విడుదల తేదీ : జూలై 20,2021
123telugu.com Rating : 3/5
నటీనటులు : ఆర్య, సంచన నటరాజన్, అనుపమ కుమార్, సంతోష్, దుషర తదితరులు
దర్శకుడు : పా రంజిత్
నిర్మాతలు : షణ్ముగం దక్షణ్ రాజ్
సంగీత దర్శకుడు : సంతోష్ నారాయణ్
ఎడిటర్ : సెల్వ ఆర్‌కె
ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ సిరీస్‌లు మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో తాజాగా మేము ఎంచుకున్న చిత్రం “సార్పట్ట” తమిళ నటుడు ఆర్య హీరోగా చేసిన ఈ తెలుగు డబ్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతోంది.. మరి ఇది ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
కథ:
ఓ సాధారణ కూలీగా పని చేసుకునే సమరా(ఆర్య) అనుకోకుండా ఒకరోజు బాక్సింగ్ చేసేందుకు సిద్దమవుతాడు. అయితే బాక్సర్‌గా సమరా తనను తాను నిరూపించుకునే సమయంలో కథ మొత్తం ఒక్కసారిగా అడ్డం తిరుగుతుంది. అప్పటినుంచి సమరా చెప్పుడు మాటలు విని తాగుడికి బానిసై చివరకు బాక్సింగ్ చేయలేని స్థితికి చేరుకుంటాడు. ఈ నేపధ్యంలో తన తప్పు తెలుసుకున్న సమరా తిరిగి ఎలా బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టాడు? సమరా బాక్సింగ్ కెరిర్‌కి ముందు, తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే పూర్తి కథాంశం.
ప్లస్ పాయింట్స్:
ప్రధాన తారగణం సార్పట్ట పరంపరకు పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఆర్య బాక్సర్ పాత్రలో చాలా బాగా నటించాడు. మిగిలిన తారాగణం కూడా అతనికి మంచి మద్ధతు అందించారు. దుషారా విజయన్, పసుపతి, సంచన నటరాజన్, జాన్ కొక్కెన్ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు.
ఇది కాకుండా బాక్సింగ్ ఎపిసోడ్లను చాలా బాగా చూపించారు. పోరాట సన్నివేశాలు, భావోద్వేగమైన అంశాలు కూడా ఆకట్టుకున్నాయి. బాక్సింగ్ ప్రధాన కథాంశంగా పెట్టుకుని తెర్కక్కించిన ఈ సినిమాలో అది ఎక్కడ మిస్ కాకుండా అమలయ్యింది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం నిడివి సినిమాకు పెద్ద మైనస్ అయ్యిందని చెప్పాలి. దాదాపు 174 నిమిషాలు రన్‌టైంను కలిగి ఉంది. అయితే కాస్త రన్‌టైంను తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది. అయితే కొన్ని సీన్లను పదే పదే చూపించడంతోనే రన్‌టైం పెరిగి ఉండొచ్చు. దర్శకుడు దీనిపై కాస్త దృష్టి పెట్టాల్సింది.
ఇకపోతే ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్ ట్రాక్ బాగుంది కానీ అదే ఎమోషన్ ట్రాక్స్ పదే పదే హైలెట్ అవ్వడం కూడా ఒక డ్రా బ్యాక్ అని చెప్పాలి. అయితే కేవలం బాక్సింగ్ ఆట పైనే ఫోకస్ చేశారు కానీ కొన్ని కొన్ని అంశాలకు వివరణ ఇవ్వకుండానే రన్ అవుతున్న కథనానికి మళ్లీ కనెక్ట్ చేశారు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు పా. రంజిత్‌కు వాస్తవిక సామాజిక నాటకాలను చక్కగా వివరించే నైపుణ్యం కలిగినవాడు. అయితే సార్పట్ట ద్వారా కూడా తన మార్క్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. అప్పట్లో భారత ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ బాక్సింగ్‌పై ఎలా ప్రభావం చూపిందన్న దానిని వివరించాడు. అయితే రన్‌టైంను తగ్గించుకుని మంచి స్క్రీన్‌ప్లేతో వచ్చి ఉంటే ఈ సినిమా మరింత ఆకట్టుకునేది. సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా అగ్రస్థానంలో ఉందని చెప్పాలి.
తీర్పు:
బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన “సార్పట్ట” చిత్రం మొదట మంచి ఇంట్రెస్టీంగ్‌ని కనబరించింది. అయితే మధ్యలో వచ్చేసరికి ప్రధాన తారగణం మధ్య ఎమోషన్ సీన్స్ రిపీట్ అవుతుండడం తగ్గించి, ప్రీ క్లైమాక్స్‌ని ఇంకొంచెం కొత్తగా చూపించి ఉంటే బెటర్‌గా అనిపించేది. ఏదేమైనా స్పోర్ట్స్ డ్రామాలను కోరుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పాలి. ఇక మామూలు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఒకసారి చూసేయవచ్చు.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team