సమీక్ష : “సామాన్యుడు” – స్లోగా సాగే యాక్షన్ డ్రామా

సమీక్ష : “సామాన్యుడు” – స్లోగా సాగే యాక్షన్ డ్రామా

Published on Feb 5, 2022 3:03 AM IST
Saamanyudu Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 04, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి

దర్శకత్వం : తు ప శరవణన్

నిర్మాత: విశాల్

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజా

ఎడిటర్ : ఎన్ బి శ్రీకాంత్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ సినిమా “సామాన్యుడు”. యాక్షన్ హీరో విశాల్ హీరోగా డింపుల్ హయాతి హీరోయిన్ గా తమిళ దర్శకుడు శరవణన్ తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ తో బాగానే ఆకట్టుకుంది. మరి ఈ సినిమా థియేటర్స్ లో ఎంత వరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథ లోకి వెళ్లినట్టయితే పోరస్(విశాల్) తన చిన్నప్పటి నుంచి ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. అయితే తన తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ కాగా తాను కూడా పోలీస్ అవ్వాలని కోరుకుంటాడు అయితే తన తండ్రి, బాగా డబ్బు, పలుకుబడి ఉన్న వారు వారు చేసే అధికార దుర్వినియోగం ఆ సమయంలో తన తండ్రి కూడా ఏమీ చెయ్యలేనితనం ఇవన్నీ పోరస్ చూస్తాడు. మరి ఈ క్రమంలో కొన్ని ఊహించని పరిణామాల తో తన చెల్లెలు ద్వారకా ని విశాల్ పోగొట్టుకుంటాడు. అయితే తర్వాత ఆమె మరణంకి కారణం వేరే ఉందని తెలుసుకుంటాడు. మరి దానికి కారణం ఎవరు? ఈ క్రమంలో సినిమాలో కనిపించే పొలిటికల్ టర్న్స్ ఏమిటి? ఈ పోరస్ కుటుంబానికి, ఆ పొలిటికల్ వ్యక్తులకి ఏమన్నా సంబంధం ఉందా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఇటీవల కాలంలో విశాల్ ఎప్పటికప్పుడు కాస్త కొత్త సబ్జెక్టు లతోనే ఆడియెన్స్ కి ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా అలాంటి కాస్త కొత్త సబ్జెక్టు లానే అనిపిస్తుంది. అలాగే తన సినిమాల్లో ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్ తనకి తగ్గట్టుగా కనిపించే చాలా సహజమైన టేకింగ్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. అలాగే విశాల్ తన పాత్రలో చాలా కరెక్ట్ గా సెట్టయ్యాడని చెప్పాలి.

చాలా కామన్ మ్యాన్ గా సింపుల్ గా కనిపిస్తూ మంచి ఎమోషన్స్ ని తాను కనబరిచాడు. అలాగే డింపుల్ హయాతి కూడా ఈ సినిమాకి తన వల్ల అయ్యిన బెస్ట్ ని ఇచ్చింది. ఇంకా కమెడియన్ యోగిబాబు రోల్ సినిమాలో కాసిన్ని నవ్వులు పూయిస్తుంది. అలాగే విశాల్ కి సోదరి పాత్రలో నటించిన రవీనా కూస్తో మంచి నటనను కనబరిచింది. అలాగే యువన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో మంచి ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి అని చెప్పాలి. ఈ సినిమాని చాలా పెద్దదిగా ప్లాన్ చేశారు. సరే అలా చేసినా అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే నడుస్తుందా అంటే అది కూడా ఉండదు.

చాలా స్లో గా అక్కడక్కడా సాగదీతగా అనిపించడం సినిమా చూసే ఆడియెన్స్ కి కాస్త చికాకు తెప్పించవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు ఎక్కువే కనిపిస్తాయి. అలాగే మరి కొన్ని సన్నివేశాలు అయితే ఇంకా నీట్ గా బెటర్ గా ఎలివేట్ చేసే స్కోప్ ఉన్నా వాటిని ఆ రకంగా చూపే ప్రయత్నం కనిపించలేదు.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా చాలా నీట్ గా నాచురల్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగే టెక్నికల్ టీం విషయానికి వస్తే మొదట చెప్పినట్టుగా విశాల్ కి యువన్ ఎప్పుడు మంచి న్యాయం చేకూరుస్తాడు అలానే ఈ సినిమాకి కూడా మంచి వర్క్ ని అందించాడు. అలాగే కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ మంచి విజువల్స్ తో బావుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

ఇక దర్శకుడు థు పా శరవణన్ విషయానికి వస్తే తాను తనకిది మొదటి సినిమానే అయినా తన వల్ల అయ్యిన ఎఫర్ట్స్ బాగా పెట్టాడని చెప్పాలి. అందరికీ కనెక్ట్ అయ్యే మంచి నేపథ్యంలో అందులో డ్రామా యాడ్ చేసి తన సినిమాని బాగానే ప్లాన్ చేసాడు. కానీ సినిమాని సీన్ టు సీన్ తీసుకెళ్లే క్రమంలో తాను స్క్రీన్ ప్లే మరింత ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాల్సింది. చాలా వరకు తాను డ్రాగ్ చేసేసాడు. దీనివల్ల ఆడియెన్స్ కి ఆసక్తి లోపిస్తుంది. ఇది తప్పితే తన దర్శకత్వంలో వంక పెట్టడానికి ఏమీ లేదని చెప్పాలి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే విశాల్ “సామాన్యుడు” లో కనిపించే అందరికీ కనెక్ట్ అయ్యే బేసిక్ ఎలిమెంట్ బాగుంటుంది. అలాగే విశాల్ నటన కానీ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సహా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. కానీ చాలా వరకు సినిమా ని సాగదీతగా తీసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఎడిటర్ తో కూర్చొని ఇంకొన్ని సీన్స్ తీసేసి నిడివి తగ్గించి మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చూపించి ఉంటే డెఫినెట్ గా మరింత మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఇది తప్ప మిగతా సినిమా అంతా పర్వాలేదు అనిపిస్తుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

 

Click Here English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు