లాక్ డౌన్ రివ్యూ : సడక్ 2 హిందీ చిత్రం (డిస్నీ – హాట్ స్టార్ లో)

Published on Aug 29, 2020 12:05 pm IST
Sadak 2 Movie Review

Release date : August 28th, 2020

123telugu.com Rating : 2/5

నటీనటులు : సంజయ్ దత్, పూజ భట్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్

దర్శకుడు : మహేష్ భట్

నిర్మాత : ముఖేష్ భట్

సంగీతం : జీట్ గంగూలీ, అంకిత్ తివారీ

ఛాయాగ్రహణం : జే.ఎల్. పటేల్

ఎడిటర్ : సందీప్ కురుప్

 

 

 

లాక్ డౌన్ సమయం లో చలచిత్రాలను మరియు ప్రదర్శనల రివ్యూ లను కొనసాగిస్తూ, మా నేటి ఎంపిక హిందీ చిత్రం సడక్ 2. ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటు లో ఉంది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం రండి.

 

కథ:

ఈ చిత్రం మహేష్ భట్ యొక్క సడక్ చిత్రానికి సీక్వెల్ అని చెప్పబడినది. కానీ అది ఒక్క సంజయ్ దత్ పాత్ర మాత్రమే, ఆ చిత్రం నుండి కొనసాగుతుంది. కథ లోకి వెళ్తే, క్యాబ్ డ్రైవర్ అయిన రవి( సంజయ్ దత్) తన భార్య పూజ (పూజ భట్) మరణంతో చాలా కలత చెందుతాడు. అతను తన జీవితాన్ని మళ్లీ యధాస్థితికి తీసుకొని వచ్చేలా ప్రయత్నిస్తాడు. అలాంటి ఒక సందర్భం లో ఆర్య (అలియా భట్) అనే అమ్మాయి అతని తలుపు తట్టి బుకింగ్ ను పూర్తి చేసి తన గమ్యాన్ని చేరుకోవడానికి సంజయ్ ను అడుగుతుంది. అయితే మొదట రవి నో అని చెప్తాడు కానీ, ఆ తర్వాత ఆర్య తో ప్రయాణం కొనసాగిస్తాడు. మరోవైపు ఆర్య తండ్రి (జిషు సేన్ గుప్తా) పై నియంత్రణ సాధించిన గురూజీ (మార్కంద్ దేశ్ పాండే) పై తన సొంత కారణం తో పోరాడుతుంది. ఆమె తన ప్రియుడు విశాల్ (ఆదిత్య రాయ్ కపూర్) తో కలిసి నకిలీ బాబాను తీసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది. అయితే వీరికి తమ మిషన్ ను పూర్తి చేయడానికి రవి ఎలా సహాయం చేస్తారు అనేది ఈ చిత్రం మొత్తం కథ.

 

ప్లస్ పాయింట్స్:

చాలా విరామం తర్వాత మహేష్ భట్ మళ్లీ తన దర్శకత్వం లో ఒక సినిమా ను చేశారు, ప్రతి చిత్రంలో లాగానే ఈ చిత్రం లో అతను తన నటి నటుల నుండి అద్భుతమైన నటనను రాబట్ట గలిగాడు. సంజయ్ దత్ నటన ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పాలి. భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. ఈ చిత్రం లో సంజయ్ నటన మరియు తాను పోషించిన పాత్ర సినిమా ను ఒక లెవల్ కి తీసుకు పోతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో సంజయ్ నటన అద్భుతంగా ఉంటుంది.

అలియా భట్ పాత్రకి తగ్గట్టు గా చాలా చక్కగా నటించింది అని చెప్పాలి. సంజయ్ దత్ తో చేసిన సన్నివేశాలు అన్ని కూడా చాలా బావున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాల్లో అలియా బాగా నటించారు. జీషు సేన్ గుప్తా ఈ చిత్రం లో ముఖ్య పాత్రను పోషించారు. అద్భుత నటనతో అలరించారు. హత్య సన్నివేశం లో తన నటన అద్భుతం అని చెప్పాలి.

గుల్షన్ గ్రోవర్ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తాడు మరియు మార్కంద్ దేష్ పాండే నకిలీ బాబా అవతారం లో చాలా చక్కగా నటించారు ఇంకా ఎక్కువ అవకాశం రాలేదు. అయితే మద్య లో మరియు క్లైమాక్స్ లో ట్విస్టు లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రం లో డైలాగ్స్ చాలా అద్బుతం గా ఉన్నాయి సినిమా లో చాలా ప్రభావం ను చూపిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

సడక్ 2 చిత్రం లో ఎమోషనల్ కోణం అనేది లేకపోవడం అతిపెద్ద లోపం. సంజయ్ దత్ తన మాజీ భార్య తో ఉన్న బంధం కాకుండా, గట్టిగా మంచి భావోద్వేగాలను కలిగివున్న సీన్ ఒక్కటి కూడా లేదు. ఆదిత్య రాయ్ కపూర్ తన పాత్రలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఒక్కసారి ఆ ట్విస్ట్ బయటపడిన తర్వాత అతని పాత్ర అంతగా అనిపించదు.

ఈ చిత్ర కథ యుగయుగాల ది. సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న క్క గాడ్ మైనారిటీ దాని వెనుక ఒక ప్రముఖ వ్యాపార వేత్త, ఇది కొత్త కోణం లో చూపబడింది కానీ, వీటి అన్నింటిలో కొత్తదనం ఏమి లేదు.

ఈ చిత్రం లో మరొక పెద్ద లోపం ఏమిటి అంటే, మొదటి నలభై అయిదు నిమిషాలు టాస్ కోసం ఉంటుంది, అక్కడ కథ లేదు, చూపించిన తీరు కూడా చాలా బోరింగ్, పాతది గా, జీవం లేనట్లు గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి.

 

సాంకేతిక కోణాలు:

ఈ సినిమా చూసిన తర్వాత, మహేష్ భట్ ఒక దశాబ్దం క్రితం వదిలిపెట్టిన చోట ఇరుక్కుపోయాడు అని అర్థం చేసుకోవచ్చు. అతని పాత్రలు బలంగా ఉన్నాయి, వారి ఉద్దేశ్యం కూడా మంచిది. కానీ నేడు ఫిల్మ్ మేకింగ్ మరియు స్క్రీన్ ప్లే మారిపోయి. సడక్2 లో పేస్ పూర్తిగా లేదు అని చెప్పాలి. భట్ చిత్రాలలో సూపర్ స్ట్రాంగ్ గా ఉండే ఎమోషన్స్ ఇక్కడ లేవు. కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సడక్ చిత్రం లో సంగీతం అద్బుతం గా ఉంటుంది. కానీ సీక్వెల్ లోకి సంగీతం నిరాశ పరిచింది. మూడు పాటలను తీసివేయడం వలన ఎడిటింగ్ ఎంత దయనీయం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తుది తీర్పు:

మొత్తంమీద సడక్ 2 నిస్తేజం గా, నిత్యకృత్యం గా మరియు బోరింగ్ గా ఉంది. ఇది సడక్ సీక్వెల్ గా వచ్చినా, కొత్తదనం ఏమీ లేదు. మహేష్ భట్ తిరిగి దర్శకత్వం చేయడం, ఈ చిత్రం లో ఎమోషనల్ గా కనెక్టివిటీ లేకపోవడం తి కథనం మందగించింది. మొదటి సగం చాలా నెమ్మదిగా బోరింగ్ గా ఉంటుంది, ఒకానొక సందర్భంలో మిమ్మల్ని చిరాకు పెడుతుంది. రెండవ భాగం లో కథ ప్రారంభం అవుతుంది. రెండో భాగం లో మంచి సన్నివేశాలు ఉన్నాయి. సంజయ్ దత్ నటనతో పాటుగా, ఈ చిత్రానికి చూడటానికి అంత ఆసక్తి కారంగా ఏమి లేదు అని చెప్పాలి. సంజయ్ దత్ ను చూడాలి అనుకొనే వాళ్ళు మాత్రం ఒకసారి ఈ చిత్రం చూడవచ్చు. కాబట్టి ఛాయిస్ మీదే.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :