సమీక్ష : శశి – స్లోగా సాగే ఎమోషనల్ లవ్ డ్రామా !

Sashi movie review

విడుదల తేదీ: మార్చి 19, 2021

123telugu.com Rating : 2.5/5

నటీనటులు : ఆది , సురభి పురాణిక్

దర్శకత్వం : శ్రీనివాస్ నాయుడు నడికట్ల

డి ఓ పి : అమర్నాధ్ బొమ్మిరెడ్డి

స్క్రీన్ ప్లే : మని కుమార్ చినిమిల్లి

మ్యూజిక్ : అరుణ్ చిలువేరు

ఎడిటర్ : సత్య . జి

శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా వచ్చిన సినిమా ‘శశి’. కాగా లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్‌ హీరోయిన్లు గా నటించగా రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

ఆది (రాజ్) ఎలాంటి కుటుంబ బాధ్యతలు లేకుండా తాగుతూ అప్పుడపుడు తనలోని మ్యూజిక్ ను ప్రదర్శిస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. అతని అన్నయ్య అజేయ్ (అజేయ్) పెళ్లి కూడా చేసుకోకుండా కుటుంబ భారాన్ని మోస్తూ.. తమ్ముడి బాగు కోసం బాధ పడుతూ ఏం చేయలేక కొట్టుమిట్టాడతా ఉంటాడు. ఈ మధ్యలో శశి (సురభి)ని చూసిన రాజ్, ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెతో మధురమైన క్షణాలను ఊహించుకుంటూ ఉంటాడు. అసలు ఇంతకీ సురభి వెనుకే రాజ్ ఎందుకు తిరుగుతున్నాడు ? వాళ్ళ మధ్య గతంలో ఉన్న సంబంధం ఏమిటి ? అసలు శశికి ఉన్న సమస్య ఏమిటి ? అన్నిటికంటే ముఖ్యంగా రాజ్ ఎందుకు బాధ్యత లేకుండా తయారయ్యాడు ? అతని జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాలో తన ఇమేజ్ కి కాస్త కొత్తగా ట్రై చేసిన ఆది తన నటనతో సినిమాలోనే హైలైట్ గా నిలిచాడు. అలాగే డిఫరెంట్ వేరియేషన్స్ లో ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోనూ ఆది తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక శశి క్యారెక్టర్ లో హీరోయిన్ గా నటించిన సురభి చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ సురభి నటన చాల బాగుంది. అలాగే రాశి సింగ్ నటన, ఆదితో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఎమోషనల్ సీన్ లో ఆది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మిగిలిన నటీనటులు కూడా తమకిచ్చిన చిన్న పాత్రల్లో నటించారు. రాజీవ్ కనకాల, అజయ్, వెన్నెల కిషోర్ లకు పెద్దగా స్క్రీన్ టైం కూడా లేకపోయినా ఉన్నంతలో తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. అలాగే కమెడియన్ హర్ష కూడా బాగానే నవ్వించాడు.

 

మైనస్ పాయింట్స్

దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల లవ్ అండ్ ఎమోషన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి.

సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న ఎమోషన్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దాంతో సీన్స్ బోర్ గా సాగాయి. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా ఇన్ వాల్వ్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది. అలాగే హీరో పాత్రను ఆ పాత్ర తాలుకు ఆర్క్ ను ఇంకా బాగా రాసుకోవాల్సింది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు సరైన కథ కథనాలని రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. అలాగే పాటల్లో కూడా రెండు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

 

తీర్పు :

ఎమోషనల్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ ఆది నటన, సురభి గ్లామర్ అలాగే సాంగ్స్ బాగున్నాయి. అయితే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైంది. లవ్ స్టోరీస్ లో ఎదురయ్యే కొన్ని నాటకీయ పరిణామాలను, సమస్యలను దర్శకుడు ఆసక్తికరంగా చూపించలేకపోయారు. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ అలాగే కొన్ని లవ్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. మొత్తం మీద ఈ సినిమాలోని కొన్ని ఎలెమెంట్స్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారికి నచ్చుతాయి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version