగో సీన్స్ కూడా సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది.

రెజీనా తన పాత్రలో చాలా బాగా నటించింది. అలాగే నివేదా కూడా కొన్ని ఎక్స్ ప్రేషన్స్ ను చక్కగా పలికించింది. ఇద్దరూ తమ టైమింగ్ తో బాగా అలరించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అన్నిటికీ మించి రెజీనా – నివేదా నటన చాలా సహజంగా ఉంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ శాకిని డాకిని కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ పరంగా పర్వాలేదు అనిపించినా, దర్శకుడు సుధీర్ వర్మ కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. పాత్రలు పరిచయానికి సమయం తీసుకున్నారనుకున్నా.. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అయినా ఓ కిడ్నాప్ చుట్టూ కథను నడుపుతూ కూడా దర్శకుడు కథలో ఎక్కడ టర్నింగ్ పాయింట్లు కూడా లేకుండా.. చివరి వరకూ సింగిల్ ప్లాట్ తోనే ప్లేను చాలా బోరింగ్ గా నడపడంతో సినిమా ఎవరికీ కనెక్ట్ కాదు.

దీనికి తోడు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో ఎలాంటి బలమైన సంఘర్షణ లేకుండా చాలా నిస్సహాయతతోటి సాగుతాయి. అసలు ఆ పాత్రల తాలూకు బాధ, ఆలోచనా విధానం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే, జరుగుతున్న కథలో ప్రేక్షకుడు ఎలా ఇన్వాల్వ్ అవుతాడు ? అందుకే ఈ శాకిని డాకినిలో ఏ ఎలిమెంట్ కి ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ కాలేదు.

పైగా ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకపోవడం కూడా ఈ శాకిని డాకిని ఫలితాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా అసలు మెప్పించదు. అదేవిధంగా చాలా సీన్స్ అస్సలు లాజిక్ లేకుండా సాగుతాయి. ప్రధానంగా సెకెండ్ హాఫ్ బాగా బోర్ గా సాగింది.

 

సాంకేతిక విభాగం :

 

సుధీర్ వర్మ దర్శకుడిగా కూడా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేదు. అలాగే రచయితగా కూడా ఆయన ఏ మాత్రం తన కథనంతో ఆకట్టుకోలేదు. సినిమా స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాతలు నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

 

శాకిని డాకిని అంటూ విభిన్న కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. డిఫరెంట్ సినిమాగా కొన్ని అంశాల్లో ఆకట్టుకున్నా.. స్లో నేరేషన్, సినిమాలో బోరింగ్ ట్రీట్మెంట్ ఎక్కువవడం, బలమైన కాన్ ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. దాంతో ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version