సమీక్ష : “సీటీమార్” – మాస్ ను అలరించే యాక్షన్ ఎంటర్టైనర్

సమీక్ష : “సీటీమార్” – మాస్ ను అలరించే యాక్షన్ ఎంటర్టైనర్

Published on Sep 11, 2021 9:09 AM IST
Seetimaarr Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌
దర్శకుడు: సంపత్‌ నంది
నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి
సంగీత దర్శకుడు: మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్రఫీ: ఎస్‌. సౌందర్‌ రాజన్‌
ఎడిటర్: త‌మ్మిరాజు


ఈ ఏడాది కరోనా రెండో వేవ్ తర్వాత రిలీజ్ అయ్యిన చిత్రాల్లో ఇప్పుడు రిలీజ్ అయ్యిన “సీటీమార్” భారీ అంచనాలతో వచ్చింది. మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ చిత్రం పక్కా మాస్ అండ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ గా వచ్చింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలు అన్నిటినీ అందుకుందో లేదో సమీక్షలో పరిశీలిద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వచ్చినట్టయితే కార్తీక్ (గోపీచంద్) ఓ పక్క ఓ బ్యాంక్ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గానే కాకుండా మహిళా కబడ్డీ టీం కోచ్ గా కూడా వర్క్ చేస్తాడు. మరి క్రమంలో తన టీం తో ఎన్నో కష్టాలు పడి నేషనల్ లెవెల్లో కప్ కొట్టాలని సిద్ధం చేస్తాడు. మరి సరిగ్గా ఇదే సమయంలో తన పర్శనల్ లైఫ్ లో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. మరి తన లైఫ్ లో చేంజ్ అయ్యిన ఘటన ఏంటి? తన టీం నేషనల్ లెవెల్లో గెలిచిందా లేదా? ఇంతకీ కార్తీక్ కి జ్వాలా రెడ్డి(తమన్నా) రోల్ కి ఉన్న కనెక్షన్ ఏమిటి అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

నిజానికి ముందు ఒక విషయాన్ని చూపించి తర్వాత దానిని కాకుండా వేరే విషయం చూపి మెప్పించడం అనేది మామూలు విషయం కాదు సరిగ్గా ఈ సినిమా విషయంలో కూడా ఇదే కనిపిస్తుంది. మొదట చాలా మంది కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా అనుకోవచ్చు కానీ దర్శకుడు మరిన్ని వేరే ఎలిమెంట్స్ జోడించి రక్తి కట్టించారు. తాను ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కానీ నడిపించిన తీరు కానీ చూసే వీక్షకుడికి ఎంగేజింగ్ గా ఉంటుంది.

ముఖ్యంగా సినిమాలో యాక్షన్ బ్లాక్ కానీ ఎమోషన్స్ కానీ సాలిడ్ గా ఉంటాయి. ఇక గోపీచంద్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత తన నుంచి తన కటౌట్ కి తగ్గ సాలిడ్ రోల్ చేసారని చెప్పొచ్చు. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ లోనే కాకుండా కోచ్ గా కీలక ఎమోషన్స్ ని కూడా బాగా పండించాడు గోపీచంద్. అలాగే తమన్నా కూడా ఎక్కడా తగ్గలేదు తనకీ మంచి రోల్ కనిపిస్తుంది.

గ్లామర్ కి గ్లామర్ నటన ఎమోషన్స్ అన్నీ కూడా తన రోల్ లో బ్యాలన్స్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా జ్వాలా రెడ్డి సాంగ్ లో హైలైట్ గా కనిపిస్తుంది. మరి అలాగే భూమిక చిన్న రోల్ లో కనిపించినా మంచి రోల్ చేసింది రావు రమేష్ సహా పోలీస్ రోల్ లో కనిపించిన రెహమాన్ అలాగే కబడ్డీ ప్లేయర్స్ గా కనిపించిన యువ నటీమణులు కూడా తమ రోల్స్ మేరకు తమ బెస్ట్ అందించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో పలు చోట్ల ఫ్లో మిస్సయ్యినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో లైట్ గా నెమ్మదించినట్టు అనిపిస్తుంది. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో బాగా లాజిక్స్ మిస్సయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే హీరో మరియు విలన్ కి మంచి ఫ్లో అండ్ లైన్ ఉంటుంది..

దానిని ఇంకా బెటర్ గా గ్రిప్పింగ్ గా చూపించి ఉంటే బాగుండేది. సాంగ్స్ కూడా సినిమాలో బానే ఉన్నా కథనం కాస్త సీరియస్ గా ఉన్నప్పుడు వచ్చినపుడు అనిపిస్తుంది. అలానే క్లైమాక్స్ కూడా ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో మేకర్స్ పెట్టిన ప్రొడక్షన్ విలువలు సాలిడ్ గా కనిపిస్తాయి. మొత్తం సెటప్ సాంగ్స్ లో కానీ కబడ్డీ సెట్టింగ్స్ అంతా మంచి స్టాండర్డ్స్ కనిపిస్తాయి. ఎస్ సౌందర రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాలో చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాని మరో లెవెల్ లో నిలబెట్టడానికి చాలా బాగా వర్క్ అయ్యింది. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తాయి. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా డీసెంట్ అని చెప్పాలి.

ఇక దర్శకుడు సంపత్ నంది వర్క్ కి వస్తే ఇది వరకే గోపీచంద్ తో ‘గౌతమ్ నంద’ అనే సినిమా తీశారు దానికి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు కానీ కమెర్షియల్ గా అది సక్సెస్ కాలేదు. ఆ లోటుని సంపత్ డెఫినెట్ గా ఈ చిత్రంతో తీర్చినట్టే అని చెప్పాలి. తాను ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ ని మంచి ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ కి ఎక్కేలా తీర్చిదిద్దారు. కాకపోతే చిన్న సవరణలు ఉన్నాయి కానీ ఓవరాల్ గా అవి అంత ఎఫెక్ట్ చూపించవు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ “సీటీమార్”.. వాటిని రీచ్ అయ్యేలా ప్రామిసింగ్ గా వచ్చింది. గోపీచంద్ సహా దర్శకుడు సంపత్ నందికి కూడా ఇది మంచి కం బ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఆకట్టుకునే కథనం వంటివి మాస్ ఆడియెన్స్ ని అలరిస్తాయి. జస్ట్ చిన్న లాజిక్స్ పక్కన పెడితే ఈ వారాంతానికి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు