విడుదల తేదీ : ఆగష్టు 31, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : యశ్వంత్, అమ్రితా ఆచార్య , గెటప్ శ్రీను
దర్శకత్వం : రవి గుండబోయిన
నిర్మాత : అనితా దేవేందర్ రెడ్డి
సంగీతం : వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫర్ : మధుసూదన్ కోట
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి
నూతన దర్శకుడు రవి గుండబోయిన తెరకెక్కించిన చిత్రం ‘సమీరమ్’. ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన సమీర ( అమ్రితా ఆచార్య) ఉద్యోగం చేస్తూ తనకు కాబోయే భర్త తో ఆనందం గా ఉండాలనుకొని లైఫ్ ను ఎంజాయ్ చేయకుండా తన సంపాదనను పెంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో సమీర అనారోగ్య సమస్యలతో డాక్టర్ దగ్గరకు వెళుతుంది. రిపోర్ట్స్ చూసి ఆమెకు సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధి ఉందని ఎక్కువకాలం బ్రతుకకపోవచ్చు అని చెప్పడంతో షాక్ కు గురై మిగితా లైఫ్ ను ఎంజాయ్ చేయడం కోసం థాయిలాండ్ వెళుతుంది. అక్కడ డ్రైవర్ గా హీరో రామ్ ( యశ్వంత్ ) పరిచయం అవుతాడు. ఈ అపరిచయం కాస్త ప్రేమ గా మారుతుంది. ఇక రామ్ అప్పటికే వేరే అమ్మాయిని ప్రేమిస్తాడు. దాంతో సమీరను ఇష్టపడడు. ఇక ఆతరువాత ఏమైంది సమీర , రామ్ లు ఒక్కటయిరా అసలు సమీర బ్రతుకుందా అనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమా కథంతా హీరోయిన్ చుట్టూ తిరిగేది కావడంతో అమ్రితా ఆచార్య కు మంచి పాత్రే దొరికింది. ఇక ఆ పాత్రలో ఆమె బాగా నటించింది. ఇదే మొదటి సినిమా అయినా అనుభవం వున్న నటి లా ఎమోషన్స్ చక్కగా పండించింది. ఇక రామ్ పాత్రలో యశ్వంత్ సరిగ్గా సరిపోయాడు సవాల్ తో కూడుకున్న పాత్ర కాకపోయినా పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక జబర్దస్త్ ఫెమ్ గెటప్ శ్రీను కు ఎక్కువ సమయం స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం ఈసినిమాతో లభించింది. ఆయన పాత్ర అక్కడక్కడా నవ్వు తెప్పించింది. ఇక రవి గుండబోయిన కథలో ఏం కొత్తదనం లేకపోయిన రొమాన్స్ ను బాగా డీల్ చేశాడు.
మైనస్ పాయింట్స్ :
కథ అంత కొత్తది కాకపోవడంతో దర్శకుడు తన వచ్చి న అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన సెకండ్ హాఫ్ లో పట్టు తప్పాడు. సినిమా అంత ఊహాజనితంగా ఉండడంతో ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించక పోగా నీరసం తెప్పిస్తుంది. ఇక కొన్ని సన్నివేశాలు మరి సినిమాటిక్ గా అనిపిస్తాయి. సినెమాలో ఎమోషన్స్, రొమాన్స్ తప్పించి వేరే అంశాలు వుండవు. ముఖ్యంగా గెటప్ శ్రీను కు ఎక్కువ టైం సినిమాలో వున్నా ఛాన్స్ దొరికిన ఆయన దగ్గరనుండి పూర్తి స్థాయి వినోదాన్ని ఆశించలేం. ఇక సినిమాకు పాటలు కూడా మైనస్ అని చెప్పొచ్చు ఒక్క పాట కూడా గుర్తిండిపోదు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా దాన్ని ఆసక్తిగా చూపించలేకపోయాడు. కథ కు దగ్గ వేగం తో అన్ని కమర్షియల్ అంశాలను జోడిస్తే మరో స్థాయిలో ఉండేదే. ఇక సినిమా కు సంగీతం అందించిన వినోద్ యాజమాన్య అందించిన పాటలు ఏమాత్రం గుర్తిండిపోవు. మధుసూదన్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది. బొంతల నాగేశ్వర్ రెడ్డి చాలా తక్కువ రన్ టైం ఉండేలా జాగ్రత్త పడ్డ ఇంకా కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేస్తే బాగుండేది. అనితా దేవేందర్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథతో వచ్చిన ఈచిత్రం ఎమోషన్స్ , రొమాన్స్ తప్ప వేరే విషయంలో ఆకట్టుకోదు. ఊహాజనితంగా సినిమా సాగడం, బోరింగ్ స్క్రీన్ ప్లే చిత్రానికి మైనస్ గా చెప్పొచ్చు. చివరగా రొటీన్ కథతో పెద్దగా ట్విస్టులు ఏమిలేకుండావచ్చిన ఈచిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించదు.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team