ఓటిటి రివ్యూ : సమంతా “ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ – ప్రైమ్ వీడియోలో

ఓటిటి రివ్యూ : సమంతా “ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ – ప్రైమ్ వీడియోలో

Published on Jun 5, 2021 4:00 AM IST
The-Family-Man-2 Movie Review

విడుదల తేదీ : జూన్ 04,2021
123telugu.com Rating : 3.5/5

నటీనటులు: మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి, షరీబ్ హష్మి, నీరజ్ మాధవ్, శరద్ కేల్కర్, సందీప్ కిషన్
దర్శకులు : రాజ్ & డి.కె
నిర్మాత: రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డి.కె.
సంగీతం : సచిన్-జిగర్
సినిమాటోగ్రఫీ : కామెరాన్ ఎరిక్ బ్రైసన్
ఎడిటింగ్ : సుమీత్ కోటియా

మొత్తం ఇండియన్ ఓటిటి వీక్షకులు అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్” సీజన్ 2 ఎట్టకేలకు ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. స్టార్ హీరోయిన్ సమంతా నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక ఈ సీజన్ స్టోరీ లైన్ కి వెళ్లినట్టు అయితే శ్రీలంక ప్రభుత్వం, భారత ప్రభుత్వాల మధ్య ఎల్టిటిఈ చీఫ్ భాస్కరన్(మైమ్ గోపి) ను పట్టుకోడానికి సాయాన్ని కోరుతుంది అలాగే మరో పక్క ఓ బలమైన కారణం చేత శ్రీకాంత్ తివారీ(మనోజ్ బాజ్ పై) తన అండర్ కవర్ జాబ్ ను ఒక బలమైన కారణం చేత వదిలేసి ఓ ఐటీ జాబ్ చేస్తూ సాదా సీదా జీవనం రీస్టార్ట్ చేస్తాడు. మరి మరోపక్క యూకే లో దాక్కున్న భాస్కరన్ ప్లాన్ చేసిన భారీ అటాక్ కోసం తమ దగ్గర అన్ని రకాలుగా సాలిడ్ ట్రైనింగ్ తీసుకున్న రాజీ(సమంతా అక్కినేని)ని సోల్జర్ ని రంగంలోకి దింపుతారు. దీనితో ఈ సెన్సేషనల్ మిషన్ ను ఆపడానికి మళ్ళీ శ్రీకాంత్ వెనక్కి వస్తాడా? రాజీని ఎలా అడ్డుకుంటాడు? తాను మొదట ఆ జాబ్ ని వదిలేయడానికి కారణం ఏంటి అన్నది తెలియాలి అంటే ఈ సిరీస్ ను ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొదటి నుంచి ఈ సిరీస్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఈ సీజన్లో ప్రతి ఎపిసోడ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత సీజన్లో ఎలా అయితే ప్రతి ఎపిసోడ్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందో ఈసారి కూడా అంతకు మించిన ఇంటెన్సిటీ మరియు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో కనిపిస్తుంది. ఇక అలాగే ఈ సిరీస్ లో మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సమంతానే ఇందులో ఎలాంటి సందేహం లేదు.

తన రోల్ ఎంటర్ అయ్యిన దగ్గర నుంచి సామ్ ఈ సిరీస్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొట్ట మొదటి సారి ఓటిటిలో అందులోని ఇలాంటి ఒక సాలిడ్ రోల్ తీసుకొని ఛాలెంజింగ్ గా చేసి బ్లాస్టింగ్ ట్రీట్ ఇచ్చింది. పూర్తిగా డీ గ్లామ్ లుక్ లో కనిపించి అద్భుతమైన నటన మాత్రమే కనబర్చడం కాకుండా తనపై డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. అలాగే తన ఎమోషన్స్ కూడా హై లెవెల్లో ఉంటాయి.. ఒక్క మాటలో అయితే సామ్ ఉందని ఈ సిరీస్ చూసే వాళ్ళని మాత్రం సామ్ ఎక్కడా తగ్గనివ్వదు..

ఇక మరో విలక్షణ నటుడు మనోజ్ మరోసారి తన పెర్ఫామెన్స్ స్పెయిల్ అట్రాక్షన్ గా నిలిచారు. గత సీజన్లో లానే తనదైన ఈజ్ నటన యాక్షన్ మరియు సాలిడ్ ఎమోషన్స్ తో ఈ సిరీస్ ను కూడా రక్తి కట్టించారు. అలాగే మొదటి సీజన్ నుంచి ఉన్న శరీబ్ హష్మీ సహా ప్రియమణి తదితరులు తమ రోల్స్ కి కంప్లీట్ జస్టిస్ చేశారు. ఇక వీరి పెర్ఫామెన్స్ లతో పాటుగా ప్రతీ ఎపిసోడ్ లో ఎండింగ్, గ్రిప్పింగ్ నరేషన్ ఈ సిరీస్ ఫ్యాన్స్ ని మంచి ఫీస్ట్ ను అందిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

అయితే ప్రత్యేకంగా సామ్ కోసం మాత్రమే ఈ సిరీస్ ని చూసే వారికి మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త ఎగ్జైట్మెంట్ ని తగ్గిస్తాయి. మూడో ఎపిసోడ్ వరకు తన ఎంట్రీ ఉండదు కనుక వారికి అది డ్రా బ్యాక్ గా అనిపించొచ్చు. అలాగే సామ్ రోల్ పై అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ కాస్త ఊహించిన విధం గానే అనిపిస్తాయి. మరి ఇవి కాకుండా గత సీజన్ తో పోలిస్తే శ్రీకాంత్ ఫ్యామిలీ డ్రామాకి అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించదు. ఇవి మినహా మిగతా సిరీస్ అంతా అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది.

సాంకేతిక వర్గం :

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు సూపర్బ్ గా ఉన్నాయని చెప్పాలి. గత సీజన్లో ఎలా అయితే ప్రతి ఫ్రేమ్ లో ఉన్నతమైన మరియు సహజంగా అనిపించే నిర్మాణ విలువలు ఉంటాయో ఇందులో కూడా కనిపిస్తాయి అలాగే కెమెరా వర్క్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సింపుల్ గా మరో లెవెల్లో అనిపిస్తాయి. అలాగే యాక్షన్ స్టంట్స్ వాటిపై డిజైన్ చేసిన ప్రతి ఎపిసోడ్ యాక్షన్ లవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే సామ్ కి చేసిన మేకప్ టీం కి కూడా స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి.

ఇక డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ల విషయానికి వస్తే.. ఫస్ట్ సీజన్ సెట్ చేసిన ఇంపాక్ట్ కి రెండో సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి వాటిని తమ బ్రిలియెంట్ రైటింగ్ తో ఎండ్ చేసారని చెప్పాలి. మొదటి సీజన్ కి కంక్లూజన్ చూపించిన విధానం కూడా బాగుంది. అలాగే దాని తర్వాత నుంచి సెటప్ చేసిన కొత్త మిషన్ అంతా లాజికల్ గా సెట్టయ్యి ఇంప్రెస్ చేస్తాయి. అలాగే సామ్ నుంచి వారు రాబట్టిన పెర్ఫామెన్స్ అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తంగా మాత్రం వీరి వర్క్ ఆడియెన్స్ ను ఎక్కడా నిరాశపరచదు.

తీర్పు :

ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయతే “ఫ్యామిలీ మ్యాన్ 2” కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సిరీస్ అభిమానులు అంచనాలు సామ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్, మనోజ్ భాజ్ పై రోల్ కానీ ముఖ్యంగా డైరెక్టర్స్ బ్రిలియెంట్ టేకింగ్ గాని అసలు ఎక్కడా తగ్గనివ్వకుండా అందరి అంచనాలు రీచ్ అయ్యి అంతకు మించే ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాయి. జస్ట్ కొన్ని డ్రా బ్యాక్స్ మినహా ఈ సమయంలో ఈ సిరీస్ ఓటిటి వీక్షకులకు తప్పకుండా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు